Monday, December 23, 2024

వార ఫలాలు 10-03-2024 నుండి 16-03-2024 వరకు

- Advertisement -
- Advertisement -

మేషం:    ఈ వారం మేషరాశి వారికి ఉద్యోగస్థులకు స్థానచలన సూచనలు గోచరిస్తున్నాయి.  సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు.  ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు, మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.  మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని చాలా మంది అనుకుంటారు‌ చేస్తారు.  ప్రతి కోణంలోనూ మీకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. పిల్లల విషయంలో మీరు పెట్టుకున్న ఆశలు నూటికి ఎనబై శాతం అనుకూలిస్తాయి.

 వృషభం: ఈ వారం వృషభ రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగ పరంగా నూతన అవకాశాలు కలిసి వచ్చే పరిస్థితి గోచరిస్తోంది.  ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు . సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. నూతన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృధా ఖర్చులు ఎక్కువ అవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో తోటి ఉద్యోగుల ప్రవర్తన ఇబ్బందులకు గురిచేస్తుంది. బ్యూటీ పార్లర్, అలంకార సామాగ్రి అమ్మే వారికి, టీవీలలో, సినిమాలలో ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. రాజకీయ రంగాలలో వారికీ ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు సభలలో, సమావేశాలలో పాల్గొంటారు.

మిథునం:  ఈ వారం మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వివాదాల నుండి బయటపడతారు. అప్రయత్న కార్యసిద్ధిని పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు.  సంతాన విద్యా విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి.  నూతన బుణాలు విషయంలో జాగర్తలు తీసుకోండి. కుటుంబంలో కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. చేతిలో ఉన్న డబ్బుల్ని భూమి మీద పెట్టుబడి పెడతారు.  శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. మీ మీద ఉన్న బాధ్యతలను నెరవేర్చుకో గలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు.

కర్కాటకం :  ఈవారం కర్కాటక రాశి వారికి అన్ని విధాలా కొంత జాగ్రత్త వహించవలసిన సమయం గా చెప్పవచ్చు. ఆర్ధిక పరంగా కొంత ఇబ్బందులు ఉండే అవకాశములు వున్నాయి .  నిర్ణయాలను నిదానంగా ఆలోచించి తీసుకోవాలి. కుటుంబ పరంగా  జీవిత భాగస్వామితో  స్వల్ప విరోధలు ఉండే అవకాశములు ఉన్నాయి. ఖర్చులు అధికం అవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. కొన్ని శుభకార్యాల బాధ్యత మీదే అవుతుంది. వ్యాపారస్తులకు చిక్కులు ఏర్పడవచ్చు, జాగ్రత్త వహించండి. ముఖ్యమైన డాకుమెంట్స్ విషయంలో జాగర్తలు తీసుకోవాలి. సాఫ్ట్ వేర్ రంగం వారికి గడ్డు కలం నడుస్తోంది.  అనుకున్న సమయానికి ఉద్యోగం  రాక నిరాశ చెందుతారు.

సింహం: సింహరాశి వారికి ఈవారం చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. బంధు మిత్రులతో కలసి ఆనందంగా గడుపుతారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాల ఫలిస్తాయి . జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపడతారు.రాజకీయ రంగం మీద మీకు ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది, జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగర్తలు తీసుకోవాలి,   శత్రువులపై విజయం సాధిస్తారు. సంతానం విషయంలో మంచి నిరయములు తీసుకోవడం, వారి అభివృద్ధి  మీ  సంతోషానికి కారణమవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి మంచి ఫలితాలుండే అవకాశాలు గోచరిస్తున్నాయి.

కన్య:    కన్య రాశి వారికి  అప్రయత్న కార్యసిద్ధి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహా నిర్మాణ ఆలోచనలు  ఉద్యోగం  కలిసి వస్తాయి.  ఆర్థిక విషయాలలో పురోగతిని సాధిస్తారు. బుణ బాధలు తీరతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. బంధుమిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. హామీలు, సంతకాలు వంటివి చేయవద్దు. ఉద్యోగస్తులకు వ్యయ ప్రయాసలు తప్పవు. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి.
వ్యాపారస్తులకు ఈవారం వ్యాపారం బాగుంది అని చెప్పవచ్చు.  భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.  పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. శుభకార్యాలను పూర్తి చేస్తారు. సంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు.రియల్‌ ఎస్టేట్,  కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌ వారికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి.

