Monday, January 20, 2025

వార ఫలాలు 21-01-2024 నుంచి 27-01-2024 వరకు

- Advertisement -
- Advertisement -

మేషం:  మేష రాశి వారికి ఈవారం  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కొంత అభివృద్ధితో పాటు ఆదాయం కూడా సానుకూలతగా ఉంటుంది. కష్టపడిన దానికి ప్రతిఫలం వస్తుంది. కుటుంబంలో సానుకూలత ఉంటుంది, పెద్దలపై ప్రేమాభిమానాలు చూపుతారు. సినీ, రాజకీయ, కళాసాంస్కృతిక రంగాల వారికి అనుకూలమైన ఫలితాలుండె సమయం అని చెప్పవచ్చు.  విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితాలు గోచరించే సమయం అని చెప్పవచ్చు.

వృషభం: వృషభ రాశి వారికి ఈవారం  కొంత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.  తెలివి పెట్టుబడిగా పెట్టె కన్సల్టేషన్స్ వంటి వ్యాపారస్తులకు మంచి సదవకాశాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు మాత్రం అధికారులతో కానీ సహా ఉద్యోగస్థులతో కానీ మనస్పర్థలకు తావు ఇవ్వకపోవడం మంచిది.వివాహం కానీ వారికీ ప్రయత్నాలు ముమ్మరం చేయడం మంచిది.విధ్యార్థులకు మంచి ఫలితాలు, ఉత్తీర్ణత శాతం పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి.

మిథునం: మిథునరాశి  వారికి ఈవారం అత్యంత జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు.  ఉద్యోగస్తులకు పై అధికారులతో పని ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా అతి నమ్మకం, ఎవర్ని అతిగా నమ్మి ఎక్కువ పెట్టుబడులు, నూతన ప్రణాళికలు చేయడం అంత మంచిది కాదు. కుటుంబంలో కొంత కఠిన వైఖరి ఏర్పడుతుంది.జీవిత భాగస్వామికి కానీ, సంతానం కానీ అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది. అవసరాలకు తగిన విధంగా ఎదో ఒక రూపేణ సహాయ సహకారాలు అందుతాయి.

కర్కాటకం : కర్కాటక రాశి  వారికి ఈవారం  మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంత ఆధ్యాత్మికత చోటు చేసుకుంటుంది.  వ్యాపారస్తులకు అనుకున్న ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మంచి జనాదరణ పొందుతారు.  అయితే ప్రయాణ సంబంధమైన వ్యవహారాలు, వ్యాపారాలు కొంత నిరాశను కలిగిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారు కొంత ఓర్పు, సహనం వహించండి.ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి, ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాల యొక్క ఫలితాలు మీరు ఇబ్బందుల పాలు చేసే విధంగా ఉండవచ్చు. మీయొక్క  చికాకులు కుటుంబంలో  చూపించడం మంచిది కాదు. మానసిక ప్రశాంతత పోతుంది. నిత్యం చంద్రగ్రహ స్తోత్రం పఠించడం. నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం మంచిది.

సింహం: సింహ రాశి వారికి ఈవారం నూతన ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి స్థిరమైన ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్నేహితుల అందండలు, సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అనుకున్న ఫలితాలుంటాయి. మీ మంచికి చెడుకి మీరే కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి.అయితే మీరు ఇంత కష్టపడినప్పటికీ కుటుంబంలో సంతానము నుండి, జీవిత భాగస్వామి నుండి కొంత వ్యతిరేఖత ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు  మధ్యస్థ ఫలితాలుంటాయి. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కొంత సానుకూలత, ఆరోగ్యం మెరుగు పడడం వంటివి ఏర్పడతాయి.

కన్య:  కన్యారాశి వారికీ ఈవారం ఉద్యోగపరమైన ఇబ్బందులు, పని యందు ఒత్తిడి వంటివి ఇబ్బంది పెడతాయి. ప్రయివేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగస్తులకు కొంత పోటీ తత్వం అలవడుతుంది. వ్యాపారస్తులకు కూడా కాంపిటీషన్ వంటివి ఎక్కువ ఆలోచింప చేస్తాయి.  బిజినెస్ చేసే వారికి, సాఫ్ట్ వేర్ రంగాల వారికి, అలాగే షేర్లు మార్కెట్ వంటివి అనుకూలిస్తాయి. . ద్వేషం, అసూయతో కూడినటువంటి వారి నుండి విమర్శలు కానీ, మాటలు కానీ పట్టించుకోకండి. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వ్యవసాయ దారులుకు, పాడి, పంటలు వృద్ధి అవుతాయి.వివాహం కానీ వారికి చేసే ప్రయత్నాలు కొంత ప్రతికూలమైన ఫలితాలను ఇవ్వవచ్చు.

