Friday, December 27, 2024

వార ఫలాలు 19-05-24 నుండి 25-05-24 వరకు

- Advertisement -
- Advertisement -

మేషం:    మేషరాశి   వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి.  బ్యాంక్‌ రుణాలు మంజూరు అవుతాయి. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. బంధువులను, మిత్రులను కలిసి ఆనందంగా కాలం గడుపుతారు.  ప్రభుత్వ సంస్థల ద్వారా లాభాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న మీ కోరిక నెరవేరుతుంది.వృత్తి, ఉద్యోగాలలో మీ బరువుబాధ్యతలు పెరుగుతాయి. విదేశాలలో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నించే వారికి కాలం అనుకూలంగా ఉంది.కుటుంబంలోని పెద్దవాళ్ళ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరమవుతుంది. కోర్టులో ఉన్న వివాదస్పద విషయాలు మీకు అనుకూలంగా మారుతాయి.

వృషభం:  వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుండి అనుకోని అవకాశాలు లభిస్తాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సోదరులతో ఏర్పడిన దీర్ణకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి.నిరుద్యోగులైన విద్యావంతులకు కార్యసిద్ధి సిద్ధిస్తుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారంలో స్రీలు సహాయసహకారాలు అందిస్తారు.విద్యార్థిని విద్యార్థులు మెరిట్ మార్కుల సాధిస్తారు నీట్ పరీక్షలు ఉత్తీర్ణులు అవుతారు. కంప్యూటర్ సైన్స్, వైద్య విద్య చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది.
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. యోగా, మెడిటేషన్‌పై దృషి సారిస్తారు. ఫిట్‌గా ఉండటానికి సమయం కేటాయిస్తారు.

మిథునం:   మిథునరాశి వారికి  ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు, బంధుమిత్రులతో  కలసి సంతోషంగా గడుపుతారు. ఆరోగ్య  సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.ఆస్తుల విలువ పెరుగుతుంది.  వాహనం స్వయంగా నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. ఇతరులకు వస్తువులు ఇచ్చి విరోధి అవకండి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు సూచిస్తోంది. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. దూర ప్రాంత విషయాలు, వార్తలు సంతోషం కలిగిస్తాయి.  సహోదరుల మధ్య బేధాభిప్రాయాలురావచ్చు.సినీ కళారంగం వారికీ ఈ వారం బాగుంది, నూతన అవకాశాలు లభిస్తాయి.  డాక్టర్లకు, చార్జెడ్‌ అకౌంటెంట్లకు, విద్యా సంస్థలు నడిపేవారికి మంచి ఖ్యాతి, ఆర్థిక లాభాలు ఉంటాయి.

కర్కాటకం :  కర్కాటకరాశి వారికి  ఈ వారం ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. నూతన విధానాలు అమలు పరుస్తారు.కొంత వరకు మీకు మేలు చేస్తుంది.దురుసుగా మాట్లాడేతత్వానికి స్వస్తి పలుకుతారు. మూఢమి ప్రభావం వల్ల పనులలో జాష్యం జరుగుతుంది.  బాధ్యతల నుంచి ఎంత మాత్రం పారిపోవాలని ప్రయత్నించరు. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. విద్యా సంబంధమైన విషయాలు, విదేశీయాన సంబంధమైన విషయాలు, పిల్లల ప్రవర్తన, క్రమశిక్షణ, అలవాట్లు, స్నేహితులు మొదలైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.   అప్పు ఇచ్చి మరి విరోధులవుతారు. అన్నిటికీ మూలం ధనమే. కృషికి తగిన విధంగా ఫలితాలు వస్తాయి.ఆరోగ్యం పట్ల జాగర్తలు తీసుకోవాలి,

