మేషం: మేష రాశి వారికి మేష రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలపరంగా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. స్థాన చలనం కనిపిస్తుంది. ఏదైనా ఉద్యోగం మారాలనుకుంటే కొంతకాలం వేచి ఉండడం మంచిది. సాధ్యమైనంతవరకు ఉద్యోగ పరంగా సహనం ఓపిక కలిగి ఉండండి. మీరు మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. కాబట్టి ఉద్యోగం విషయంలో స్థిరంగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు మరియు మాట పట్టింపులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో బంధువులతో కూడా మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. కొంతమంది చులకనగా మాట్లాడడం, మీరు ఏ పని చేసినా దాన్ని తప్పుగా చిత్రీకరించడం జరుగుతుంది. ఏది ఏమైనాప్పటికీ ఈ వారం ఎంత సహనంగా ఉంటే అంత మేలు జరుగుతుంది. ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయకుండా దూరదృష్టితో ఆలోచించి పొదుపు చేయండి. సంతాన సంబంధిత విష వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి సంబంధం కుదురుతుంది.
సంతానం యొక్క విద్యా విషయాలు బాగున్నాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని ప్రారంభం కాబోతుంది దీనివలన ఆఫీసులో చికాకులు, పని ఒత్తిడి, చేయని తప్పుకు నిందలు పడవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ప్రతిరోజు 108 సార్లు శని గ్రహ స్తోత్రాన్ని చదివినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. నష్టాలు అయితే ఉండవు. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు కొంతకాలం వేచి ఉండవలసిన సమయం. భాగస్వాములతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. సినిమా రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి బోటిక్స్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు బాగున్నాయని చెప్పవచ్చు. హెచ్ వన్ బి వీసా పాస్పోర్ట్ గ్రీన్ కార్డు వంటివి అనుకూలిస్తాయి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షల సమయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెడలో మేధో దక్షిణామూర్తి రూపును ధరించండి ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. పెద్దల సలహాలు సూచనలు పాటించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు. ఉద్యోగంలో స్థాన చలనం కనిపిస్తుంది. వ్యాపార పరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వారాంతంలో లాభాలు తెచ్చి పెడతాయి. వృత్తిరీత్యా వ్యాపార రిత్యా నలుగురితో కలవలేని పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనా మనకు ఉద్యోగం వ్యాపారం ముఖ్యం అనే ధోరణితో మీరు ఉంటారు. కానీ అహంకారం పెరిగింది అందుకే అందరితో దూరంగా ఉంటున్నారు అని బంధువర్గంలో కానీ బయట వాళ్లతో కానీ విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం అనేది చెప్పదగినది. గైనిక్ సమస్యలు సయాటిక సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు హనుమాన్ చాలీసా చదవడం మరియు మంగళవారం శనివారం రోజున ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించడం, అలాగే ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు స్కై బ్లూ.
వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఏ పని చేసినా నిదానంగా సాగినప్పటికీ పేరు ప్రఖ్యాతలు మాత్రం వస్తాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా ఒక శుభవార్తను వింటారు. అలాగే వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు మంచి సంబంధం కుదురుతుంది. సంతాన సంబంధమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. సంతాన విషయ వ్యవహారాలలో కొంత ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గతవారం కంటే కూడా ఈ వారం వ్యాపార పరంగా బాగుంటుంది. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. వస్త్ర వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు బ్యూటీ పార్లర్ నడిపే వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, సినిమారంగంలో ఉన్న వారికి ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం కాదు ఆలోచించి వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన.
ఏది ఏమైనాప్పటికీ వ్యాపారస్తులకు గతవారం కంటే ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో చిన్నపాటి కలహాలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని వైవాహిక జీవితంలో ముందుకు వెళ్లడం అనేది చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలకు సంబంధించి హెచ్ వన్ బి వీసా , గ్రీన్ కార్డు విషయంలో కొంత ఆలస్యం అవుతుంది. విదేశాల నుండి వచ్చి స్వదేశంలో ఉద్యోగం చేసుకుందాం అనుకునేవారు కొంతకాలం వేచి ఉండండి భవిష్యత్తు బాగుంటుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కష్టపడి చదవండి మంచి ఫలితాలు సంప్రాపిస్తాయి. ఓం నమశ్శివాయ స్తోత్రాన్ని 108 సార్లు చదవండి భగవత్ సంకల్పం లభిస్తుంది. దగ్గర వరకు వచ్చిన సంబంధం చేజారిపోతుంది ఇది మీకు మంచే చేస్తుంది దానికంటే మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు కూడా ఓం నమశ్శివాయ వస్తువులతో దీపారాధన చేయండి. మంగళవారం రోజున లేదా శుక్రవారం రోజున అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రీన్.
