Sunday, January 12, 2025

వార ఫలాలు(12-01-2025 నుండి 18-01-2025 వరకు)

- Advertisement -
- Advertisement -

మేషం:   మేష రాశి వారికి ఈ వారం ఆర్థికంగా చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఈ రాశి వారికి మార్చి 29వ తేదీ నుండి ఏలిన నాటి శని ప్రారంభం కాబోతుంది కాబట్టి ముందుగా శనికి తైలాభిషేకం మరియు అఘోర పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగిన సూచన. సంతానపరంగా కొంత దిగులు అనేది ఏర్పడుతుంది. వ్యాపార పరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగ పరంగా చిన్న చిన్న మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం చేతి వరకు వచ్చి చేజారిపోయే పరిస్థితి గోచరిస్తుంది. వివాహ ప్రయత్నాలు నిదానంగా సాగినప్పటికీ మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వత్తులతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య 6, కలిసివచ్చే రంగు మెరూన్.

వృషభం : వృషభ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. కెరియర్ పరంగా బాగుంటుంది. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ప్రాజెక్టులు చేతికి అంది వస్తాయి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. గ్రీన్ కార్డు కోసం హెచ్ 1బి వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం నిదానంగా సాగినప్పటికీ లాభాలు మాత్రం బాగుంటాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండాలి. విదేశీ పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. విద్యార్థులకు కష్టానికి తగిన ప్రతిఫలం అందకపోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5, కలిసివచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు..

మిథునం :  మిధున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన ధనం కంటే ఖర్చు అధికంగా ఉంటుంది కాబట్టి పొదుపు విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు  ఎక్కువగా పాల్గొంటారు. ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే పరిస్థితి గోచరిస్తుంది. సినీ కళా రంగంలో ఉన్నవారికి బాగుందని చెప్పవచ్చు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చిన్నచిన్న ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి గోచరిస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థినీ విద్యార్థులకు కాలం బాగుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు వెల్వెట్..

కర్కాటకం :  కర్కాటక రాశి వారికి ఈ వారం వివాహపరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా గ్యాస్ట్రిక్ మరియు నరాల నొప్పుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారపరంగా మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి.శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఏ పని చేసినా ముందుకు సాగుతుంది చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. పెద్దల సలహాలు సూచనలు పాటించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ..

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అన్ని విధాలుగా బాగుంటుంది. ఉద్యోగం చేసే వారికి కాలం ఇంకాస్త బాగుందని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది.  సంతానం మీరు చెప్పిన విధంగా నడుచుకుంటారు. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి.ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు..

కన్య:    కన్యా రాశి వారికి ఈ వారం వ్యాపారపరంగా బాగుంటుంది. రొటేషన్స్ బాగుంటాయి. మీరు అనుకున్నది సాధించగలుగుతారు. కొన్ని విషయాలు పైకి చెప్పకపోవడం వలన చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. బంధువులతో కలిసి ఎక్కువ సమయం గడుపుతారు. భాగ్యంలో వక్రించిన గురువు ఉన్నారు కాబట్టి కొన్ని మంచి ఫలితాలే ఇస్తారని చెప్పవచ్చు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. పాస్పోర్ట్ వీసా వంటి విషయాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆస్త్మాకు సంబంధించి, గొంతు ఇన్ఫెక్షన్ సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు చంద్రగ్రహ స్తోత్రాన్ని పఠించండి. శివాలయ దర్శనం చేసుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలసి వచ్చే సంఖ్యా 9, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు.

తుల:  తులా రాశి వారికి ఈ వారం ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా బాగుంటుంది. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో కొంత నష్టం వాటిల్లే  పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగులకు మీ ప్రయత్నానికి, మీ అర్హతకు తగినటువంటి మంచి ఉద్యోగం లభిస్తుంది. వాహన యోగం ఉంది. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నరదిష్టి అధికంగా ఉంటుంది.  ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5, కలిసివచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు ఎల్లో..

వృశ్చికం:  వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు బంధు మిత్రులతో కలిసి చాలా ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు విద్యాపరంగా బాగుంటుంది. ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొంత ఇబ్బంది కరమైన వాతావరణం ఉంటుంది. కొనాలన్నా అమ్మాలన్నాకానీ కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులలో ఒకరికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు కాషాయం..

ధనస్సు:   ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. కష్టపడిన దానికి ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఈవారం అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయవద్దు. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. చార్టెడ్ అకౌంటెంట్స్ వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు శని గ్రహ స్తోత్రాన్ని పాటించండి. రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు తెలుపు..

మకరం:   మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా బాగుంటుంది వ్యాపారంలో రొటేషన్ కూడా బాగుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఈ వారం పూర్తవుతాయి. మొత్తం మీద ఈ వారం ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకి అనుకూలంగా ఉందనిచెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కెరియర్ పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ..

కుంభం:     కుంభ రాశి వారికి ఈ వార ఉద్యోగ పరంగా కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. కుంభ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది. ఉద్యోగప్రయత్నాలు చేయండి కలిసి వస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కొన్ని పరిస్థితుల వల్ల ఆలస్యమవుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. వచ్చిన అవకాశాలను చేజార్చుకోవద్దు.  కీలకమైన విషయాలలో సంత నిర్ణయాలు అంతగా శ్రేయస్కరం కాదు.  కుటుంబంలో పెద్ద వాళ్లతో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకుంటే కలిసి వస్తుంది. గృహానికి సంబంధించిన బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసివచ్చే రంగు డార్క్ గ్రీన్..

­ మీనం: మీన రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో కాలాన్ని ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల పరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ పరంగా మీరు ఆశించిన స్థానాన్ని పొందగలుగుతారు. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. క్రెడిట్ కార్డులకు, అప్పులకు దూరంగా ఉండండి. అన్ని బాగుంటాయి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు.  విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధాలు దగ్గర వరకు వచ్చి చేజారి పోయే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు గ్రీన్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News