సింహం: సింహరాశి వారికి ఈ  వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి.
బంధుమిత్రులతో సంబంధ, బాంధవ్యాలు మరింత బలపడతాయి.విందు, వినోద కార్యక్రమాలలో ఆశ్చర్యకరమైన సంఘటనలు తెలుసుకుంటారు.ఫర్నిచర్‌ వ్యాపారం, ఫాస్ట్‌ఫుడ్‌ వ్యాపారం, బేకరీలు, హాస్టల్‌ మొదలైన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికీ కొంత నిరాశే ఎదురవుతుంది. కుటుంబంలో స్వల్చ్బమైన అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి. పోటీ పరీక్షలు, విదేశీయానం, ఉద్యోగం వంటి ముఖ్యమైన విషయాలు కుటుంబానికి కలిసి వస్తాయి.
జీవితభాగస్వామి ఆరోగ్య విషయంలో జాగర్తలు తీసుకోండి,  అజాగ్రత్త వల్ల మంచి అవకాశాలు జారిపోవచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఈ వారం కలిసివచ్చే కాలం అని చెప్పవచ్చు.

కన్య:    కన్య రాశి వారికి ఈ వారం  మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అదాయ, వ్యయాలు సరిసమానంగా ఉంటాయి.ఉద్యోగంలో పని భారం అధికమవుతుంది. రకరకాల సమస్యలు అన్నింటికీ మీరే బాధ్యత వహించాల్సిన స్థితి సంభవించే అవకాశం ఉంది.మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.భాగస్వామి వ్యాపారాలు కలసి వస్తాయి.విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు అనుకున్న కాలేజీలో సీటు లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. పొదుపుకు సంబంధించి వురోగతి సాధిస్తారు. గతంలో దాచిన ఆర్థిక పత్రాలు అవసరానికి ఉయోగపడతాయి.
ఆశపెట్టుకున్న వ్యక్తులు మిమ్మల్ని ఆదుకుంటారు. ఎంతోమందికి మీరు అభయహస్తం ఇస్తారు.విదేశీ మోజులో పది వున్న ఉద్యోగం వదులుకోకండి.

తుల: తులారాశి వారికి ఈ వారం  అనుకూలంగా వుంది.  అనుభవజ్ఞుల సలహాలను పాటించి లాభపడతారు. చికాకు, కోపం, అలసట మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం పట్ల జాగర్త వహించండి. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. వ్యాపారస్తులు మెలకువగా వ్యవహరించవలసి ఉంటుంది. పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. గణపతిని పూజించడం వలన  ఆటంకాలను అధికమించగలుగుతారు. జీవన శైలిలో స్వల్చ్బమైన మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ పరంగా జరిగే మార్పులు కొంత ఊరట కలిగిస్తాయి.  భూమి సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి.  బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది.

వృశ్చికం:    వృశ్చికరాశి వారికి  ఈ వారం ఆర్థికపరమైన వ్యవహారాలు బాగున్నాయి.  వృత్తి, వ్యాపారాల పరంగా అధిక శ్రమను గ్రహస్థితి సూచిస్తోంది. లాభాలు కూడా అధే విధంగా ఉంటాయి. వ్యక్తిగత హోదా పెరుగుతుంది.  కాలంతో సమానంగా పరుగుపెడతారు. క్రమశిక్షణకు ప్రాధాన్యతనిచ్చి లాభపడతారు.ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటారు.  ధెర్యంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తారు.సంతాన పురోగతి బాగుంటుంది. బంధుమిత్రులలో మీ ప్రతిష్ట నిలుపుకోవడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆహార, ఆరోగ్య నియమాలను పాటించండి. ప్రజా సంబంధాలను మెరుగు పరచుకోగలుగుతారు.ఈవారం.రాజకీయ యత్నాలు, చర్చలు ఫలిస్తాయి. పోటీ పరీక్షలలో విజయం వల్ల ఇంట్లో ఆనందం కలుగుతుంది.

