Sunday, April 13, 2025

వార ఫలాలు(13-04-2025 నుండి 19-04-2025 వరకు)

- Advertisement -
- Advertisement -

మేషం:   మేష రాశి  వారు ఈ వారం ఆర్థికపరమైన అంశాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాల విషయాలలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఏ పని మొదలుపెట్టిన నిదానంగా సాగడం సహ ఉద్యోగులతో విభేదాలు ఏర్పడడం జరుగుతుంది. అధిక కోపం పనికిరాదు. మనసును స్థిరంగా ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా పని ప్రారంభించే ముందు నలుగురి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్లాలి. స్థిరాస్తుల విషయంలో అమ్మకాలు కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయడం అనేది చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మానసికమైన ఒత్తిడిని అధిగమిస్తారు. విద్యార్థినీ విద్యార్థులు మెరిట్ మార్కులు సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. సానుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరమైన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు గ్రీన్.. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు మెరూన్.

వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ నూతన ఉద్యోగం కానీ లభించే పరిస్థితి గోచరిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త వహించాలి. వాహన యోగం ఉంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. విద్యార్థిని విద్యార్థులు మేదో దక్షిణామూర్తి రూపును మెడలో ధరించాలి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. నూతన పెట్టుబడులకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచిఉద్యోగం లభిస్తుంది.  బెట్టింగ్స్ కి స్టాక్ మార్కెట్ కి దూరంగా ఉండాలి. క్రెడిట్ కార్డుల విషయంలో, లోన్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ప్రతిరోజు నుదుటన నాగ సింధూరం ధరించండి అలాగే ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.

 

మిథునం:  మిథున రాశి  వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికపరంగా కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మారడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కెరియర్ పరంగా అభివృద్ధి బాగుంటుంది. మీ పైన దుష్ప్రచారం చేసేవారు ఎక్కువగా ఉంటారు. ఏ పని చేసినా నలుగురిని కలుపుకొని ముందుకు వెళతారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. నూతన పెట్టుబడులు పెట్టడానికి మరియు నూతన వ్యాపారం ప్రారంభించడానికి మరికొద్ది కాలం వేచి ఉండవలసిన సమయం. నూతన గృహం కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంరంగంలో ఉన్నవారికి అనువైన కాలంగా చెప్పవచ్చు. విద్యార్థినీ విద్యార్థులు మెరిట్ మార్కులు సాధిస్తారు. మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. నర దిష్టి అధికంగా ఉంటుంది. మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటారు. సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు కూడా జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఎల్లో.

కర్కాటకం :  కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వీరికి అష్టమ శని పూర్తి అయ్యింది. ఒక రకంగా చెప్పాలంటే వీరికి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఏ పని మొదలుపెట్టిన అందులో విజయం సాధిస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు ఉంటాయి.  భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. గృహం కానీ స్థలం గాని కొనుగోలు చేస్తారు. అమ్మకాలు కొనుగోలు లాబిస్తాయి. మీరు మొదలుపెట్టిన పనులు దాదాపుగా పూర్తవుతాయి. కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్ సమస్యలు ఇ. న్. టి  సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. విద్యార్థినీ విద్యార్థులకు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి భవిష్యత్తు బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. మీరు ఊహించని మలుపులు కొన్ని ఈ వారం చోటు చేసుకుంటాయి.  అవి మంచికే దారి తీస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. కెరియర్ మీద దృష్టి సారించండి. ఆరోగ్యపరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపును మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ.

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది. వీరికి అష్టమ శని ప్రారంభం అయింది. ఈ అష్టమ శని ప్రభావం అందరికీ ఒకేలాగా ఉండదు. కొందరికి అనుకూలంగా ఉంటే మరికొందరికి ప్రతికూలంగా ఉంటుంది. సంతానానికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల కంటే కూడా సొంతంగా చేసే వ్యాపారాలే అనుకూలంగా ఉంటాయి. కళా రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు లభిస్తాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సహ ఉద్యోగులతో విభేదాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శని స్తోత్రాన్ని చదవడం వలన కొంత ఉపశమనం లభిస్తుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మెరిట్ మార్కులు సాధిస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి.సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. క్రెడిట్ కార్డుకి దూరంగా ఉండాలి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో అష్టమూలక తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.

కన్య:    కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవడం చెప్పదగిన విషయం. వ్యాపార పరంగా కొంత ధన నష్టం సూచిస్తుంది. ఆ వచ్చిన ధనం కూడా ఏదో రూపంలో ఖర్చు అవుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా బాగుందని చెప్పవచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి.  కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన గృహం కొనుగోలు చేస్తారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. హెచ్ వన్ బి గ్రీన్ కార్డు విషయంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. మీకున్న తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికి లాభాలు బాగున్నాయి. ట్రావెల్స్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. ప్రతిరోజు నుదుటన నాగ సింధూరం ధరించండి. ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసే వచ్చే రంగు లావెండర్.

తుల: తులా రాశి వారికి ఈ వారం ఆర్థిక పరమైన అంశాలు బాగున్నాయి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యాపార పరంగా ఎక్కువ ఖర్చు చేస్తారు. రావలసిన బాకీలు వసూలు అవుతాయి. ఇంటా బయట అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. ప్రథమార్ధం కంటే కూడా ద్వితీర్థంలో మంచి అవకాశాలు లభిస్తాయి. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఉద్యోగం మారాలి అనుకునే వారికి మంచి సమయంగా చెప్పవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు మొదలుపెట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. మీకు ఉన్న ధైర్యమే మిమ్మల్ని చాలా విషయాలలో ముందుకు నడిపిస్తుంది. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మెరిట్ మార్కులు సాధిస్తారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. స్నేహితులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. ఎవరి మాటలు లెక్కచేయకుండా ముందుకు వెళ్లడం అనేది చెప్పదగిన విషయం. ఉద్యోగంలో స్థాన చలనం సూచిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా వినడం అనేది చెప్పదగిన విషయం. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిల్లో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు గ్రే.