తుల: తులరాశి వారికి ఈ వారం  ఉద్యోగస్తులకు సానుకూలంగా వుంది అని చెప్పవచ్చు.  ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ద వహించండి. కొంత ఆశాంతి, అలసట చోటు చేసుకునే అవకాశములు ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. వ్యాపారస్తులకు పలుకుబడి బాగుంటుంది.  వివాహాది శుభకార్యాలు చేస్తారు, బంధు మిత్రులతో కలసి ఆనందంగా గడుపుతారు.  కళారంగం వారికి, సాంకేతిక రంగం వారికి, టివి, సినిమా రంగాల వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు శ్రమకు తగిన పదవులు అందకపోవచ్చు. విద్యార్థిని విద్యార్థులు కృషితో, పట్టుదలతో ముందుకు సాగండి  మంచి ఫలితాలుంటాయి.

వృశ్చికం:  వృశ్చికం వారికి ఈవారం కొంత ప్రతికూలమైన  పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు  పని భారం  పెరిగే అవకాశాలు ఉన్నాయి.వ్యాపారస్తులకు కొంత ఆర్ధిక పరమైన నష్టం సూచిస్తోంది. చంచలత్వమైన నిర్ణయాలు తీసుకోకండి.అనుకూలమైన ఫలితాలు కొంత ఆలస్యంగా అయినా వచ్చే అవకాశాలు ఉంటాయి. . ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సొంత వారే విరోధులుగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి.విద్యార్థిని విద్యార్థులకు  కష్టపడి చదుకోవడం చెప్పదగ్గ సూచన. విదేశీ ప్రయాణాలు చేయడానికి మంచి సమయం. విదేశాలలో ఉంటున్న వారికీ ఉద్యోగం లభిస్తుంది. వివాహం కానీ వారికి వివాహ ప్రయత్నాలకు మంచి సమయం,
రాజకీయ పరంగా అభివృద్ధి ఉంటుంది.

ధనస్సు:    ధనస్సు రాశి వారికి  ఈ వారం  సర్వత్రా శుభ ఫలితములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి.  ఉద్యోగ పరంగా ప్రమోషన్లు వంటివి కానీ అభివృద్ధి వంటివి అనుకూలమైన ఫలితములను ఇస్తాయి. సాఫ్ట్ వేర్, టెక్నీకల్ రంగం ,వ్యవసాయ రంగం, కళారంగం వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు  .  రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థిరాస్తి వృద్ధి అయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి. వ్యాపారములు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నములు చేయు వారికి కూడా అనుకూలమైన సమయం . అయితే ఎవరో అన్న మాటలు పట్టుకుని మానసిక ఆందోళనలకు గురి అవుతారు. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి.  అయితే ఖర్చుల విషయంలో జాగర్త వహించండి. ఈ వారం రాజకీయ నాయకులు, అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. స్రీలతో ఏర్పడినటువంటి విభేదాలు సమసిపోతాయి.

మకరం:   ఈవారం మకర రాశి వారికి ఆర్ధిక పరమైన లాభములు గోచరిసున్నాయి. కుటుంబ పరముగా సౌఖ్యం, వృద్ధి ఉంటుంది. అయితే బంధువర్గం లో కొద్దిపాటి తగాదాలు, మాట పట్టింపులు ఉండే అవకాశములు ఉన్నాయి.  ఋణాలు, లోన్లు వంటి వాటి  విషయంలో ఒత్తిడి ఉండే అవకాశములు ఉన్నాయి. సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలమైన ఫలితములుంటాయి.మానసిక ప్రశాంతత కోల్పోకుండా జాగర్త వహించండి.విదేశీయానమునకు ప్రయత్నములు చేసే వారికి కూడా మంచి సమయం. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రాశి వారికి అన్ని విధముల బాగుంటుందని చెప్పవచ్చు,  ఎప్పటి నుండో ఉంది పోయిన స్థిరాస్తి తగాదాలు ఏమైనా ఉన్నవారికి ఇబ్బందులు తొలగి పోతాయి. అయితే నిర్లక్ష్యం, అశ్రద్ధ చేయకుండా కార్యసిద్ధి శ్రమించండి. వ్యాపారస్తులకు అనుకూలమైన  సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు మాత్రం కొంత  అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు.

కుంభం:      కుంభ రాశి వారికి ఈ వారం రాబడి పెరుగుతుంది. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. బుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. జీవిత భాగస్వామి నుండి ధన, ఆస్తి లాభం పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. గృహం, వాహనాలు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.రాజకీయ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి.  వృత్తి ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

 మీనం:  ఈ వారం మీనరాశి వారికి ఆర్థికపరమైన లావాదేవీలు నిరాశకు గురి చేస్తాయి. నూతన పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం. ఆరోగ్యం, వాహనాల విషయంలో మెలకువ అవసరం.వృత్తి, వ్యాపారాలలో స్వల్పమైన మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ పర్యటనలు లాభిస్తాయి. దూరప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలం సాగుతాయి.  గృహంలో సంతాన శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి కలుగుతుంది.ప్రతి విషయంలో మీకుంటూ ఒక ప్రత్యేకతను సాధించుకునేందుకు మీరు పడే కష్టం ఫలిస్తుంది.  మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News