Monday, January 20, 2025

వార ఫలాలు 24-12-2023 నుండి 30-12-2023 వరకు

- Advertisement -
- Advertisement -

మేషం:  మేషరాశి వారికి ఈ వారం మిగిలిన అన్ని వ్యవహారములు కంటే కూడా  కుటుంబ పరంగా  మంచి సఖ్యత పొందే సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది, అధికారులతలో జాగర్తగా వ్యవహరించాలి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం, సలహాలు ఇవ్వడం అంత మంచిది కాదు. వ్యాపారస్తులకు  ఈ వారం ఆదాయం బాగుంటుంది. విద్యపై శ్రద్ద తగ్గకుండా జాగ్రత్త వహించండి.ఆరోగ్యపరంగా బాగుంటుంది.

 
వృషభం: వృషభరాశి వారికి ఈ వారం ఉద్యోగరీత్యా మంచి అనుకూలమైన ఫలితములు ఉంటాయి. స్నేహితులతో మనస్పర్థలు  వచ్చే అవకాశములు ఉన్నాయి.  కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థిని విద్యార్థులకు  మంచి ఫలితాలుండే అవకాశములు ఉన్నాయి.  ఆరోగ్య పరంగా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నట్లైతే మరింత  జాగ్రత్త వహించండి.ఆరోగ్య నియమములు పాటించండి.

మిథునం: మిథునరాశి వారికి ఈవారం కొంత ప్రతికూలమైన ఫలితములుండె అవకాశములు ఉన్నాయి.ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది.ఇప్పుడు అప్పులు చేయడము  వలన ఇబ్బందులలో పడే అవకాశములు ఉంటాయి.శ్రమ  అధికం అవుతుంది. ఆరోగ్య పరంగా  బాగుంటుంది. విద్యార్థిని విద్యార్థులకు విద్యపై శ్రద్ధాసక్తులు పెరిగినప్పటికీ, కష్టపడినప్పటికీ పరీక్షలలో ఉతీర్ణత సాధించినప్పటికీ అనుకున్న ఫలితములు ఉండకపోవచ్చు.జాగ్రత్త వహించండి.

కర్కాటకం : కర్కాటక రాశి  వారికి ఈవారం కొంత అనుకూలంగా లేదని చెప్పాలి, కోపం, నిరాశను పక్కకు పెట్టి ముందుకు సాగితే అన్ని విధముల విజయములు వరిస్తాయని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు  మంచి ఫలితాలుంటాయి.  భవిష్యత్తు బాగుంది. ఆరోగ్య పరంగా కొంత సానుకూలత ఉంటుంది. కుటుంబముతో సంతోషంగా గడుపుతారు. స్థిరమైన నిర్ణయములు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలసి విహార యాత్ర చేస్తారు.

సింహం:సింహరాశి వారికి ఈవారం  ఏది ఏమైనప్పటికీ కొంత విలాస వంతమైన ఖర్చులు చేయడానికి చూస్తారు. వినోద యాత్రలపై శ్రద్ద చూపిస్తారు. వ్యవసాయ దారులకు మంచి దిగుబడి వచ్చే సమయం అని చెప్పవచ్చు.మీ అశ్రద్ధ వలన లేనిపోని అపకీర్తి వచ్చే ప్రమాదములు ఉంటాయి. జాగ్రత్త  వహించండి. మీ ఆరోగ్యం తో పాటు మీ సంతానం యొక్క ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించండి. ఈ రాసి వారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అలాగే కాలభైరవ రూపు ధరించడం శ్రేయస్కరం.

కన్య: కన్యా రాశి వారికి ఈవారం  కొద్దీ పాటి  చికాకులను  పక్కన పెట్టి జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా జరిగేది చూసుకుని ముందుకు సాగితే అన్ని మంచి ఫలితములు వస్తాయి. మానసిక ధైర్యం ఉంటె అన్ని మంచి ఫలితాలుంటాయనడానికి సందేహం లేదు.ఉద్యోగస్తులకు ఈవారం బాగుంది,మీ ప్రతిభను గుర్తిస్తారు. వ్యాపారస్తులకు ఆదాయ వృద్ధి కనబడుతుంది. గతంలో ఉన్న వ్యవహారములు కొంత చక్కబడతాయి.  విద్యార్థిని విద్యార్థులకు కూడా అన్ని విధముల బాగుంటుందిఆరోగ్యం బాగుంటుంది. గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ప్రస్తుతం రిలీఫ్ అనేది ఉంటుంది.

