Thursday, December 19, 2024

వార ఫలాలు 10-12-2023 నుంచి 16-12-2023 వరకు

- Advertisement -
- Advertisement -

మేషం: ఈ వారం మేషరాశి వారికి  మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నతిధికారుల నుండి పని ఒత్తిడి తద్వారా మీ క్రింద స్థాయి వారికి ఒత్తిడి వంటివి ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి.వ్యాపారస్తులకు ఆర్థికాభివృద్ధి బాగున్నప్పటికీ  భాగస్వామ్యులతో, మిత్రులతో కొంత విభేధములు  ఏర్పడే అవకాశములు ఉన్నాయి.కొంత సహనం, ఓర్పు వహించే సమయంగా అని చెప్పవచ్చు.ఏ విషయాన్నీ అందరితో చర్చించడం వలన ముఖ్యమైన విషయాలలు బయటవాళ్లకు చేరుతాయి. దాని వలన వ్యాపారంలో నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తోంది.విద్యార్థిని విద్యార్థులకు కృషితో, పట్టుదలతో ముందుకు సాగే సమయం అని చెప్పవచ్చు.ఈ రాసి వారు కుబేర కుంకుమతో అమ్మవారిని పూజంచడం చెప్పదగిన సూచన.

వృషభం: వృషభరాశి వారికి ఈ వారం మొదలు పెట్టిన పనులు మొదట కొంత చికాకుగా అనిపించినప్పటికీ వారం ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితాలుండే అవకాశములు ఉన్నాయి.ఉద్యోగస్థులకు కొంత అధికారులతో సానుకూలత ఏర్పడుతుంది, క్రింద స్థాయి ఉద్యోగస్థులతో గౌరవం లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులకు ఖర్చులు అధికమవుతాయి. లాభాలు కూడా అదే విధంగా  ఉంటాయి. ఏమైనప్పటికీ వ్యాపారం కొంత ఉన్నతస్థాయికి చేరుతుందని ఆశ ఏర్పడుతుంది.భవిష్యత్తులో మంచి అభివృద్ధి ఉంటుంది. సొంత నిర్ణయాలు అనుకూలిస్తాయి. సంతానం పురోగతి బాగుంటుంది.  నిత్యం స్వామి వారికీ జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు.

మిథునం: మిథునరాశి వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన వస్తువులు కొనాలనే ఆలోచనలు చేస్తారు. సొంత ఇంటి కల సాకారం చేసేలా ప్రయత్నం చేయండి, మీరు ఒక అడుగు ముందుకు వేస్తేనే పనులు మొదలవుతాయి కాబట్టి ప్రయత్నాలు ప్రారంభించండి.ఉద్యోగస్తులకు అధికారులతో సానుకూలత ఉంటుంది.కుటుంబ పరంగా వ్యవహారములు అనుకూలమైన ఫలితములను  అందిస్తాయి.ఏదైనా కోర్ట్ వ్యవహారములు ఉన్నవారికి కూడా కొంత సానుకూలత ఏర్పడుతుంది.వ్యాపారస్తులకు నూతన ప్రణాళికలు సిద్ధిస్తాయి.స్థిరమైన వస్తువులు కొనుగోలుకు మంచి సమయం..

కర్కాటకం : కర్కాటకరాశి వారికి పూర్తి మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్థులకు చిన్న పాటి టెన్సన్స్ ఉండే అవకాశములు ఉన్నాయి. అయితే అధికారం వృద్ధి చెందుతుంది.మీ అంతర్గత విషయములు గోప్యంగా ఉంచుకోవడం మంచిది.వ్యాపారస్తులకు ప్రజాభిమానం బాగుంటుంది. అభివృద్ధి ఆర్ధిక పరంగా కూడా కనబడుతుంది.  అనుకున్న పనులు, వ్యవహారములలో విజయం సాధించగలుగుతారు.  విలాస వస్తువుల వ్యాపారములు, విలాస పూరిత వ్యాపారస్థులకు మంచి ఆర్ధిక లాభములుండె అవకాశములున్నాయి.రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొద్దిగా వృద్ధి అయ్యే అవకాశములు కనిపిస్తాయి..