ధనస్సు:   ధనస్సు రాశి  వారికి ఈ  వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరమైన వత్తిళ్ళను తట్టుకోగలుగుతారు.  ఉద్యోగస్తులకు ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశాలలో ఉద్యోగప్రయత్నాలు చేస్తున్నవారికి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు మధ్యస్తంగా ఉంటాయి.ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు అవసరం. కీళ్ళనొప్పులు, వెన్నునొప్పి విషయంలో అశ్రద్ధ ఎంతమాత్రం తగదు. వివాహ  ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది వీసా వస్తుంది.  గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నించేవాళ్ళకి అనుకూల కాలం అని చెప్పవచ్చు. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూల పడతాయి.విద్యార్థిని విద్యార్థులకు వారం ప్రథమార్ధంలో  అనుకూలమైన ఫలితాలుంటాయి. నిర్లక్ష్యం చేయకుండా పని చేసుకోవడం మంచిది. విదేశీయానానికి సంబందించిన విషయాలు ఫలిస్తాయి.

మకరం: మకరరాశి వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నిరుద్యోగులకు ప్రయత్నలోపం వల్ల వచ్చిన అవకాశాలు చేజారుతాయి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి.  వృత్తి, ఉద్యోగాల పరంగా మీదే పై చేయిగా ఉంటుంది. వినోద కార్యక్రమాల పట్ల అమితమైన ఆసక్తిని కనబరుస్తారు.వ్యాపార సంబంధమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.  కష్టించి పనిచేస్తారు. జీవిత భాగస్వామి ఒకరినొకరు అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. కళారంగం వారికి, సాంకేతిక రంగం వారికి, టివి, సినిమా రంగాల వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు శ్రమకు తగిన పదవులు అందకపోవచ్చు. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించండి, వారం చివరిలో  కృషి ఫలించే సూచనలు వున్నాయి.

కుంభం:      కుంభ రాశి వారికి ఈ వారం  అనుకూలంగా ఉంటుంది. స్వతంత్రించి నిర్ణయాలను తీసుకోరు. ఉద్యోగంలో అధిక శ్రమ ,విశ్రాంతికి సమయం ఉండదు. మానసికంగా శ్రమిస్తారు. బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్‌లు, పప్పు దినుసుల వ్యాపారాలలో లాభాలు బాగుంటాయి. రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకుంటుంది. అనారోగ్య సమస్యలు స్వల్చంగా ఇబ్బందిపెడతాయి. వెన్నునొప్పి, కీళ్ళ నొప్పి ఇబ్బంది కలిగించవచ్చు.  బుణం ఇవ్వడం,బుణం తీసుకోవడం రెండూ మంచివి కావు. ప్రయాణాలు ఎప్పుడు చేయాలో నిర్ణయించుకుంటారు. సంతాన పరంగా మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి.  విద్యార్థులకు కాలం అనుకూలంగా వుంది, వైద్య విద్య విషయంలో అధిక శ్రమ పడవలసి ఉంటుంది.

మీనం: మీనరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది.భూమి, వాహన సంబంధమైన విషయాలు కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలు లాభిస్తాయి. ఉద్యోగంలో ఇబ్బందులు కలిగించే వారు వున్నారు జాగర్త. ఆర్థికంగా బరువు బాధ్యతలు కొన్ని ఈతి బాధలు ఎదురవుతాయి.బ్యాంకు బుణాలు తీర్చివేస్తారు.నూతన బాధ్యతలు సంతోషం కలిగిస్తాయి.  సంతానం విషయంలో కఠినంగా వ్యవహరిస్తారు.  ఆరోగ్యంపట్ల జాగ్రత్తవహించాలి. విద్య, విదేశీయాన సంబంధిత అంశాలు అనుకూలంగా ఉన్నాయి.పాస్ పోర్ట్ తీసుకునే వారికి, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసే వారికి మంచి సమయం అని చెప్పవచ్చు. విదేశాలలో విద్యను అభ్యసించే వారికి కూడా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News