Tuesday, December 24, 2024

వార ఫలాలు 17-12-2023 నుండి 23-12-2023 వరకు

- Advertisement -
- Advertisement -

మేషం: మేషరాశి వారికి ఈ వారం కొంత ప్రతికూలమైన  అవకాశములు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా  జీవిత భాగస్వామితో మనస్పర్థలు కొంత తగ్గినప్పటికీ, పెద్దవారితో మాట పట్టింపులు ఏర్పడే అవకాశములు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు కొంత పని ఒత్తిడి, అధికారులనుండి విమర్శలు తగ్గినప్పటికీ మీ పేరు ప్రతిష్టల విషయంలో కొంత మంది తప్పుడు ప్రచారములు చేసే అవకాశం వుంది.   ఓర్పు  వహించండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఈవారం అంత అనుకూలం కాదు. వ్యాపారస్తులకు ఈ వరం బాగుంది అని చెప్పవచ్చు, అయితే పనిని అశ్రద్ధ అనుకోకుండా ముందుకు వెళ్లడం వలన మంచి ఫలితాలుంటాయి. సంగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహం కానీ వారికీ వివాహ ప్రయత్నాలు చేయనుకోవచ్చు.  సుబ్రమణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన.

వృషభం: వృషభరాశి వారికి ఈవారం సంతాన పరంగా అభివృద్ధి ఫలితములుండే అవకాశములు ఉన్నాయి. ఉద్యోగస్తులకు అనుకున్నంత స్థాయిలో ఈవారం ఉండదు, కష్టపడినా దానికి ఫలితం తక్కువగా ఉంటుంది. అధికారుల వలన ఇబ్బందులు పడవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి కొంత నిరాశ అని చెప్పవచ్చు. కానీ ప్రయత్నాలు ఆపకండి, దైవ బలం తోడు వుంటుంది.వ్యాపారస్థులకు ఎదో ఒక రూపంలో ఆర్థికాభివృద్ధి కలసి వస్తుంది. ఖర్చులు కూడా ఎక్కువగా ఖర్చు చేస్తారు.  విందు వినోదాలలో పాల్గొంటారు. గోచార రీత్యా లాభంలో రాహు సంచారం వలన ఖర్చు విషయంలో జాగర్త వహించాలి.లాభాలు వస్తాయి కానీ వాటిని ఖర్చు చేసే విషయంలో అవసరమైతే తప్ప ఖర్చు చేయకుండా ఉండడం మంచిది..

మిథునం: మిథునరాశి  వారికి పూర్తి మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు నెరవేరక పోవడం వలన కొంత మానసిక వత్తిడికి గురవుతారు, ఉద్యోగస్తులకు అధికారం, అభివృద్ధి చేతికి అందిందని ఏమరుపాటుగా ఉండడం మంచిది కాదు.ఎవరిని  నమ్మి అంతర్గత విషయములు చెప్పడం మంచిది కాదు. వ్యాపారస్తులకు మంచి కార్యసానుకూలత, వ్యవహారములు పట్ల విజయములు ఉండే అవకాశములు ఉన్నాయి. మానసిక సంతృప్తి లభిస్తుంది.  కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి  మాట పట్టింపులు  ఉండే అవకాశములు ఉన్నాయి.కోపమును నియంత్రించుకోండి.వివాహ ప్రయత్నములు చేసే వారికి కొంత అనుకూలమైన  ఫలితములు గోచరిస్తున్నాయి.   ఆరోగ్యం  బాగుంటుంది. విద్యార్థిని విద్యార్థులకు  మంచి అనుకూలమైన ఫలితములుండె సమయం అని చెప్పవచ్చు. పట్టుదలతో ముందుకు సాగండి.

కర్కాటకం : కర్కాటక రాశి  వారికి ఈ వారం అన్ని విధముల అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి.  ఉద్యోగస్తులకు మంచి సానుకూలత ఉంటుంది. అధికార వృద్ధి అవుతుంది. మీరు తలపెట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు.
సాఫ్ట్ వేర్ రంగం వారికి  అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు, కంప్యూటర్ రంగం వారికి మంచి విజయములు సంప్రాప్తిస్తాయి.ప్రజాభిమానం, గౌరవం పెరుగుతుంది. ఆర్ధికంగా, అభివృద్ధి బాగుంటుంది.  ఒక్క అడుగు ముందుకు వెళితే పది అడుగులు వెనకు నెట్టినట్టు అనిపిస్తుంది.విద్యార్థిని  విద్యార్థులకు  మంచి సమయం అని చెప్పవచ్చు. కుటుంబతో  సంతోషంగా గడుపుతారు. సంతానంతో స్వల్ప మనస్పర్థలు ఉండే అవకాశములు ఉన్నాయి.  కోపమును అదుపులో ఉంచుకోండి. వివాహ ప్రయత్నములు చేసేవారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు.

