Thursday, January 23, 2025

వార ఫలాలు(11-08-2024 నుండి 17-08-2024 వరకు)

- Advertisement -
- Advertisement -

మేషం:    మేషరాశి   వారికి  ఈ వారం  అనుకూలంగా ఉంది. ఆకస్మిక అదృష్టం కలిసి వస్తుంది. సాధారణంగ జరగవలసిన శుభకార్యాల పట్ల మీకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఆందోళన పడరు. ఉద్యోగంలో ప్రమోషన్‌ కొరకు పరీక్షలు వ్రాసి అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ప్రమోషన్‌ ఆర్డర్స్  అమలు కావడం చాలా ఆలస్యమవుతుంది. కార్యాలయంలో నీచరాజకీయాలు, నిరుద్యోగులైన విద్యావంతులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.వ్యాపారంలో నూతన ప్రయోగాలు మంచి ఫలితాలనిస్తాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీకి ప్రజలలో గుడ్‌విల్‌ నమ్మకం పెరుగుతుంది. నైతిక బాధ్యతలను విస్మరించారని సన్నిహిత వర్గం నుండీ ఆరోపణలు వస్తాయి.సహనం వహించడం వలన మేలు జరుగుతుంది. మీ సలహాలు, సూచనలు  ఇతరులకు ఉపయోగపడుతుంది. కష్టే ఫలి అన్నట్లు గా వ్యవహరిస్తారు,

వృషభం:  వృషభ రాశి వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబం పట్ల శ్రద్ధ ఉందని, ఆప్యాయత ఉందని, కుటుంబ సభ్యుల మీద విశ్వాసం ఉందని నిరూపించుకోవలసి రావటం మీ మానసిక వైరాగ్యానికి కారణం అవుతుంది. నూతన వ్యాపార పరంగా పెట్టుబడి పెట్టడానికి  కృషి చేస్తారు. కీలకమైన పోటీ పరీక్షలలో నామమాత్రంగా శ్రమించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. అనుమానాలకు తావిఇవ్వకుండా మెలకువతో వ్యవహరించండి.  కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు.   కృతజ్ఞతలేని వ్యక్తులను పట్టించుకోకూడదని నిర్ణయించుకుంటారు.ఆరోగ్యం నలతగా ఉంటుంది, తలనొప్పి లేక చర్మ సంబందించినవి కొద్దికాలం బాధిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుంది.

మిథునం:   మిథునరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానానికి విద్యాసంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. జీవితభాగస్వామితో సంబంధబాంధవ్యాలు బాగున్నప్పటికీ మధ్యమధ్యలో అభిప్రాయభేదాలు వస్తాయి..  ప్రైవేటు చిట్‌ఫండ్స్‌, ఫైనాన్స్‌ కంపెనీలు, లక్కీ  డ్రాలు, మనీ రొటేషన్‌ స్కీములు వీటన్నింటికీ దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. విద్యా సంస్థలు లాభాల బాటలో నడుస్తాయి. భూమి సంబంధమైన వ్యాపారాలు, కొనుగోళ్ళు, అమ్మకాలు వారాంతంలో లాభిస్తాయి.ఉద్యోగాల విషయంలో మధ్యవర్తుల వల్ల కమీషన్‌ ఏజెంట్ల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించండి.  అహంకారులైన సోమరిపోతులను మీ సర్కిల్‌లో లేకుండా తరిమి కొట్టండి.  ఆరోగ్యం నిలకడగా ఉంటుంది..

కర్కాటకం :  కర్కాటకరాశి వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో మీరు నమ్మిన సన్నిహితుల పనితీరు మీకు నచ్చదు. రెన్యువల్స్‌, లీజు కాలము పొడిగించబడతాయి. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసే వ్యాపారులకు బాగుంటుంది. కమీషన్‌ ఏజెంట్స్‌కు మంచికాలం అని చెప్పవచ్చు. ఉద్యోగానికి సరైన కారణం లేకుండా కొంతకాలం సెలవు పెడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. సినీ రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. అవార్డులు లభిస్తాయి.పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి మధ్యవర్తుల వల్ల  మేలు  జరుగుతుంది. అవివాహితులైన వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది  . మానసిక బలహీనత పనికి రాదు. పెద్దవాళ్ళ  మనస్సు . కష్టపెట్టవద్దు. పెద్దల ఆశీస్సులు, దీవెనలు, శ్రీరామరక్ష అని గ్రహించండి.