మిథునం: మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలపరంగా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడినప్పటికీ అది సమసి పోతుంది. లగ్నాధిపతి చతుర్తాధిపతి అయిన బుధుడు దశమంలో రవి శుక్ర రాహులతో కలిసి ఉన్నారు. కొన్ని కొన్ని పనులు మీ ప్రమేయం లేకుండానే నెరవేరుతాయి అది భగవత్ సంకల్పం అనుకోవచ్చు, లేదా మీ కృషి పట్టుదల అని కూడా అనుకోవచ్చు. మీ కృషి పట్టుదల మిమ్మల్ని ఎల్లవేళలా ముందుకు నడిపిస్తుంది. కుటుంబ విషయ వ్యవహారాలలో లేదా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు ఈ వారం బాగున్నాయని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాల విషయంలో మీకంటూ ఒక స్థానం లభిస్తుంది. కుటుంబంలో వివాహ విషయంలో ఒకరికి ఇబ్బంది ఏర్పడుతుంది వాటిని పరిష్కరించే సమయంలో కొన్ని అపనిందలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. విద్యార్థిని విద్యార్థులకు వైద్య వృత్తిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగం మారవలసిన పరిస్థితి గోచరిస్తుంది.
ఎవరో చెప్పారని ఉద్యోగం మారుదాం, దానిలో డబ్బులు బాగానే వస్తున్నాయి అని కాకుండా స్టెబిలిటీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగం ముఖ్యం. మీకున్న ప్రతిభకు ఎక్కడైనా ఉద్యోగం వస్తుంది పరపతి పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతలు కూడా పెరుగుతాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లడం అనేది చెప్పదగిన సూచన. రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా సానుకూలమైన పరిస్థితిలో గోచరిస్తున్నాయి అయితే ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి వారికి మంచి సంబంధం కుదురుతుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రేమ వివాహాల విషయంలో పెద్దల సలహాలు సూచనలు తీసుకోవడం అనేది చెప్పదగినది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడా నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం శివతాండవ స్తోత్రం చదవడం కానీ వినడం కానీ చేయండి దీని వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు వైట్.
కర్కాటకం : కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు వీరికి అష్టమ శని పూర్తవుతుంది. స్వగృహ నిర్మాణం చేయాలనుకున్న వారికి ఈ వారం మీ కల నెరవేరుతుంది. అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. నూతన వస్తువులు బంగారం కొనుగోలు చేస్తారు. మీకున్న మనోధైర్యమే మిమ్మల్ని చాలా విషయాలలో నిలబెడుతుంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీకు మీరుగా తీసుకుని నిర్ణయాలు మిమ్మల్ని ఎంతగానో అభివృద్ధి దిశలో నడిపిస్తాయి. సంతాన సంబంధమైన విష వ్యవహారాలు ఈ వారం అనుకూలంగా ఉన్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. మీరు పడిన కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది.
వ్యాపారంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన వ్యాపారాలు మరియు భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు ఈ వారం ప్రారంభించవచ్చు. విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనాప్పటికీ ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా సమయం కాబట్టి మేధో దక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం అనేది చెప్పదగిన సూచన. విదేశాలలో ఉన్న వారికి విద్యా పరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. స్టాక్ మార్కెట్కు దూరంగా ఉండటం అనేది చెప్పదగినది. మంగళవారం రోజున శుక్రవారం రోజున మహాలక్ష్మి దేవి అమ్మవారిని ఆరావలి కుంకుమతో పూజించండి దీని వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 8 కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.
సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. ఈ రాశి వారికి అష్టమ శని ప్రారంభం కాబోతుంది. కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే అది మధ్యలో ఆగిపోయే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వచ్చిన ధనం వచ్చినట్టుగానే ఖర్చు అవుతుంది. అప్పులు ఇవ్వడం తీసుకోవడం రెండూ కూడా కలిసి రావు. కిడ్నీ సమస్యలు, ఇండైజేషన్, లివర్ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. షుగరు థైరాయిడ్ వచ్చే అవకాశాలు లేకపోలేదు వాటి విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. ఆహార నియమాలు పాటించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగులపరంగా వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయడం ఇంట్లో విష్ణు సహస్రనామం రోజు వినండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.
కన్య: కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలలో కావచ్చు, భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితంలో ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా, వ్యాపార పరంగా వీరికి అనుకూలంగా ఉంది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని వ్యతిరేకించే వారు ఎక్కువగా ఉంటారు. ఉద్యోగ పరంగా నైనా, వ్యాపార పరంగానే నా మీ సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళండి అవి మంచి ఫలితాలను ఇస్తాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు వెనుక ముందు ఆలోచించండి, అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అని. వారసత్వంగా రావలసిన ఆస్తులు మీకు వచ్చే అవకాశం ఉంది. ఎప్పటినుండో పెండింగ్లో ఉన్న కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా, వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మీ కెరియర్ పైన మరియు సంతానం యొక్క అభివృద్ధి పైన ఎక్కువ శ్రద్ధ వహించండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. మీరు అనుకున్న పదవీ లభిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి లేదా వినండి దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు పర్పుల్.
తుల: తులా రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోవు. ఇల్లు కొనడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉంటే వారాంతంలో పరిష్కరించుకోగలుగుతారు. ఏదైనా పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు నలుగురి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగుంది. వ్యాపారంలో రొటేషన్సు బాగుంటాయి. భాగస్వామ్య వ్యాపారాల కన్నా మీరు సొంతంగా చేసే వ్యాపారాలలో లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగం మానేసి వ్యాపారం ప్రారంభిద్దామని మీరు చేసే ఆలోచనలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.
సంతాన సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ సంబంధం విషయంలో జాతక పరిశీలన చేసుకొని ముందుకు వెళ్లడం అనేది చెప్పదగిన విషయం. విదేశాలకు వెళ్లాలనుకునేవారు విదేశీ ప్రయత్నాలు చేయవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకూలంగా ఉంది. మీరు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. నలుగురిలో పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టపడతారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టపడి చదవండి మంచి ఫలితాలు పొందగలుగుతారు. చిరు వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు పాలు నీళ్లు కూరగాయల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం మరియు మంగళవారం శుక్రవారం రోజున ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు లెమన్ ఎల్లో.
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. నలుగురిలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవడానికి ఎంతగానో కష్టపడతారు. అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అందరికంటే కూడా మీరు ఆకర్షణీయంగా కనబడతారు. ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. వ్యాపారంలో మంచి స్థాయిని స్థానాన్ని సంపాదించుకుంటారు. నూతన వ్యాపారాలు మరియు పెట్టుబడులు కలిసి వస్తాయి వ్యాపారం చేసే వారికి ఈ వారం అధిక ధన సూచన కనిపిస్తుంది. వచ్చిన ధనాన్ని సక్రమంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. ఈ వారం ప్రతమార్తం కంటే ద్వితీయార్థంలో సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. చేయని తప్పుకు నిందలు పడడం, ఉన్నపలంగా ఉద్యోగం పోవడం వంటివి సంభవించే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తులపరంగా కొన్ని కలిసి వస్తాయి. పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. ఎన్నో ఏళ్లుగా విడిపోయిన అన్నదమ్ములు ఈ వారం కలుస్తారు. జీవిత భాగస్వామి యొక్క అండదండలు మీకు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం అలాగే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవడం అనేది చెప్పదగిన సూచన. సోమవారం రోజున శుక్రవారం రోజున అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుంకుమార్చన చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో.