తుల: తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితములు ఉంటాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విఫలం అయిన వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా శుభకార్యములు జరిగే అవకాశములు  ఉన్నాయి. వివాహం కానీ వారికి, కెరీర్ పరంగా సమస్యలు ఎదుర్కొనే వారికి కొంత సానుకూలమైన ఫలితాలుంటాయి. ప్రయత్నములు చేయండి. అమ్మితే అడవి, కొంటె కొరివి అనేటట్టు ఆర్థికస్థితి ఉండవచ్చు. కొంత ఆలోచించి నిదానంగా  వ్యవహరించడం  చెప్పదగ్గ సూచన. ఆరోగ్య పరమైన జాగర్తలు తీసుకోవాలి. ముక్యంగా  గ్యోస్ట్రిక్, కంటికి సంబంధమైన వంటివి జాగర్త తీసుకోవాలి.

వృశ్చికం: ఈ వారం వృశ్చిక రాశి  వారికి గతంతో పోలిస్తే కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుందని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్యాభివృద్ధి ఉంటుంది.  అయితే లాభములు లేకపోయినా పర్వాలేదు కానీ ఎదుటి వారిచే నమ్మక ద్రోహం జరగకుండా జాగ్రత్త వహించండి. మీ కోపాన్ని అందరి ముందు  ప్రదర్శించడం మంచిది కాదు.  శారీరక అనారోగ్యం కంటే మానసిక సంతృప్తి బాగుంటుంది. చిన్న చిన్న సమస్యలకు పట్టించుకోకుండా ముందుకు సాగండి.   భవిష్యత్తు బాగుంటుంది.

ధనస్సు: ధనస్సురాశి వారికి ఈవారం    అత్యంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు.ఉద్యోగస్తులకు ప్రతికూల వున్నాయి,  మీ పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలి.    చంచల మనస్తత్వంతో ఆస్తి నష్టం జరిగే అవకాశములు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకు విద్యపై దృష్టి  తగ్గకుండా జాగ్రత్త వహించండి. సామాన్యంగా ఫలితాలుంటాయి. అనారోగ్య సమస్యలు కంటే మానసిక అశాంతి చోటు చేసుకునే అవకాశములు ఉన్నాయి. మానసికధైర్యంతో ముందుకు సాగండి.
 
మకరం: మకరరాశి వారికి ఈ వారం  ఈవారం మంచి ఫలితములు సూచిస్తున్నాయి. వివాహం కానీ వారికి వివాహం కోసం  చేసే ప్రయత్నములు నెరవేరుతాయి. చంచలత్వంతో కాకుండా మానసిక ధైర్యంతో ముందుకు సాగండి మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబ పరంగా  చిన్న చిన్న అభిప్రాయభేదములు వచ్చినప్పటికీ  తరువాత అవి సద్దుకుంటాయి. ఆందోళన చెందకండి. విద్యార్థిని విద్యార్థులకు టెక్నీకల్ రంగం వారికి మంచి ఫలితాలుంటాయి. క్రీడాకారులకు మంచి అవకాశములు దొరుకుతాయి.

కుంభం: కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి.  ఉద్యోగస్తులకు కొంత పని భారం  తగ్గుతుంది.  గృహంలో  ఏదైనా సమస్యలు ఉన్నట్లైతే ఒక కొలిక్కి వస్తాయి.కుటుంబ పరంగా కూడా సుఖసంతోషములు ఉంటాయి.సంతానం కొరకు వేచి చూసే వారికి శుభవార్తలు వినే  అవకాశములు ఉన్నాయి.విద్యార్థిని విద్యార్థులకు కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం,అనుకున్నంత ఫలితాలుండకపోవచ్చు,చెడు స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. .కీళ్ల నొప్పులు, ఉబ్బసం, గ్యాస్ట్రిక్ , ఏ పని ముందుకు సాగకపోవడం వంటివి ఉంటాయి.

మీనం: మీనరాశి వారికి ఈ వారం కొంత శుభకరమైన ఫలితములు గోచరిస్తున్నాయి. వివాహం కొరకు ప్రయత్నము చేసే వారికి కొంత సానుకూల ఫలితాలు ఏర్పడుతుంది. ఉద్యోగ పరంగా కూడా ప్రమోషన్లు, చేతి వృత్తుల వారికి అనుకూలమైన లాభములు ఉండే అవకాశములు ఉన్నాయి.ఆర్ధిక పరంగా యధాతధంగా ఉంటుంది. మీరు పడిన కష్టానికి  మంచి ఫలితం లభిస్తుంది. విద్యార్థులకు సానుకూలంగా ఉంది. నూతన కష్టపడి చదివితే మంచి ఫలితాలుంటాయి.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News