సింహం: సింహరాశి వారికి ఈవారం కుటుంబ పరంగా, బంధువులు మూలంగా  కష్టములు కానీ, ఇబ్బందులు కానీ ఏర్పడవచ్చు. లేదా జీవిత భాగస్వామితో, సంతానంతో  విభేధములు  వచ్చే అవకాశములు ఉన్నాయి. నలుగురిలో మాట చెలామణి అవుతుంది.ఏమిటి ఇది అన్ని తెలిసిన మనకే ఇలా ఎందుకు జరుగుతోంది అని మానసికమైన క్షోభకు గురవుతారు. ఉద్యోగస్తులకు సామాన్యంగా  ఫలితములు ఉంటాయి ఈవారం.డబ్బు విలాసాలకు ఎక్కువ ఖర్చు చేస్తారు సేవింగ్స్ చేయడం కూడా ఒక భాగమని గుర్తుచేసుకోండి, రేపటి రోజు మనం ఇబ్బంది పడకూడదు అని గుర్తు పెట్టుకోండి.
విద్యార్థిని విద్యార్థులకు అతి కష్టం మీద అనుకున్న ఫలితాలు సాధిస్స్రు.  ఆరోగ్యం కూడా  జాగ్రత్తగా ఉంచుకోవడం చెప్పదగ్గ సూచన. సంతానం పై  కొంత ప్రత్యేక శ్రద్ద వహించడం మంచిది. కుటుంబం లో కూడా కొంత ప్రశాంతత ఏర్పరచుకోండి. మీ సమస్యలను వారికి అర్ధమయ్యేల చెప్పడం మంచిది.

కన్య: కన్యారాశి వారికి ఈ వారం ఉద్యోగస్తులకు కొంత అశాంతి, అలసట వంటివి ఏర్పడే అవకాశములు గోచరిస్తున్నాయి. పని ఒత్తిడి పెంచుకోకుండా జాగ్రత్తవహించండి.  ఇది  అన్ని విషయములలో అనుకూలమైన  ఫలితములు ఉండే అవకాశములు ఉన్నాయి. కుటుంబ పరంగా అండదండలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం మీ ఆనందమునకు కారణమవుతుంది.వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన సమయం. ఆర్ధిక లాభములతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతుంది. ఎప్పటి నుండో ఇబ్బంది పడే విషయాలు, సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి.. అందిరిని కలుపుకుని వెళ్లడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. వివాహ ప్రయత్నములు అనుకూల  ఫలితాలను ఇస్తాయి.

తుల: తులారాశి వారికి  ఈవారం గతంలో ఏర్పడిన కొన్ని ఇబ్బందులు తొలగిపోయే అవకాశములు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా  బంధువర్గంలో చిన్నపాటి అభిప్రాయం భేదములు ఉన్నప్పటికీ జీవిత భాగస్వామితో సానుకూలత ఏర్పడుతుంది.విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితాలుండే సమయం అని కూడా చెప్పవచ్చు. విదేశములకు పైచదువులకోసం వెళ్ళడానికి ప్రయత్నములు చేసే వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. అయితే మీయొక్క మాట తీరు లో కఠినత్వం ఉండకుండా నిదానంగా ఉండడం చెప్పదగ్గ సూచనా. ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడండి. ఆరోగ్య విషయంలో గతంలో ఉండే సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. ప్రేమ పెళ్లి విషయాలలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇప్పుడు తీసుకునే నిర్ణయం వల్ల  భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని గమనించాలి.

వృశ్చికం: వృశ్చికరాశి వారికి ఈవారం అత్యంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. అతి కష్టం మీద పనులు  పూర్తయ్యే అవకాశములు ఉన్నాయి.  జాగ్రత్త వహించండి.  ఉద్యోగస్తులకు పైఅధికారుల నుండి పని ఒత్తిడి, లేనిపోని నిందలు కానీ, చేయని తప్పుకు మాటలు పడాల్సి రావచ్చు.  కొంత అవమానుములు, అపవాదులు ఉండే అవకాశములు ఉన్నాయి. అయితే మీయొక్క మానసిక ధైర్యం వలన ముందుకు సాగుతారు. ధనం కూడా అధికంగా ఖర్చు అయ్యే అవకాశములు ఉన్నాయి. కుటుంబ పరంగా చిన్న పాటి మనస్పర్థలు ఏర్పడే అవకాశములు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకు అనుకున్నంత ఫలితాలు ఉండకపోవచ్చు. ఆందోళన చెందకండి. కష్టపడి కాకుండా, ఇష్టపడి చదివితే మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించండి. దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. కుదరని పక్షంలో కాలభైరవ అష్టకం పఠించండి మంచి ఫలితాలుంటాయి.

