Monday, December 23, 2024

వార ఫలాలు 23-06-2024 నుండి 29-06-2024 వరకు

- Advertisement -
- Advertisement -

మేషం:    మేషరాశి   వారికి ఈ వారం   ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి.సాంకేతిక రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. విద్యా, వైజ్ఞానిక, సాంకేతిక, సాంస్కృతిక రంగంలో వారికి ప్రఖ్యాతి లభిస్తాయి. ప్రతి చిన్న విషయాన్ని బూతద్దంలో చూడవద్దు. ఉద్యోగం మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంటుంది.  అసూయ పడేవాళ్ళు ఎక్కువ వుంటారు.విదేశాలలో వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. స్వగృహం కల నెరవేరుతుంది. సందర్భానుసారంగా,  విందులు, వినోదాలలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు.ఆరోగ్యం పట్ల జాగరతలు తీసుకోవాలి. విద్యార్థిని విద్యార్థులకు మంచి కాలం అని చెప్పవచ్చు. మనస్సుని మీ ఆదీనంలో పెట్టుకుని ముందుకు వెళ్లడం మంచిది.

 వృషభం:  వృషభ రాశి వారికి ఈ  వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలలో గట్టి పట్టుదలతో విజయవంతమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు.విద్యా సంబంధమైన విషయాలు, పిల్లల పురోగతికి సంబంధించిన విషయాలు మంచి పురోగతిలో ఉంటాయి. వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి. వైద్య సంబంధమైన వ్యాపారంలో ఉన్న వారికి అనుకూల ఫలితాలు వస్తాయి. లాభాలు బాగుంటాయి. పాల వ్యాపారం బాగుంటుంది, రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది.ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే సూచనలు వున్నాయి, స్వయంకృతాపరాధాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పాటించడం మంచిది. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబసభ్యులతో కలిసి విహార యాత్రలు చేస్తారు. సంతానం వల్ల సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి.

 మిథునం:   మిథునరాశి వారికి   ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.నూతన వ్యాపార విషయాలు, దానికి సంబంధించిన చర్చలు ఈ వారం పూర్తిచేస్తారు.స్టీలు ఫ్యాక్టరీల వారికి, ప్లాస్టిక్‌ కంపెనీల వారికి, పబ్లికేషన్స్‌ వ్యాపారస్తులకు, తోలు ఉత్పత్తులు చేయువ్యాపారులకు, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కాలం అనుకూలంగా ఉంది.లీజులు, అగ్రిమెంట్స్‌ కుదుర్చుకునేటప్పుడు జాగ్రత్త వహించండి.  ఆధ్యాత్మిక కేంద్రాలలో మీకు ప్రాధాన్యం వస్తుంధి. ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించాల్సిన యోగం కలుగుతుంది.  రాజకీయంగా జరిగే మార్పులు మీకు ఊరట కలిగిస్తాయి.ఆరోగ్యం పట్ల స్వల్పమైన జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుంది. సహజ సిద్ధమైన ఓర్పు లోపిస్తుంది.వాహన కొనుగోలు ప్రయత్నాలు మాత్రం ఫలించే సూచనలున్నాయి. ఉన్నత ఉద్యోగ అవకాశాల పైన దృష్టిని సారిస్తారు.

కర్కాటకం :  కర్కాటకరాశి వారికి  ఈ వారం ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారం చేసుకోవడానికి, స్నేహితుల అండ,  రాజకీయ పలుకుబడి అవసరం అవుతాయి. మీ సహనం నశిస్తుంది, అధిక శ్రమ చేయవలసి వస్తుంది. అధికారుల మీ మనస్సులోని బాధను ఎవరితోనూ పంచుకోరు. భగవంతుడు సహాయం చేయాలని గానీ మానవ ప్రయత్నం వలన కష్టాలు తీరవని భావిస్తారు. భవిష్యత్తు గురించి దీరంగా ఆలోచిస్తారు.లౌక్యం అనే విద్యను ఏవిధంగా అయినా సాధించాలన్న పట్టుదల మీలో కలుగుతుంది. జీవితంలో రొటీన్‌గా ఉండకూడదని మార్పులు చేయాలని నిర్ణయించుకుంటారు.రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, పప్పు దినుసులు వ్యాపారాలు,కూరగాయలు, సూపర్ మర్కెట్స్, ఎలెక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా వుంది.ఆరోగ్యం బాగుంటుంది. అతిగా ఆలోచించవద్దు. విద్యార్థిని విద్యార్థులకు సబ్జెక్టు మారాలని ఆలోచిస్తారు, కొంత మంది మాత్రమే వర్తిస్తుంది ,

