Thursday, December 19, 2024

వార ఫలాలు (17-11-2024 నుండి 23-11-2024 వరకు)

- Advertisement -
- Advertisement -

మేషం:   మేషరాశి  వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేయగలుగుతారు. రావలసిన ధనం ఉంటే  ఈ వారం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంతాన విషయంలో ఉన్న చిన్న చిన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఇంటా బయట మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది పట్టుదలతో ముందుకు సాగుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నాలుగు, కలిసివచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి అలాగే ఉదయం సాయంత్రం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

వృషభం : వృషభ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగంలో కంటే వ్యాపారంలో మంచి అనుకూలత ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు సాధించే విధంగా గ్రహగతులు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు నూతన అవకాశాలు ఈ వారం అంతగా కలిసి రావు. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారాళంలో ఉన్నవారికి ఈవారం బాగుందని చెప్పవచ్చు. పాస్పోర్ట్ వీసా హెచ్ వన్ బి వీసా గ్రీన్ కార్డు పిఆర్ కోసం ప్రయత్నించే వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ మరియు  కళా రంగంలోని వారికి ఈ వారం బాగుంది. ధనాన్ని అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితిలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. కలిసి వచ్చే సంఖ్య రెండు. కలిసి వచ్చే దిక్కు ఉత్తరం. కలిసి వచ్చే రంగు స్కై బ్లూ.

మిథునం:  మిధున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి . వృత్తి ఉద్యోగాలపరంగా బాగుంటుంది వీరికి బాగుందని చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి అయితే వ్యాపారం చేస్తున్న వారి కంటే కూడా ఉద్యోగం చేస్తున్న వారికి కాలం మరింత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. స్థిరాస్తులు కొనడానికి అనువైన కాలంగా చెప్పవచ్చు డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చి ముందుకు సాగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా లేదు. కాబట్టి జాగ్రత్త వహించండి విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కలిసి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే కలరు డార్క్ గ్రీన్.

కర్కాటకం :  కర్కాటక రాశి వారికి ఈ వారం కొంత సానుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఈ వారం బాగుంది కొత్త బ్రాంచీలను ఓపెన్ చేస్తారు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారం తొలగిపోతాయి. విద్యార్థిని విద్యార్థులకు ఈవారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతో విభేదాలు వచ్చాయి పరిస్థితులు ఉన్నాయి. మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు శివనామస్పన చేసుకోవడం శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయడం చెప్పదగిన సూచన. శనివారం రోజు దైవదర్శనం చేసుకోవడం ఎంతో మేలు చేకూరుస్తుంది. వారికి కలిసి వచ్చే సంఖ్యా 4 కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ..

సింహరాశి : సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారస్తులకు కూడా ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. రోటేషన్స్ బాగుంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అంతా అనుకూలంగా లేదని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో చెప్పదగిన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారపరంగా ఈ వారం నత్తనడకన ఉంటుంది. చేసిన పనిని పదిసార్లు చేయవలసిన పరిస్థితిలు గోచరిస్తాయి. సినీ కళా రంగాలలో వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. విద్యార్థుల విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ వారం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు తెలుపు .

కన్య:    కన్యా రాశి వారికి బాగుందని చెప్పవచ్చు గత వారం కంటే కూడా ఇంకా బాగుందని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాలపరంగా, వ్యాపార పరంగా ఏ విషయంలోనైనా సరే కలిసి వచ్చే విధంగా ఈ వారం ఉంటుంది .వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి . భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన . విదేశీ వ్యవహారాలు విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. స్థిరాస్తులను వృద్ధి చేయడానికి ఎంతో శ్రమిస్తారు . విద్యార్థిని విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది విదేశాలలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం లభిస్తుంది ఇంటి లోన్లు మంజూరు అవుతాయి అయితే డాక్యుమెంట్ విషయంలో లోను విషయంలో అన్ని చూసుకొని ముందుకు వెళ్ళండి అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందు చూపుతో ఆలోచన చేసి ముందుకు సాగండి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు గ్రీన్ ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమశివాయ వత్తులతో ఏదైనా శివాలయంలో దీపారాధన చేయండి

తుల:  తులా రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు . ఇంటా బయట మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి ఈవారం  అంతా అనుకూలంగా లేదు. పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. అన్ని మాకే తెలుసు అన్న ధోరణి అవలంబించవద్దు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి గ్రీన్ కార్డు హెచ్1బి వీసా లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ పరంగా బాగుంది. అయితే చిన్న చిన్న ఇబ్బందులు  ఏర్పడినప్పటికీ వాటిని అధిగమిస్తారు. మీ మనోధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన  చేయండి అలాగే సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం చేయడం మంగళవారం రోజు స్వామివారిని దర్శనం చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన  వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు మెరూన్.

