Wednesday, January 22, 2025

వార ఫలాలు 11-02-2024 నుండి 17-02-2024 వరకు

- Advertisement -
- Advertisement -

మేషం:  మేషరాశి వారికి ఈ వారం అనుకున్న పనులు అన్నీ అయినప్పటికీ కొంత శత్రువర్గంతో కానీ, మిమ్మల్ని విమర్శించే వారి నుండి కానీ కొంత ఇబ్బందులు ఎదురుపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా మంచి లాభసాటిగా నడుస్తుంది. భార్యాభర్తల మధ్యన కొంత సఖ్యత లోపిస్తోంది.ఆరోగ్య పరంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితాలుంటాయి.

వృషభం:  వృషభరాశి వారికి  ఈవారం  గతంలో కంటే కొంత   అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు అనుకున్న పనులు కానీ, గతంలో అనుకుని ఆగిపోయిన వ్యవహారాలు కొంత ఊరటను కలిగించే విధంగా ముందుకు సాగుతాయి.
కొంత చురుకుగా ప్రవర్తించడం మంచిది. ఉద్యోగస్తులకు  పైఅధికారుల నుండి కొంత ఒత్తిడి ఉన్నట్లైతే  సానుకూలత ఏర్పడుతుంది.  రియల్ ఎస్టేట్ , ఐటీ రంగాల వారికీ బాగుంటుంది. రాజకీయ రంగాల్లో ఉన్నవారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.

మిథునం: మిథునరాశి  వారికి ఈవారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కొంత పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే అధికారులతో మాట పట్టింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆర్ధిక పరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపారస్తులకు కొంత పెట్టుబడుల విషయంలో టెన్సన్స్ ఏర్పడతాయి.  కుటుంబ పరంగా,  సంతాన పరంగా  బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులు విహార యాత్రలకు, దూర ప్రయాణాలలో జాగర్తలు అవసరమని చెప్పదగిన సూచన.

కర్కాటకం : కర్కాటకరాశి వారికి అన్ని విధాల కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు.  చదువుపై మంచి పట్టు ఉన్నప్పటికీ పరీక్షా సమయంలో అది మీకు గుర్తు రాక అంతంత మాత్రంగానే పరీక్షలు రాస్తారు. మానసిక ధైర్యంతో ముందుకు సాగండి. ఉద్యోగస్తులకు పని చేసే చోటైన, కార్యాలయాలలో కానీ కొంత శత్రువర్గం పొంచి ఉందనే విషయం తెలుస్తుంది. వ్యాపారస్తులకు యధాతధంగా ఉంటుంది, నూతన పెట్టుబడులకు మంచి సమయం కాదు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించండి.  రాజకీయ రంగాల్లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

సింహం:  సింహరాశి వారికి ఈవారం  ఉద్యోగ పరంగా కొంత ఇబ్బందులుండవచ్చు. చిన్నపాటి అవమానాలు, తగాదాలుండే సమయం, జాగ్రత్త వహించండి. అయితే సాఫ్ట్ వేర్ రంగం వారికి టెక్నీకల్ రంగాల వారికి సానుకూలత ఏర్పడుతుంది.  రియల్ ఎస్టేట్ రంగం వారికి చురుకుగా పనులు నెరవేరుతాయి.  ఆర్ధిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య పరంగా బాగుంటుంది. ఆహార నియమాలు పాటించడం అవసరం. విద్యార్ధులకి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అని చెప్పవచ్చు.

కన్య:   ఈవారం కన్యారాశి వారికి స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. ఉద్యోగం పట్ల, పని పట్ల జాగ్రత్త వహించండి. కుటుంబ తగాదాలకు, ఆఫీస్ విషయాలకు ముడి పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు సాధారణంగా నడుస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికీ బాగుంది. ఐటీ రంగం వారికీ కొంత ఇబ్బంది ఎర్పడవచ్చు, కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. నూతన విద్యా కోర్స్లు అభ్యసించడానికి,  విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పాస్ పోర్టులు వంటి పనులు అయినప్పటికీ వీసాలు విషయంలో కొంత ఒడిదుడుకులు తప్పవు.

తుల: తులారాశి వారికీ ఈవారం  కుటుంబ పరంగా, మిత్ర బృందం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సంతాన విషయంలో సంతృప్తి లభిస్తుంది. అయితే ఆర్ధిక  పరంగా కొంత మానసిక ఆందోళనలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు అధికం అవుతాయి. ఉద్యోగస్తులకు కొంత ఉద్యోగ స్థిరత్వ విషయంలో ఆందోళనలు ఉండే అవకాశాలు ఉన్నాయి. సుగంధ ద్రవ్యాలు, విలాసవంతమైన వస్తువులు, ఫుడ్ వ్యాపారస్తులకు, సాఫ్ట్ వేర్ రంగాల వారికి మంచి సానుకూలమైన  ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. విద్యార్ధులకు మీరు తలచుకుంటే ఏదైనా సాధిస్తారు.  పక్కవారి మాటలు పట్టించుకోవద్దు.