సింహం: సింహరాశి వారికి ఈ వారం  వ్యాపారంలో మీ భాగస్వాములు తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వలన కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఇది మీకు అత్యంత కష్టం కలిగించే అంశంగా మారుతుంది.  నిత్య దేవతారాధన అన్నీ వ్యర్థమని భావిస్తారు.  మీకు వ్యతిరేకంగా ఇతరులు చేసే కుతంత్రాలు మీకే అనుకూలంగా మారతాయి. మనసు,  ధైర్యంగా ఎదుర్కొంటారు.ఉద్యోగ పరంగా అనుకూలంగా వుంది, కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది.  ప్రమోషన్స్ ఆలస్యం అయ్యే అవకాశం వుంది. వాహనం లేదా స్వగృహం కొనాలని ఆలోచన చేస్తారు.  సంతానాన్ని గారాబం చేయడం వల్ల ఏర్పడిన పరిస్థితులు మీకు ఇబ్బంది కరంగా మారతాయి.ఆరోగ్య విషయంలో జాగర్తలు తీసుకోవాలి, కండరాలు, కీళ్ళ, నొప్పులు బాధిస్తాయి. విదేశాల నుండి మీరు కోరుకున్న శుభ సమాచారం అందుకుంటారు. శుభకార్యాలు చేయాలనీ ఆలోచిస్తారు. ఈవారం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది.

కన్య:    కన్య రాశి వారికి ఈ వారం సన్నిహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.  అస్తి వివాదాలు తీరి లబ్ది  పొందుతారు.జీవితభాగస్వామి నుండి సహాయసహకారాలను అందుకుంటారు.వృత్తి, రాజకీయ కళారంగాల వారికి పదవీయోగం, సన్మానాలు, సత్కారాలు పొందుతారు.నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. వ్యక్తిగత పురోభివృద్ధి బాగుంది.  ఖర్చులను అదుపు చేయగలుగుతారు. ఉద్యోగంలో నూతన బాధ్యతలు మీ నైపుణ్యం వల్ల చక్కగా నెరవేర్చి ప్రఖ్యాతి సాధిస్తారు. రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపారాలు కొంత నత్తనడక నడిచినా లాభాలకు ఇబ్బంది ఉండదు.  చిన్నచిన్న విషయాలే చిలికి గాలివానగా మారే అవకాశం ఉంది. సంతానం విద్య పట్ల శ్రద్ధ కనబరచడం మీకు మానసిక  ప్రశాంతతను కలిగిస్తుంది.

తుల: తులారాశి వారికి ఈ వారం పనులు సాఫీగా సాగుతాయి. ఇంతకాలం పడ్డ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు.విదేశీ ఉద్యోగ, విద్యా వ్యవహారాలు సానుకూలపడతాయి .వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి అనుకూలం.దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.నూతన వస్తు, వస్త్ర  ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విందు,వినోదాలలో స్వల్పమైన జాగ్రత్తలు పాటించ వలసి ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి చలించిపోతారు.దేవాలయాల సందర్శనం మీకు ఊరటను కలిగిస్తాయి.  పొదుపు పథకాలను నామమాత్రంగా పాటించగలుగుతారు. సానుకూల ఫలితాలను సాధిస్తారు.విద్యార్థిని విద్యార్థులకు మంచి కాలం అని చెప్పవచ్చు, స్నేహితుల విషయంలో జాగర్తలు అవసరం.

 వృశ్చికం:    వృశ్చికరాశి వారికి  ఈ వారం  మీకు ఇష్టం లేకపోయినా ప్రయోజనాల పరిరక్షణకు తలవంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చెవి, ముక్కు గొంతు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులేర్పడే అవకాశం ఉంది.క్రయవిక్రయాలు సాగించేటప్పుడు మెలుకువ అవసరం. మీ పరపతి, పలుకుబడి అవసరానికి ఉపయోగపడుతుంది. ఋణాలు చాలా వరకు తీరుస్తారు. ఉద్యోగంలోని అదనపు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుకోవడానికి కావలసిన వ్యూహాలను, ప్రణాళికలను రూపొందించుకుంటారు.ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.బంధువులతో ఏర్పడిన వివాదాలు సమసి పోతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలమైన మలుపులు తిరుగుతాయి. విద్యార్థిని విద్యార్థులకు మంచి కాలం అని చెప్పవచ్చు.

