Sunday, January 19, 2025

వార ఫలాలు 25-02-2024 నుండి 02-03-2024 వరకు

- Advertisement -
- Advertisement -

మేషం:   మేషరాశి  వారికి ఈ వారం మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పరచుకుంటారు. వ్యాపార విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు. కొనుగోలు, అమ్మకాలు లాభిస్తాయి.
ఉద్యోగంలో మంచి పురోగతి బాగుంటుంది, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నిత్యం గణపతి స్తోత్రం పఠించండి, మొండి బకాయలు ఉంటే వసూళ్ళు అవుతాయి. ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది.  క్రీడా రంగం వారికి బాగుంది. విదేశీ యాన ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మిత్రులతో  వైరం పెరుగుతుంది. మీరు చేయి అందించిన వారే మీకు వ్యతిరేకం అవుతారు.

వృషభం: వృషభరాశి వారికి ఈ వారం, కొంత అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. విదేశాలలో ఉన్న వ్యక్తుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు కొంత కాలం వాయిదా వేయడం మంచిది. కుటుంబంలో కొందరి ఆరోగ్య విషయంలో జాగర్తలు తీసుకోవాలి. షేర్లు, చిట్ ఫండ్లు, మొదలైనవి లాభించవు. ఈ వారం నష్టాన్ని కలిగించే విధంగా ఉంటాయి. ఆచితూచి అడుగులు వేయండి. కష్టపడిన దానికి ఫలితం తక్కువగా ఉన్నా పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు.సంస్థలో మీరు ఆశించిన మార్పును పొందగలుగుతారు. వ్యాపారంలో పురోగతి బాగుంటుంది. ఆర్థిక  వ్యవహారాలు లాభిస్తాయి. ఋణ సంబంధమైన చికాకులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు మీకే అనుకూలంగా వస్తాయి. రియల్ ఎస్టేట్ బాగుంటుంది, నిర్మాణ సంబంధమైన వ్యవహారాలు అమలు చేయడానికి మంచి కాలం అని చెప్పవచ్చు. వివాహం కానివారికి వివాహ సంబంధం  కుదురుతుంది. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

మిథునం:  మిథునరాశి  వారికి  ఈవారం  మీ వ్యక్తిగత విషయాలను బయటకు వెల్లడి చేసే వ్యక్తులతో జాగర్తగా ఉండాలి. వారి వల్లన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆర్థిక పరమైన వాటి మీద దృష్టి పెట్టండి. ఉద్యోగంలో అధిక శ్రమ ఉంటుంది. విద్య ఉద్యోగ సంబంధిత విషయాలపై దరఖాస్తు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. దైవానుగ్రహం తోడుంటుంది. ఎప్పటినుండో ఉన్న పెండింగ్ బిల్స్ వస్తాయి. బిజినెస్ ఎక్సపెన్షన్ చేసే ప్రయత్నం ముందుకు సాగుతుంది. వ్యాపార లావాదేవీల యందు జాగర్తలు పాటించడం ముఖ్యం. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సోదరి సహోదర మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. కళా, సాహిత్య రంగంలోని వారికి మంచి గుర్తింపు లభిస్తుంది.   వివాహం కుదురుతుంది. మీరు ధైర్యంతో తీసుకొన్న కొన్ని నిర్ణయాలు లాభం చేకూరుస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. సభలకు, సమావేశాలకు, ఆహ్వానాలు అందుకుంటారు. వ్యక్తిగత సంభాషణల ద్వారా, ప్రత్యర్థుల రహస్య కార్యకలాపాలు బయట పడతాయి. చెడుగా ప్రచారం చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి.విద్యా రంగంలో ఉన్న వారికి శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు.అమ్మకాలు, కొనుగోలు లావాదేవీలలో జాగర్తలు తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాసి వారు వెంకటేశ్వర స్వామి వారికీ తులసి మాల సమర్పించండి, ముత్యపు గణపతి లాకెట్ ధరించండి మంచి ఫలితాలుంటాయి.

కర్కాటకం :  కర్కాటకరాశి వారికి ఈ వారం ఆదాయ వ్యయాలు సమానంగా లేకపోయినా ఈ ఇబ్బంది లేకుండా అవసరానికి డబ్బు సర్దుబాటు అవుతుంది. ఖర్చు మీ అంచనాలకు మించకుండా చూసుకోవాలి. అష్టమ శని నడుస్తున్నందున కొన్ని పనులకు ఆటంకాలు వస్తాయి. వాటిని జాగర్తగా అధిగమించండి. వృతి పరమైన జాగర్త చర్యలు పాటించండి. బాధ్యతలను అశ్రద్ధ చేయవలసి వస్తుంది. దీని వలన అధికారుల నుండి మాట పడకుండా ముందు జాగర్తలు పాఠించండి. దైవ దర్శనాలు చేస్తారు. విదేశీ సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపారం బాగుంటుంది. గృహప్రవేశం, ఉపనయనం, వివాహం, అన్నప్రాసన, బారసాల వంటి  మొదలైన శుభకార్యాలు వాటికిఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది. సోదరి సహోదరుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. రాజకీయ పరమైన చిక్కులు మీకు ఎక్కువ అవుతాయి. ఈ రాశి వారు 8  శనివారాలు శనికి తైలాభిషేకం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.