సింహం: సింహరాశి వారికి ఈ వారం ఉద్యోగ పరంగా కార్యాలయములలో, పని చేసే చోట సానుకూలత ఉంటుంది. మీ గౌరవం పెరుగుతుంది.అయితే కుటుంబ పరంగా ఇబ్బందులు, చిన్న పాటి మనస్పర్థలు ఏర్పడే అవకాశములు ఉన్నాయి. జీవిత భాగస్వామితో, సంతానంతో అభిప్రాయభేదములు వచ్చే అవకాశములు ఉన్నాయి.ఎవరికీ చెప్పుకోలేని చిన్న చిన్న సమస్యలు ఆలోదోళనకు గురి చేస్తాయి.వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంటుంది అలాగే పలుకుబడి పెరుగుతుంది.ఈ రాసి వారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అలాగే కాలభైరవ రూపు ధరించడం శ్రేయస్కరం.

కన్య: కన్యారాశి వారికి ఈవారం అన్ని విధముల బాగుందని చెప్పవచ్చు.  ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైన  ఫలితములుంటాయి. సాఫీగా, యధావిధిగా కొనసాగుతుంది.మీరు గతంలో తీసుకున్న ధైర్యమైన నిర్ణయములు ఇప్పుడు అనుకూలమైన లాభములు ఉండడం మీకు సంతోషాన్ని కలుగచేస్తుంది. వివాహ సంబంధిత విషయములు, వ్యవహారములు  వంటివి సానుకూల పడతాయి.వ్యాపారస్తులకు ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ పరంగా కూడా అభివృద్ధి బాగుంటుంది.అనుకోని విధంగా అవార్డులు, రివార్డులు అందుకునే అవకాశములు ఉన్నాయి. బంధువర్గంలో కూడా మన్ననలు పొందుతారు.ఈ రాశీవారు విష్ణు ఆలయంలో  అర్చన చేయడం చెప్పదగిన సూచన, కాలభైరవ రూపు ధరించడం మంచిది.

తుల: తులారాశి వారికి ఈవారం విద్యార్థులకు అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. నూతన విద్యా  ఆలోచనలకు, కొత్త కోర్సులలో చేరుటకు మంచి సమయం అని చెప్పవచ్చు.  ఇప్పుడు తీసుకునే నిర్ణయములు లాభిస్తాయి.ఉద్యోగస్తులకు  అధికారుల వలన ఇబ్బందులు, వారి నుండి వర్క్ ప్రెషర్ ఉండే అవకాశములు ఉన్నాయి.వ్యాపారస్తులకు కొంత నష్టములు చవిచూసే అవకాశములు ఉన్నాయి ఈ వారం, జాగ్రత్త  వహించాలి.కుటుంబ పరంగా అనుకూలత ఉంటుంది. కుటుంబం యొక్క అండదండలు ఉంటాయి.మానసిక ఆందోళనలను పక్కకు పెట్టి ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగితే శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది.నిత్యం స్వామి వారికీ జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు.

వృశ్చికం: ఈవారం వృశ్చికరాశి వారికీ అన్ని విధముల జాగ్రత్త వహించాల్సిన సమయం అని  చెప్పవచ్చు. తాత్కాలిక విజయములకు, మాటలకు  లొంగిపోయి చేసే పనుల పట్ల నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు.ఉద్యోగస్తులకు అధికారులతో లేనిపోని వైరం, అపవాదులు ఏర్పడవచ్చు. వాటి వలన మీకు తెలియకుండా, మీ వెనుక జరిగే పనులకు మీరు చిన్నపాటి అవమానములు ఎదుర్కొనవలసి రావచ్చు.వ్యాపారస్తులకు డబ్బుతో పటు కొంత కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లవచ్చు. వ్యవహారాలలో కొంత విఘ్నాలు ఏర్పడవచ్చుకుటుంబ పరంగా సొంత వారితో కొద్దిపాటి విరోధములు, తగాదాలు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించండి.ఈ రాశీవారు ఇష్ట దైవారాధన చేయడం శ్రేయసకరం.