 ధనస్సు:   ధనస్సు రాశి  వారికి ఈ వారం  గతంలో ఒకరికిచ్చిన వాగ్దానం నిలుపుకోవడానికి మీరు చేసే కృషి ఫలిస్తుంది. దూరప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. సంతాన పురోగతి విషయమై చింతించవలసిన అవసరం ఉండదు .వృత్తిలో వత్తిడి ఎక్కువగా ఉంటుంది. పుస్తకాలూ ఎక్కువగా చదవడం ద్వారా మెదడుకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.  వృత్తి, వ్యాపారాల పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.  సహోదర, సహోదరీ వర్గానికి సహాయం చేస్తారు.సంతానం క్రీడా, సాంస్కృతిక రంగాలలో రాణిస్తారు. సున్నితమైన అంశాలను విచక్షణ ఉపయోగించి పరిష్కరిస్తారు. విదేశీ సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. స్ట్రెస్ కి గురికాకుండా చూసుకోవాలి.  విద్యార్థిని విద్యార్థులకు స్ట్రెస్ కి గురికాకుండా చూసుకోవాలి. సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. సమయానికి ఆహరం విశ్రాంతి చాల ముఖ్యం.

మకరం: మకరరాశి వారికి   ఈ వారం  ఆర్థిక సర్దుబాట్లను నేర్పుగా చేసుకోగలుగుతారు. ప్రారంభించబోయే నూతన కార్యక్రమాలకు గాను మితంగా శ్రమిస్తారు. గతంలో మీరు చేసిన తాలూకూ కృషి ఫలితాలను ఈ వారం అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు మీ కృషి వల్ల లాభాల బాటలో నడుస్తాయి. స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు. గతంలో కొనుగోలు చేసిన ఆస్తుల విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలపరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులేవీ చోటు చేసుకోవు. జీవితభాగస్వామితో భేదాభిప్రాయలు ఏర్పడే సూచనలున్నాయి, మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి.పెద్దవాళ్ళ ఆరోగ్యం మీ మనోవేదనకు కారణం అవుతుంది. నిర్మాణాత్మకమైన నిర్ణయాలు అమలు చేయడానికి అందుకు తగిన వ్యక్తులను కలుస్తారు.ప్రతి రోజు వ్యాయామం, దైవదర్శనం చేయడం వలన మేలు జరుగుతుంది.

కుంభం:      కుంభ రాశి వారికి  ఈ వారం  కొత్త విషయాలు గ్రహిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. పెట్టుబడులలో లాభాలు పొందుతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.  న్యాయపరమైన చిక్కులు ఉంటాయి జాగర్త వహించండి. గతంలో జరిగిన పొరపాట్లు అందువల్ల ఏర్పడిన పరిస్థితులను సరిదిద్దుకుంటారు. సాధించిన దాని కన్నా సాధించవలసింది ఎంతో ఉందని భావిస్తారు.  ఆరోగ్యం పట్ల జాగర్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ఈ వారం ఇబ్బంది వాతావరణం గా చెప్పవచ్చు,  విదేశీ సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. పొదుపు ప్రయత్నాలు ఫలిస్తాయి. డబ్బుల విషయంలో గతంలో మీ ప్రవర్తనకు ఇప్పటి ప్రవర్తనకు తేడా వస్తుంది. సహా ఉద్యోగులు, సహోదర వర్గంతో మిత్రత్వం మేలు చేసుతుంది.

  మీనం: మీన రాశి వారికి ఈ వారం  నూతన ఆదాయ బాగుంది. మీ పరపతిని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు పెద్దగా ఫలించవు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. అవిశ్రాంతంగా శ్రమించడం వలన వత్తిడికి లోనవుతారు. తగిన శ్రమ అవసరం అలాగే శత్రువులతో కూడా మిత్రుగా భావించి ముందుకు వెళ్లడం మంచిది.ఏదైనా మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది అని గ్రహించండి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. శత్రువర్గం వున్నా దైవానుగ్రహం మీకు అండగా ఉంటుంది. ప్రతి నిత్యం శివ అష్టోత్తరం పఠించడం మేలు జరుగుతుంది.కోర్టు వ్యవహారాలు వాయిదాలలో ఉంటాయి. ఏకపక్ష నిర్ణయాలు తొందరపాటు వాగ్దానాలు చోటు చేసుకుంటాయి.కుటుంబ బాధ్యతలను నమర్ధవంతంగా నిర్వహిస్తారు.  ఉద్యోగ పరంగా పెద్దగా మార్పులు వుండవు. వ్యాపారం నిదానంగా సాగుతుంది. ఆరోగ్యం పట్ల జాగర్తలు తీసుకోండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News