వృశ్చికం:  వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగం లోనే మార్పులు చేయవలసిన పరిస్థితిలు గోచరిస్తున్నాయి .అయితే ఉద్యోగ విషయంలో ఉన్న అభద్రతాభావం అనేది తొలగిపోతుంది.  వ్యాపారపరంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు .నూతన ప్రాజెక్టులలో కొంచెం ఆగి నిదానంగా నిర్ణయం తీసుకొని చేయడం అనేది మంచిది మీ ఆలోచన శక్తితో మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి స్కిన్ ఎలర్జీ మోకాళ్ళ నొప్పులు గ్యాస్టిక్ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది .ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే దిక్కు పడమర. కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి

ధనస్సు:   ధనస్సు రాశి వారికి ఈ వారం బాగుంది వృత్తి ఉద్యోగాల పరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి.  విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి ఏదైతే నూతన  గృహం ప్రారంభించారు  అది ఈ వారం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. రుణాలు మంజూరు అవుతాయి. క్రెడిట్ కార్డు విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. సంతానం యొక్క పురోగతి బాగుంటుంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వారమంతా కూడా బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు లభిస్తాయి. ఈ రాశి లో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగులపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ  తెలియని భయం వెంటాడుతుంది. రావలసిన ధనం చేతికి అందుతుంది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రాశి వారు  ఏకముఖి రుద్రాక్షను మెడలో ధరించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు తెలుపు.

మకరం:   మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి స్కిన్ ఏ ఆర్చీలు మరియు బ్యాక్ పెయిన్ మజిల్స్ కు సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నూతన అవకాశాలు కలిసి వస్తాయి నూతన పెట్టుబడులు పెట్టడానికి లోన్లు మంజూరు అవుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అంతా అనుకూలంగా లేదు అయితే కష్టేఫలి అన్న విధంగా మీరు ముందుకు వెళితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.సాఫ్ట్వేర్ రంగంలోని వారికి కొంత గడ్డుకాలంగా చెప్పవచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా 9 కలిసి వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్..

కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి . ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంచెం కొంత ఆలస్యం అవుతుంది మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు అంతగా లావించవు సంతాన విషయంలో మంచి పురోగతి ఉంటుంది. సినిమా రంగంలోని వారికి కళా రంగంలోని వారికి మంచి గుర్తింపు లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ లభిస్తాయి. వ్యాపారంలో చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడుతాయి .అయితే మీ మనోధైర్యంతో వాటిని అధిగమిస్తారు. వారాంతంలో మంచి లాభసాటి దిశలో వ్యాపారం నడుస్తుంది. ప్రతి విషయంలో కూడా కుటుంబ వ్యక్తుల సలహాలు సూచనలు తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు. కలిసి వచ్చే దిక్కు తూర్పు. కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయటం ఎంతో శ్రేష్టం.

­ మీనం: మీన రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు . ఎప్పటినుండో పెండింగ్లో ఉన్న పనులు ఈ వారం పూర్తవుతాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది .విహారయాత్రలు దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సోదర సోదరీమణుల మధ్య ఉన్న విభేదాలు సమస్య పోతాయి. ఉద్యోగ పరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు . నూతన అవకాశాలు కలిసి వస్తాయి . వ్యాపారస్తులకు కూడా కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.  విదేశాలలో ఉన్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది కుటుంబ పరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఏర్పడతాయి .వివాహాది శుభకార్యాలలో విషయంలో నెలకొన్న ఇబ్బందులు తొలగిపోతాయి. మొత్తం మీద ఈ వారం అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం మంచిది కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు గ్రే.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News