ధనస్సు: ధనస్సు రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. కుటుంబ పరమైన విషయాలలో వ్యాపార సంబంధమైన విషయాలలో సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏవి ఉండవు. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కొంత సమయం పడుతుంది వేచి ఉండండి. నూతన గృహం కొనుగోలు చేస్తారు. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధాలు దగ్గర వరకు వచ్చి దూరంగా వెళుతున్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది, ఇది మీ మానసిక సంతోషానికి కారణం అవుతుంది. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్టిక్ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు వైట్.
మకరం: మకర రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వీరికి ఏలిన నాటి శని పూర్తవుతుంది. ఎప్పటినుండో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. సంతానానికి సంబంధించిన విష వ్యవహారాలు సానుకూలపడతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. బంధువులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. బంధువులతో ఏర్పడిన విభేదాలు ఈ వారం తొలగి పోతాయి. విదేశీ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఇంటర్వ్యూలలో పోటీ పరీక్షలలో విజయం సాధించి, మంచి ఉద్యోగం సాధిస్తారు. మీకున్న ధైర్య సాహసాలతో అడుగు ముందుకు వేస్తారు ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు.
కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మూఢమి కారణంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు కొంతకాలం వేచి ఉండండి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. ఈవారం భూమి కొనుగోలు చేస్తారు వాహనయోగం ఏర్పడుతుంది. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఎప్పటినుండో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా 3 కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.
కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే వృత్తి ఉద్యోగాలపరంగా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. పోయిన ఉద్యోగాన్ని మళ్లీ తిరిగి సాధిస్తారు. నడుస్తున్న దశల ప్రకారం ఆరోగ్యపరంగా సల్పమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. బ్యాక్ పెయిన్ గ్యాస్టిక్ సమస్యలు నరాలకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా కొంతవరకు బాగుంది. ఏ పనిని మొదలుపెట్టిన వెనక్కి లాగే వారే ఎక్కువగా ఉంటారు వాటన్నింటిని అధిగమించి ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్లుగా అడుగు ముందుకు వేయండి మంచి ఫలితాలు సంప్రాపిస్తాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయ వివాహారాలు అనుకూలంగా లేవు. ప్రేమ విషయాలు ఇబ్బంది పెడతాయి. సంతానం యొక్క పురోగతి విషయంలో మరింత శ్రద్ధ వహించాలని అనుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ధనం ఉంటేనే సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి అన్న విషయాన్ని ఈ వారం గ్రహిస్తారు. ట్రేడింగ్ కి దూరంగా ఉండటం అనేది చెప్పదగిన విషయం. విద్యార్థినీ విద్యార్థులకు పరీక్షా సమయం కాబట్టి చదువు పైన శ్రద్ధ వహించండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి లాయర్లకు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. కెరియర్ విషయంలో చదువు విషయంలో అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయడం మంగళవారం శనివారం రోజున నవగ్రహ వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని పాటించడం వలన శనీశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. అన్నదానం మరియు గోదానం చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు బ్లూ.
మీనం: మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగంలో స్థానచరలం మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలని అనుకునేవారు మంచి ఉద్యోగం వస్తేనే ఉద్యోగం మారండి లేదంటే చేస్తున్న ఉద్యోగాన్ని యధావిధిగా చేయండి. ప్రతి విషయంలో కూడా ఎవరో చెప్పారని కాకుండా మీకు మీరుగా నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతనే అడుగు ముందుకు వేయండి. భూ సంబంధమైన వ్యవహారాలు సానుకూల పడతాయి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వాహన యోగం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా రొటేషన్స్ బాగుంటాయి. ఫ్యాషన్ డిజైన్ రంగంలో ఉన్నవారికి సినిమా పరిశ్రమలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి హోటల్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు కొంతకాలం వేచి ఉండండి.
ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎంత పొదుపు చేస్తే భవిష్యత్తు అంత బాగుంటుంది. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఒక సంబంధం కుదురుతుంది. అలాగే వైద్య వృత్తిలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ సంబంధమైన లీజులు కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రేమ సంబంధమైన విషయ వ్యవహారాల వివాదాస్పదమవుతాయి. ఆరోగ్యపరంగా ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వీసా పాస్పోర్టు గ్రీన్ కార్డు వంటి విషయాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు గ్రే. ప్రతిరోజు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి అలాగే కాలభైరవ అష్టకం ప్రతిరోజు చదవండి లేదా వినండి దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.