తుల: తులారాశి వారికి ఈవారం ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కుటుంబ పరంగా అన్ని విధాల సానుకూలమైన  ఫలితాలు ఉంటాయి. .కుటుంబంలో ఎప్పటి నుండో అనుకుంటున్న శుభకార్యాలు  జరపడానికి చర్చలు చేస్తారు. వివాహం కానీ వారికి వివాహ పరంగా అనుకూల ఫలితాలను పొందడానికి కొంత సమయం పడుతుంది. ఉద్యోగస్తులకు పనిచేసే చోట గౌరవం పెరుగుతుంది. పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి.  ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది.
కొంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నాం అనే భావనకు వస్తారు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వారంతంలో అనుకున్న పనులు నెరవేరుతాయి. సంతాన పరంగా కానీ, వివాహా పరంగా కానీ మంచి శుభ వార్తలు వినే మంచి సమయం అని చెప్పవచ్చు.

వృశ్చికం: వృశ్చికరాశి వారికి ఈవారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు మంచి సానుకూలత ఉంటుంది.  అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికీ, నూతన విద్యాకోర్సులు చేయాలనుకునే వారికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు.శారీరక ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారస్తులకు కూడా ఆర్థికాభివృద్ధితో పాటు ప్రశంసలు, జనాదరణ లభిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి.
విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితములుండె సమయం అని చెప్పవచ్చు. అనుకున్న ఉత్తీర్ణత సాధిస్తారు. మానసిక సంతోషం లభిస్తుంది.

ధనస్సు: ధనుస్సురాశి వారికి ఈవారం విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకున్న ఫలితాలు ఉంటాయి. విద్య పట్ల శ్రద్ద, పట్టుదల పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఉద్యోగస్థులకు స్దాన చలనం కానీ, పని భారం కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా మీ యొక్క చంచలత్వం వలన, నా అనుకున్న వారిని నమ్మడం వలన వస్తు నష్టం కానీ, కానీ ఆర్ధిక పరమైన నష్టాలు ఏర్పడే అవకాశాలు ఎదురవుతాయి. అయితే బంధువర్గంతో విభేధములు, చిన్నపాటి విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  నూతన వస్తువులు కోనుగోలు చేస్తారు.  వివాహప్రయత్నాలు చేసే వారికి సంబంధాలు దగ్గరగా వచ్చి వెనక్కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కంగారు పడకండి. మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఆపవద్దు.

మకరం: మకర రాశి  వారికి ఈవారం అత్యంత మానసిక ఒత్తిడి తర్వాత కొంత సానుకూలమైన ఫలితాలుండె అవకాశాలు ఉన్నాయి.  ఉద్యోగ పరంగా కొంత ప్రతికూలమైన ఫలితాలుంటాయి.కుటుంబ పరంగా కూడా కొన్ని మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి.నిదానంగా సర్దుకుంటాయి.  నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి  మీరు ఆశించిన జీతం రాక పోయినా వచ్చిన ఉద్యోగంలో నిలదొక్కుకోవడం మంచిది. అభివృద్ధి నిదానంగా ఉంటుంది.  ఏది ఏమైనప్పటికీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి, కొంత జాగ్రత్త వహించినట్లైతే మంచి అభివృద్ధి ఉంటుంది.

కుంభం: కుంభరాశి వారికీ ఈవారం మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి సమయం అని చెప్పవచ్చు.  ఉద్యోగస్తులకు కూడా అన్ని విధాల బాగున్నప్పటికీ కొంత ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఉండవచ్చు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి ఫలితాలుంటాయి. ఆర్థిక పరంగా ఒడిదుడుకులు వస్తుంటాయి-పోతుంటాయి. . ఒక్కోసారి వీసా రిజెక్టులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ మరల ప్రయత్నాలు చేయండి. విలాసాలు, వ్యసనాల విషయంలో జాగ్రత్త వహించండి.

మీనం: మీనరాశి వారికి ఈవారం ఉద్యోగాభివృద్ది, ఆర్థికాభివృద్ధి పుంజుకొని, ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలం. అలాగే వ్యాపారస్తులకు కూడా మంచి లాభసాటిగా నడుస్తుంది.  అయితే ఆర్ధిక స్థిరత్వం ఏర్పరచుకోండి. వివాహ  ప్రయత్నాలు చేసే వారు అశ్రద్ధ చేయకండి.వ్యాపారస్తులుకు  ఆర్ధిక పరంగా, కోర్ట్ వ్యవహారాలు చక్కబడతాయి.  ఆరోగ్యం పట్ల కూడా కొంత శ్రద్ద వహించడం మంచిది. వృధా ప్రయాణాలు అలసటకు కారణమవుతాయి.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News