సింహం: సింహరాశి వారికి ఈ వారం  అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం బాగుంటుంది.  నిరుద్యోగులైన విద్యావంతులకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ జ్యేష్ట సంతానానికి ఉద్యోగం లభిస్తుంది. దురాశాపరులైన బంధుగణం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి.  బంధువులలో స్త్రీల మధ్య విభేదాలు వస్తాయి. బంధువులలో ఉన్న విభేదాలను పరిష్కరించి ఓ శుభకార్యం నిర్విఘ్నంగా జరగటానికి మీరు కారకులుఅవుతారు. ప్రేమ వివాహాలు ప్రధాన ప్రస్తావనాంశములు అవుతాయి. ఈ వివాదాలు న్యాయ స్థానాల వరకూ  చేరుతాయి. ఇష్టమైన స్వగృహాన్ని ఏర్పరచుకుంటారు.  ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో చేస్తే ఏ పనికైనా మంచి ఫలితాలు ఉంటాయి. భగవంతుడిని నేను చేసే కృషి ఫలించాలని ప్రార్థిస్తారు. బ్యాంక్‌ ఋణాలు సింగ్‌ల్‌ సెటిల్‌మెంట్‌లో పూర్తిచేస్తారు.

కన్య: కన్య రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. వాలంటరీ రిటైర్‌మెంట్‌ గురించి ఇంట్లో ఒత్తిడి వస్తుంది.  ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాలి.జీవితాశయం నెరవేరుతుంది. మీరు ఊహించని విధంగా పదవీప్రాప్తి లభిస్తుంది. శత్రువర్గం మీద ఆధిపత్యం సంపాదించాలనే మీ చిరకాల కోరిక నెరవేరుతుంది.స్థిరచరాస్తులు ఏర్పరచుకుంటారు. ప్రైవేటు వ్యక్తుల నుండి లోన్లు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. లోన్‌ యాప్‌లకు దూరంగా ఉండటం మంచిదని చెప్పదగిన సూచన.వృత్తి, ఉద్యోగాల పట్ల అంకితభావంతో దివారాత్రులు శ్రమిస్తారు. అందరి మెప్పును పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి.కోర్టు వ్యవహారాలు, వాహన సంబంధమైన విషయాలలో జాగ్రత్తగా ఉండండి. నష్టపోయే అవకాశం ఉంది.

తుల: తులారాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన ప్రణాళికలు, కొత్త వ్యక్తులను కలుపుకుని చేసే వ్యాపారాలు లాభిస్తాయి ట్రాన్స్‌పోర్ట్‌, ట్రావెలింగ్‌బిజినెస్‌ వారికి బాగుంటుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో ఒక వ్యక్తిని రక్షించడానికి అతను చేసిన పొరపాటును మీ మీద వేసుకుంటారు.   డబుల్‌ రిజిస్టేషన్‌ పట్ల తస్మాత్‌ జాగ్రత్త వహించండి.   అనుకూలమైనటువంటి శుక్ర గ్రహ ప్రభావం వల్ల విలాసాలు, సౌఖ్యాలు, అనుభవిస్తారు. దూరప్రాంత ప్రయాణాలు విదేశీయానం సంభవిస్తుంది. ఒక ప్రతిష్టాత్మకమైన పదవికి మీ పేరు సిఫార్సు చేయబడుతుంది. కళాసాహిత్యరంగాలకు  సంబంధించి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అంతర్గతమైన రాజకీయాలు, నిష్కారణమైన విరోధాలు, అసూయ కొన్ని ఇబ్బందులకు కారణం అవుతుంది.  రాజకీయపరమైన మార్పులు, చేర్పులు మీకు లాభిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి.

వృశ్చికం:    వృశ్చికరాశి వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. క్రమశిక్షణతో పొదుపు పథకాలను అమలుపరచి ఆర్థిక స్థిరత్వం కోసం ప్రయత్నించండి.   దుర్వ్యసనాల ప్రభావం, స్నేహితుల ప్రభావం కొంత  పెడదోవ పట్టించే అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీ మీద ఉన్నటువంటి బాధ్యతను మాత్రం సక్రమంగా నెరవేర్చాలి.  మీ అతి గోప్యమే మీకు శత్రువు అవుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ధనాన్ని పెట్టుబడి పెట్టండి. స్థిరాస్థి వృద్ధి అవుతుంది. చేస్తున్న కృషికి దైవానుగ్రహం లభిస్తుంది. టి.వి. సినీకళాకారులకు, టెక్నీషియన్స్‌కు కాలం అనుకూలంగా ఉంది,  ఉద్యోగంలో ప్రమోషన్‌ వస్తుంది.ఆత్మీయుల మధ్య, భార్యాభర్తల మధ్య వివాదాలు, విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి.  ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన.

