మేషం: మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు బాగున్నాయి. మీ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి కొంతకాలం వేచి ఉండవలసిన సమయం. కెరియర్ పరంగా ఆటుపోట్లు అనేవి సహజం. ప్రతి విషయంలో కూడా మీకు మీరుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో లాభసాటిగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్న లోపం ఉన్నప్పటికీ మంచి సంబంధం కుదురుతుంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం బాగుందని చెప్పవచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు మెరూన్.
వృషభం : వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.డబ్బు సకాలంలో చేతికి అందుతుంది ఖర్చు కూడా అవుతుంది. సంబంధాలు దగ్గర వరకు వచ్చి దూరంగా పోతాయి. వివాహ విషయంలో ఆలస్యం కాకుండా జాతక పరిశీలన చేసుకుని మీకు నచ్చితే ముందుకు వెళ్ళండి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యపరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు అయితే గ్యాస్ట్రిక్ మోకాళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టి అవకాశం ఉంది. మీరు ఏ పని చేసినా నలుగురు లో గుర్తింపు లభిస్తుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. మేధో దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసివచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో.
మిథునం: మిధున రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలపరంగా మంచి మార్పు ఉంటుంది. గృహ నిర్మాణానికి సంబంధించిన బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కష్టేఫలి అన్నట్లుగా ఫలితాలు ఉంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కెరియర్ పరంగా మీరు సాధించాలనుకున్న పురోగతి ఈ వారం సాధిస్తారు. అవార్డులు లభిస్తాయి. ఈ రాశి వారు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ తగ్గడం, నరాల బలహీనత, స్కిన్ ఎలర్జీ సంబంధించిన వ్యాధులు, ఎక్కువగా ఇబ్బంది పెడుతాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు బ్లూ.
కర్కాటకం : కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా బాగుంటుంది. ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం వీరికి అష్టమ శని నడుస్తుంది అష్టమ స్థానంలో శని బలంగా ఉన్నారు కాబట్టి పనులు నిదానంగా సాగినప్పటికీ ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార పరంగా అనుకూలంగా లేదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాళ్ల నొప్పులు, జుట్టుకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడతాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. ఈ రాశిలో జన్మించినవారు ప్రతిరోజు ప్రతినిత్యం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి.
సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగంలోని వారికి, మెకానిక్ రంగంలోని వారికి అంత అనుకూలంగా లేదు, మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకపోవచ్చు డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షూరిటీ సంతకాలు, మధ్యవర్తి సంతకాలు పెట్టేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా వృత్తి ఉద్యోగాలపరంగా బాగుందని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. వీసా పాస్పోర్ట్ గ్రీన్ కార్డు వంటి అంశాలు సానుకూల పడతాయి. సినిమా కళా రంగంలోని వారికి అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఒకటి, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ప్రతి బుధవారం రోజున గణపతికి గకారక అష్టోత్తరంతో మరియు గరికతో పూజ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కన్య: కన్యా రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా ముందుకు సాగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపారంలో రొటేషన్సు బాగుంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి ఈవారం బాగుంటుంది పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ వారం కొంతమేర బాగుంటుంది. ఈ రాశి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కెరియర్ పరంగా వీరు చాలా కష్టపడాల్సిన అవసరం గోచరిస్తుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు కాషాయం.
తుల: తులా రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా మీరు అనుకున్న స్థానాన్ని నిలబెట్టుకుంటారు. గృహ యోగం ఉంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెడతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మార్పులు బాగుంటాయి. ఏ పని చేసినా మీకు మీరుగా చేయడం చెప్పదగిన సూచన. సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆర్భాటాలకు ఎక్కువగా వెళ్లి నలుగురిలో నవ్వుల పాలు కాకూడదు. ఆర్భాటాలకు వెళ్లి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు, కావున జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార వ్యవహారాల విషయాలు అన్నీ బాగున్నాయి. లోన్లు మంజూరు అవుతాయి. సాఫ్ట్వేర్ సినీ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి ఈవారం బాగుంటుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఈవారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. బంధువులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయి. వాటి వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ వారం తొలగిపోయి ముందుకు వెళ్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ పరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. ఏ పని చేసినా రెండు మూడు సార్లు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. కష్టపడిన దానికి మంచి ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులు మెరిట్ మార్కులు సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ప్రతిరోజూ ఓం నమో శివాయ వత్తులతో దీపారాధన చేయండి. అలాగే హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవండి.
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వ్యాపారపరంగా వారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ సినీ రంగం వారికి బాగుంటుందని చెప్పవచ్చు. నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ పరంగా ఉద్యోగస్తులకు బాగుంది. ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాశి లోని స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. వాహనయోగం ఉంది లోన్లు మంజూరు అవుతాయి. ఈ రాశిలో జన్మించినవారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయడం అనేది ఉత్తమం. నర దిష్టి అధికంగా ఉంటుంది. కాబట్టి కాలభైరవాష్టకం పారాయణ చేయాలి. కను దిష్టి వినాయకుడిని గుమ్మానికి పెట్టండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలసి వచ్చే సంఖ్య 5, కలిసివచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు.
మకర రాశి : మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఖర్చు ఎక్కువగా సూచిస్తుంది. కాబట్టి పొదుపు పాటించండి. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అంతా అనుకూలంగా ఉన్న ఏదో తెలియని భయం ఆందోళన కనిపిస్తుంది. శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పోటీ తత్వం ఏర్పడుతుంది. మెరిట్ మార్కులు సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ, ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. 8 మంగళ వారాలు శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అఘోర పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగిన సూచన.
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగా బాగుంటుంది. వీరికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున అంతా అనుకూలంగా ఉండదు. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. మరియు అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి దైవదర్శనాలు ఎక్కువగా చేసుకోవాలి. నలుగురితో కలిసి ఉండే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా రొటేషన్స్ అంతగా బాగుండవు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన యోగం కలుగుతుంది. సినీ, విద్యా వైద్యరంగంలోని వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు వైట్.
మీన రాశి : మీన రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ధనయోగం సూచిస్తుంది. దైవదర్శనాలు ఎక్కువగా చేస్తారు. మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు. ముఖ్యమైన విషయాలలో మీ జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. దీనివల్ల మీకు మేలే గాని నష్టం జరగదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపారపరంగా కొంత నష్టం చవిచూస్తారు. గ్రీన్ కార్డు వీసా కోసం చూసేవారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. సినీ కళా రంగాల వారికి అనుకూలంగా లేదు చేదు అనుభవాలు ఎదురవుతాయి, మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించకపోవచ్చు. యోగా మెడిటేషన్ చేయడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు. కలిసివచ్చే రంగు తెలుపు. కాలభైరవ రూపు మెడలో ధరించండి.