వృశ్చికం:  వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నరదిష్టి అధికంగా ఉంటుంది. ఏ పని మొదలుపెట్టిన వెనక్కి వెళ్లడం జరుగుతుంది. ఏదైనా పనిని ప్రారంభించే ముందు గోప్యంగా ఉంచండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.థైరాయిడ్ గ్యాస్ట్రిక్ అజీర్తి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. నూతన బ్రాంచీలను ఏర్పాటు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థినీ విద్యార్థులకు కొంత నిరాశ తప్పక పోవచ్చు కష్టపడి చదివినప్పటికీ అనుకూలమైన ఫలితాలు పొందలేక పోతారు. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. భూ సంబంధమైన వ్యవహారాలు కలిసి వస్తాయి. కలిసి వచ్చిన నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ప్రతిరోజు నుదుటిన నాగ సింధూరం ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు డార్క్ మెరూన్.

ధనస్సు:    ధనస్సు రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా బాగుంటుంది. మీరు చేస్తున్న పనిలో ఎదురైన చిన్న చిన్న ఆటంకాలను అధిగమిస్తారు. మీరు చేసిన కృషి పట్టుదల వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీరికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. ఈ అర్ధాష్టమ శని అందరినీ ఇబ్బంది పెడుతుంది అని అనుకోవద్దు అందరికీ ఒకేలాగా ఉండవు. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అవసరాన్ని మించి ఖర్చు పెట్టకపోవడం మంచిది. వ్యాపారం యొక్క అభివృద్ధి కోసం మీరు ఇప్పుడు ఖర్చు పెడితే భవిష్యత్తులో లాభాలు బాగుంటాయి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. ఎప్పటినుండో వివాహ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మరియు వివాహ ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉన్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. స్థలం కానీ గృహం కానీ కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేయవచ్చు. బంధు వర్గంతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. చెడు అలవాట్లకి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి.  అలాగే నలుపు వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు, కలిసి వచ్చే రంగు తెలుపు.

మకరం:   మకర రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో అభివృద్ధి బాగుంటుంది. ఎప్పటినుండో పెండింగ్లో ఉన్న స్థిరాస్తి వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. వాహనయోగం ఉంది. శుభకార్యాలను ఘనంగా నిర్వహిస్తారు. అన్ని కార్యక్రమాలను మీరే దగ్గరుండి చూసుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్యపరంగా బాగుందని చెప్పవచ్చు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది.  సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మెరిట్ మార్కులు సాధిస్తారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. కెరియర్ పైన ఎక్కువగా దృష్టి పెడతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. ఆగిపోయిన నిర్మాణపు పనులు మళ్లీ మొదలవుతాయి. ఈ రాశుల జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. చిరు వ్యాపారస్తులకు లాభాలు బాగుంటాయి. గడిచిన వారం కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలసి వచ్చే రంగు తెలుపు.

కుంభం:      కుంభ రాశి వారికి ఈ వారం బాగుంటుంది. కుంభరాశి నుండి శని మీన రాశికిలోకి ప్రవేశించాడు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో అభివృద్ధి ఆశాజనకంగా ఉంటుంది. ఏ పని చేసిన ముందుకు సాగుతుంది. బంధువులతో విభేదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. ఇఎన్టి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులకి దూరంగా ఉండటం అనేది చెప్పదగిన విషయం. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. మీకున్న తెలివితేటలతో అందరిని ఆకట్టుకొని ముందుకు సాగుతారు. కొన్ని కొన్ని సందర్భాలలో సొంత నిర్ణయాలతో నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థినీ విద్యార్థులకు విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాలలో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. మీ మనోధైర్యమే మిమ్మల్ని నిలబెడుతుంది. మీ సహనాన్ని మాత్రం కోల్పోరు. ప్రభుత్వపరమైన రాయితీలు స్కాలర్షిప్పులు లీజులు కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్య పరంగా కాకుండా మిగతా అన్ని విషయాలు ఈవారం బాగున్నాయి. సంతానం విషయంలో క్రమశిక్షణ లోపిస్తుంది. కుటుంబ పురోగతి బాగుంటుంది. ప్రతి విషయంలో కూడా కష్టేఫలి అన్నట్లుగా ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరంగా అభివృద్ధి బాగుంటుంది నూతన గృహం కొనుగోలు చేస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లు కలిసి వస్తాయి. స్థిర చరస్తులు పెరుగుతాయి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. తెరాసలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు బ్లూ.

­ మీనం: మీన రాశి వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. మీన రాశిలో శని సంచరిస్తున్నాడు.  ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఎప్పటినుండో పెండింగ్లో ఉన్న పనులు ఈ వారం పూర్తవుతాయి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ విషయంలో జాతక పరిశీలన చేసుకొని ముందుకు వెళ్లడం అనేది చెప్పదగిన సూచన. ప్రతి విషయంలో కూడా మీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపార పరంగా అభివృద్ధి బాగుంటుంది రావలసిన ధనం చేతికి అందుతుంది. కనులు సకాలంలో పూర్తి చేయడానికి శనికి తైలాభిషేకం చేయించండి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. సంతానం కోసం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపార ప్రదేశాలలో మరియు ఇంట్లో అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. సంఘసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. విహారయాత్రలు చేస్తారు. ట్రావెల్స్ రంగంలో ఉన్నవారికి లాభాలు బాగున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు బ్లూ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News