వృశ్చికం: వృశ్చిక రాశి వారికి  ఈవారం స్థిరాస్తి విషయాలలో,  ఎప్పటి నుండో వాయిదాలు పడుతున్న తగాదాల విషయంలో ఒక నిర్ణయం వలన పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యవహారాలు ప్రయత్నిస్తే ఒక కొలిక్కి వస్తాయి.  ఉద్యోగ పరంగా కొంత పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి కానీ ఏర్పడవచ్చు. ధైర్యంగా ముందుకు సాగండి.  సంతాన పరంగా కొంత అలసట, నిరాశ ఏర్పడుతుంది, వారికి కలిగే చిన్నచిన్న కష్టనష్టాలు కూడా మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. కష్టానికి, శ్రమకు తగిన ఫలితం మాత్రమే లభిస్తుంది. మీ ఆశయ సాధన వృధా కాదు. విదేశీ సంబంధమైన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. ఎప్పటినుండో పెండింగులో ఉన్న h1b వీసా వస్తుంది.

 ధనస్సు:  ధనుస్సురాశి  వారికి ఈవారం గతంలో ఏర్పడిన చికాకులు, ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలకు, ఆర్ధిక పరమైన  ఖర్చులకు ప్రణాళికలు జరుగుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు కూడా కొంత పని ఒత్తిడి తగ్గే  అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగా కొంత ఒడిదుడుకులు, సమస్యలు ఎదుర్కునే వారికీ మంచి పరిష్కారం దొరుకుతుంది.  వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్ధిక పరంగా అంతంత మాత్రంగా ఉంటుంది. యువకులు ఈ వారం అనవసరమైన విషయ వ్యవహారాలలో తలదూర్చి లేనిపోని చిక్కులు నెత్తికి తెచ్చుకుంటారు. కొంత అప్రమత్తత అవసరం.

మకరం: మకరరాశి వారికి ఈవారం  మిగిలిన అన్ని విషయములలో కొంత నిరాశ నిస్పృహలు ఏర్పడినప్పటికీ కుటుంబ పరంగా అండదండలు ఉంటాయన్న ధైర్యం కలుగుతుంది. నూతన వస్తువుల కొరకు ఆరాటపడతారు.  బంధువర్గంలో కూడా చిన్నచిన్న మనస్పర్థలు ఉన్నప్పటికీ జీవిత భాగస్వామి నుండి, కుటుంబం నుండి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు   పైఅధికారులతో నిరాదరణ ఏర్పడవచ్చు.  ఆర్ధిక పరంగా కూడా అనుకున్న  ఫలితాలు ఉండకపోవచ్చు. దమ్మిడి ఆదాయం లేకున్నా ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి.  వ్యాపారస్తులకు సాధారణంగా  ఉంటుంది.   జీవిత భాస్వామి సలహాలు, చర్చలు మీకు కొంత వరకు ఊరటని కలుగచేస్తాయి. యువత వ్యసన పరులతో, విలాసవంతమైన జీవితం గడిపేవారితో స్నేహాలు తక్కువ చేయడం మంచిది.

కుంభం: కుంభరాశి వారికి ఈవారం  కుటుంబ పరంగా కూడా చిన్న పాటి మాట పట్టింపులు, తగాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కొంత వృధా ప్రయాస, అనుకోని టెన్సన్స్ ఉంటాయి. గ్రహగతులు అనుకూలంగా లేనందున కొంత ఫలితాలు ఆలస్యంగా గోచరిస్తున్నాయి. అంతే కానీ మానసిక ధైర్యం కోల్పోవద్దు. మీ యొక్క మాటకారి తనం వలన శత్రువర్గం వారు మిమ్మల్ని చెడుగా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కొంత తక్కువ జీతంతో తాత్కాలిక ఉద్యోగం అయినా లభించే అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధి తొందరలోనే ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి దగ్గరదాకా వచ్చి సంబంధాలు కుదరకపోవడం, రెస్పాండ్  లేకపోవడం వంటివి జరుగవచ్చు. శనికి తైలాభిషేకం చేయించండి. వ్యాపారస్తులకు కొంత ఊరటనిచ్చే కాలం అని చెప్పవచ్చు.  జీవిత భాగస్వామి  సలహాలు, సంప్రదింపులు లాభిస్తాయి.

మీనం:   మీనరాశి వారికి ఈవారం అన్ని విధాల బాగుంటుంది. కుటుంబ పరంగా, బంధువర్గంలో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు కొంత పని ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తి వృద్ధి చేయాలనే వారికి, నూతన గృహం తీసుకోవాలి అనుకునే  వారికి  మంచి అనుకూల సమయం. కుటుంబంలో జరిగే సంఘటనలు ఇతరులపై అసహనాన్ని ప్రదర్శించకండి. ఆర్ధిక పరంగా ఖర్చులు అధికమవుతాయి. స్థిరమైన నిర్ణయాలతో వివాహాది శుభకార్యాలను జరిపించుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితములు ఉండే సమయం.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News