ధనస్సు: ధనస్సురాశి వారికి ఈవారం అంత అనుకూలమైన సమయం కాదు. ప్రతికూల ఫలితములు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా, జీవిత భాగస్వామితో, స్నేహితులతో సానుకూలత ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకు  నీచ స్నేహములు, దుర్వ్యసనములకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. స్నేహితులని నమ్మి మోసపోవద్దు. నూతన ఉద్యోగ  ప్రయత్నములు కొంత ఆలస్య ఫలితాలును  ఇచ్చే అవకాశములు ఉన్నాయి. ఉద్యోగస్థులతో తో స్వల్ప ఇబ్బందులేర్పడవచు. కా పని  భారం పెరిగే అవకాశములు ఉన్నాయి. అధికవ్యయం అయ్యే అవకాశములు ఉన్నాయి. వ్యాపారస్తులకు  ఆర్ధిక లాభములు ఉంటాయి. శత్రువులు కూడాఅలాగే ఈర్ష్యా అసూయ తో వ్యవహరిస్తారు.  మీ దగ్గర పని చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండడం మంచిది, లోకువగా అంటే వారి దృష్టిలో చులకన అయ్యే విధంగా ప్రవర్తించకండి. పనివారే కదా అనుకోవద్దు. తర్వాత ఇబ్బందులుండవచు. మీరు ఆవేశంగాప్రవర్తించడం మంచిది కాదు.

మకరం: మకరరాశి వారికి ఈ వారం  రియల్ ఎస్టేట్ రంగం వారికి భూసంబంధమైన కార్య కలాపాలకు  మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. మనం ఏమి తప్పుచేయలేదు కదా అనే కోపంతో మీరు ప్రదర్శించే ఆవేశం  చిన్నపాటి తగాదాలు జరుగవచ్చు.  కొంత ఆలోచనాపూర్వకంగా మాట్లాడడం మంచిది. వ్యాపారస్తులకు కూడా సానుకూలమైన ఫలితాలుంటాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూల ఫలితాలుంటాయి. అయితే పోటీ  పరీక్షలు, కాపిటషన్ పరీక్షలలో అనుకున్న ర్యాంక్  రాకపోవచ్చు. అలాగే యువత వ్యసనాల విషయంలో, విలాసముల విషయంలో అప్రమత్తంగా జాగ్రత్త వహించండి.ఆరోగ్య పరంగా ఇబ్బందులుంటాయి.  మానసిక ధైర్యం, ఆత్మగౌరవం తో మెలగడం మంచిది.

కుంభం: కుంభరాశి వారికి ఈ వారం అన్ని విధముల అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. ఆర్ధికంగా, కెరియర్ పరంగా ఎప్పటి  నుండో  సతమవుతున్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి.  అలాగే వివాహ విషయంలో చాలాకాలం నుండి ప్రయత్నములు చేస్తున్నాం, ఫలితంలేదు అనుకునే వారికి  కూడా మంచి శుభసూచికలు గోచరిస్తున్నాయి. వివాహా ప్రయత్నములు చేయండి. వివాహం కుదురుతుంది.   ఆదాయం స్థిరత్వం కనబడుతుంది.  నలుగురిలో గౌరవం పెరిగిందనే తృప్తి లభిస్తుంది. కుటుంబ పరంగా  సంతోషంగా గడుపుతారు. శుభకార్యములు, వ్యవహారములు అనుకూలిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు కూడా పెద్దల మాట విని, అవగాహనతో  ప్రవర్తిస్తే మంచి విజయాలు వరిస్తాయి. ఆరోగ్యం  కూడా   గతంలో కంటే బాగుంటుంది.

మీనం: మీనరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నములు అనుకూలిస్తాయి.  మీ కష్టమునకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.సాఫ్ట్ వేర్ రంగం వారికి స్వయం ఉపాధి రంగముల వారికి అనుకూలమైన ఫలితములు ఉండే అవకాశములు ఉన్నాయి. ఉద్యోగస్తులకు అధికారులతో ఏదైనా విభేధములు ఉంటె తొలగి పోతాయి.  వ్యాపారస్తులకు మంచి లాభములుంటాయి. మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తుంది. అయితే అనాలోచిత నిర్ణయములు, ప్రయాణములు ఇబ్బంది పెడతాయి. వివాహాం కానీ వారికి, ప్రయత్నములు  ముమ్మరం చేయండి. మంచి అవకాశములు గోచరిస్తున్నాయి.  స్నేహ వర్గంతో కలయిక ఏర్పడుతుంది. మనోవాంఛలు సిద్ధిస్తాయి.   ఖర్చులు విషయంలో జాగర్త వహించండి.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News