ధనస్సు:   ధనస్సు రాశి  వారికి  అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సమస్యలను భూతద్దంలో చూడకుండా వాస్తవాలను గ్రహించండి.  సన్నిహితులు, స్నేహితులు బంధువులతో మంచి పేరు తెచ్చుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది, వైవాహిక జీవితం బాగుంటుంది. ఉత్తముడైన భర్త లభిస్తాడు. బరువు బాధ్యతలని తీర్చుకోగలుగుతారు. సంతానం వల్ల కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది, కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో మీకు ఇష్టం లేకపోయినా ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ ఎదుగుదల చూడలేక కొందరు. నిందలు, పుకార్లు ప్రచారం చేస్తారు. వ్యాపారాల పరంగా  లాభాలు మీరు ఆశించిన విధంగానే ఉంటాయి.విద్యారంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించి,  మీ మాట మంచితనం వల్ల చాలా మందికి మీరు దగ్గరవుతారు.

మకరం: మకరరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పోటీ పరీక్షలలో మీ సామర్థ్యాన్ని  నిరూపించుకుంటారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. కంప్యూటర్‌  విద్య, ఉద్యోగ పరంగా కార్యాలయంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వ్యాపారాల పరంగా మీ స్థాయి యధాతధంగా ఉంటుంది. వివాహప్రయత్నాలు, ప్రేమ వివాహాలు  అనుకూలిస్తాయి.  సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. చెవి, ముక్కు గొంతు సంబంధమైన  ఇబ్బందులు మోకాళ్ళ నొప్పులు వంటి చిన్నచిన్న చికాకు కలిగించే అనారోగ్యాలు ఏర్పడే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. డాక్యుమెంట్సు, అప్లికేషన్స్‌, ఇంటర్వ్యూ కార్జులు, పాస్‌పోర్టులు మొదలయిన విషయాలను అతి జాగ్రత్తగా  పరిశీలించండి. శని గ్రహ ప్రభావం వల్ల సమస్యలను ధైర్యంగా ఎదుర్కోని విజయం సాధిస్తారు.  స్వగృహ యోగ్యత ఉంది. మానసికంగా కొంత వైరాగ్య భావన ఏర్పడుతుంది. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి,

కుంభం:      కుంభ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరమైన సర్దుబాట్లు ఎక్కువగా చేస్తారు. డబ్బులు వస్తాయి కానీ చేతిలో నిలబడవు. సమస్యలు వస్తాయి, సమసిపోతాయి. మనోధైర్యం చాలా అవసరం. మానసిక బలహీనతను సొమ్ము చేసుకునే వారుంటారు. ప్రతి విషయాన్ని మీరు నెగెటివ్‌గా ఆలోచిస్తారు. ఫలితాలు మాత్రం అనుకూలంగా ఉంటాయి.ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపడకుండా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి.  తద్వారా లాభపడతారు. నిష్కారణ శత్రువర్గం ఏర్పడుతుంది. మీరు కోరుకున్న విద్యను చదువుకోవడానికి అవకాశం వస్తుంది. ఉద్యోగ పరంగా వారాంతంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి.  వాస్తవాలను స్పష్టంగా గ్రహించాలి.  ఆధ్యాత్మిక రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మంత్రోపదేశం తీసుకుంటారు.

మీనం: మీనరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యారంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు.  విదేశాలలో చదువుకోవడానికి అవకాశం వస్తుంది. పోటీ పరీక్షలకు ముందు చికాకులు ఎదురైనా విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. ఐ.ఏ.యస్‌. ఐపి.యస్‌.  పరీక్షలకు సివిల్స్‌ సిద్ధం కావాలని శ్రమిస్తారు. ఉద్యోగపరంగా ప్రమోషన్‌ వస్తుంది.  స్వగృహ యోగం ఏర్పడుతుంది. బుణాలు తీర్చివేస్తారు. స్థిరాస్తులు ఏర్పడతాయి. క్రమక్రమంగా  ఆర్థిక పురోగతి ఉంటుంది. ప్రతిపనిలోనూ కష్టపడితే గానీ ఫలితాలు రావు. అనూహ్యంగా ప్రతి విషయంలోనూ అదృష్టం కలిసి వస్తుందని భావించ వద్దు. పాస్‌పోర్ట్‌, వీసా, గ్రీన్‌కార్డ్‌ లభిస్తాయి.  ప్రభుత్వ సంబంధమైన కొన్ని రకాల ఉత్తర్వులు  మీకు మేలు చేస్తాయి.  ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు వృద్ధి చెందుతాయి. ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. సర్వదా పెద్దల మాట వినడం మీకుశ్రేయస్కరం. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News