ధనస్సు: ధనుస్సు రాశి వారికి మధ్యస్థ ఫలితములు గోచరిస్తున్నాయి. కుటుంబపరంగా సుఖ సంతోషములు ఏర్పడతాయి. బంధు మిత్రులతో ఆనందంగాగడుపుతారు.ఉద్యోగస్తులకు  మార్పులకు అంత మంచి సమయం కాదు. చంచలంగా మీరు తీసుకునే నిర్ణయములు మీకు ఇబ్బందులను తెచ్చిపెడతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు.వ్యాపారస్తులకు లాభనష్టముల విషయంలో మిశ్రమ ఫలితములు ఉండే అవకాశములు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ  అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు.శత్రువర్గం పొంచి వుంది జాగర్త వహించాలి.కొంత అప్రమత్తంగా ఉండడం చెప్పదగ్గ  సూచన.ప్రతి నిత్యం ఓం నమో వెంకటేశాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం.

మకరం: మకరరాశి వారికి ఈవారం ఉద్యోగ పరంగా అభివృద్ధి పైఅధికారులతో  అనుకూలత ఏర్పడుతుంది.వ్యాపారస్తులకు అన్ని విధముల బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, స్థిరాస్తి వృద్ధి చేసుకోవాలనుకునే వారికి మంచి సమయం అని చెప్పవచ్చు,  అయితే వ్యసనములు, విలాసములు విషయంలో జాగ్రత్త వహించండి.ఎప్పటినుండో కొనాలనుకునే ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.  నూతన ఉద్యోగావకాశములు కొరకు చేసే ప్రయత్నములు ఫలిస్తాయి.విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితములు  ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి.ఆరోగ్య పరంగా కొంత ప్రశాంతత ఏర్పడుతుంది. గతంలో  ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లైతే కొంత ఆరోగ్యం మెరుగు అవుతుంది.ఏలినాటి  శని నడుస్తున్నది వలన , 8 శని వారలు శని కి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన

కుంభం: కుంభరాశి వారికి ఈవారం గతంలో  పడిన ఇబ్బందులు ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. కొంత సానుకూలత ఏర్పడుతుంది. ఆర్థికపరంగా కూడా ఇబ్బందులు ఒక కొలిక్కి వస్తాయి. సంతాన పరంగా వారి అభివృద్ధి బాగుంటుంది. గతంలో పడిన ఇబ్బందులు తగ్గి కొంత తృప్తి అనేది ఉంటుంది.ఉద్యోగస్తులకు అనుకున్న పనులు నెరవేరుతాయి. కార్యాలయములలో, పని చేసే చోట అందరితో మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అలాగే వ్యాపారస్థులకు  ఆర్ధికంగా ఇబ్బందులు తొలగుతాయి. మనోవాంఛలు సిద్దిస్తాయి. సంఘంలో గౌరవం పెరిగిందనే విషయం గుర్తిస్తారు.ఏలినాటి  శని నడుస్తున్నది వలన , 8 శని వారలు శని కి తైలాభిషేకం చేయడం అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.

మీనం: మీనరాశి వారికి ఈవారం అతికష్టం మీద పనులు పూర్తి చేయగలుగుతారు. అన్ని విధముల లాభములు ఉన్నప్పటికీ అంత కంటే ఎక్కువ ఖర్చులు మీకు ఆందోళనలను కలుగచేస్తాయి.ఉద్యోగస్తులకు చిన్నపాటి తగాదాలు ఉన్నప్పటికీ అధికారం చేతికి వస్తుంది.సాఫ్ట్ వేర్ రంగంలో వున్నవారికి మంచి ఫలితాలున్నాయి ఈ వారం.  టెక్నీకల్ రంగం వారు, వ్యాపారస్తులకు కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం గా చెప్పవచ్చు. ఆర్ధిక పరంగా లాభనష్టములు మిశ్రమ ఫలితములు ను అందిస్తాయి.ప్రయాణముల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.నూతన  ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి కొంత నిరాశ ఎదురవ్వవచ్చు.స్త్రీలకూ వివాహ ప్రయత్నములు చేసే వారికి మంచి అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. ప్రయత్నములు చేయండి.ఈ రాశీవారు శివాలయంలో అభిషేకం చేయడం అలాగే ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News