సింహం: సింహరాశి వారికి ఈవారం వృత్తి పరమైన అభివృద్ధి విషయంలో సానుకూల ఫలితాలుంటాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. భార్య భర్తల మధ్య మాట పట్టింపులు ఎక్కువవుతాయి.ఒక్కోసారి చేయని తప్పుకు కూడా నింద పడతారు. ఆరోగ్యపరమైన జాగర్తలు వహించండి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార పరంగా బాగుంటుంది, లాభాలు అనుకున్న స్థాయిలో లేకపోయినప్పటికీ నష్టం లేకుండా ఉంటుంది. సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్, సినీ, కళా రంగం, బ్యూటీ పార్లోర్ వారికి అనుకూలం అని చెప్పవచ్చు. వస్త్ర వ్యాపారస్తులు, బంగారం(సువర్ణం) వ్యాపారస్తులకు మధ్యస్తంగా వ్యాపారం ఉంటుంది. నూతన వ్యాపార విషయాలకు అనుకూల సమయం అని చెప్పవచ్చు. శుభకార్యాలు చేస్తారు.  రాజకీయ రంగంలోని వారికి ప్రజాధారణ లభిస్తుంది.  విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా సమయం కాబట్టి ఒత్తిడికి లోనుకాకుండా జాగర్తలు తీసుకోవాలి. ముత్యపు గణపతి లాకెట్ ధరించండి మంచి ఫలితాలుంటాయి.

కన్య:    కన్య రాశి వారికి ఈ వారం వృత్తి పరంగా మార్పులు ఉండవచ్చు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ పరుస్తాయి. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది.  ప్రమోషన్స్ చేతి దాక వచ్చి చేజారిపోతుంది. వివాహ సంబంధమైన విషయాలు కొలిక్కి వస్తాయి.ఆరోగ్యం పట్ల జాగర్తలు తీసుకోవాలి.  ఉద్యోగం కోసం ప్రయతిస్తున్నవారికి ఉద్యోగం అతి కష్టం మీద వస్తుంది. వ్యాపారస్తులకు ఆర్థికాభివృద్ధి ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి.రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు. నిత్యం దుర్గ దేవి స్తోత్రం పఠించండి మంచి ఫలితాలుంటాయి.

తుల: తులారాశి వారికి ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు, భూ, గృహ సంబంధిత విషయములో లాభం చేకురుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్య పరమైన విషయాల్లో జాగర్తలు తీసుకోవాలి. వృత్తి పరంగా సమయ స్ఫూర్తి అవసరం. ఉద్యోగంలో ఎంత కష్టపడ్డ ఫలితం రావడం లేదు అనే భావనకు వస్తారు.విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల సమయం అని చెప్పవచ్చు.వ్యాపార పరంగా బాగుంటుంది, పెట్టిన పెట్టుబడులు లాభిస్తాయి.  రేపటి భవిష్యత్తు కోసం కార్యాచరణ సిద్దమవుతారు. విదేశీ సంబందించిన వ్యాపారాలు లాభిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా సమయం కాబట్టి పోటితత్వం అలవర్చుకోవాలి ,మంచి ఫలితాలను అందుకుంటారు. మేధాదక్షిణ మూర్తి రూపు ధరించండి మంచి చేకూరుతుంది.

వృశ్చికం:  వృశ్చికరాశి వారికి  ఈవారం   వృత్తి వ్యాపార విషయాలు బాగున్నాయి. విదేశీ సంబందించిన  ఉద్యోగాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామి లేదా మీ ఆరోగ్యం పట్ల జాగర్తలు తీసుకోవాలి.  గృహ నిర్మాణ, అలంకార సామాగ్రి, విలువైన వస్తువులు కోసం అధిక ఖర్చును గత్యంతరము లేని స్థితిలో ఆమోదిస్తారు. వ్యాపారం అభివృద్ధి పదంలో నడుస్తుంది. చెప్పుడు మాటలు విని దూరం చేసుకునే అవకాశం ఉంది జాగర్త వహించండి. తన మన బేధం పక్కదారి పట్టించే అవకాశం ఉంది.అర్ధాష్టమ శని నడుస్తోంది, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి నల్ల నువ్వులు దానం ఇవ్వండి మంచి ఫలితాలుంటాయి. కళా, రాజకీయ రంగంలోని వారికి కొంత చేదు అనుభవం ఎదురవుతుంది.

ధనస్సు:    ధనస్సు రాశి వారికి ఈ వారం బాగుంది. వృత్తిలోని వారికి విశేష ఆదరణ, గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ఇంక్రెమెంట్స్, ప్రొమోషన్స్ వచ్చే అవకాశాలున్నాయి. అదృష్టం కలసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. సద్వినియోగం చేసుకోండి. స్థిరాస్తి అమ్మకం విషయంలో ఆలస్యం అవుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారం ఆటంకాలు లేకుండా సాగిపోతాయి. సినీ కళా రంగం వారికి అనుకూలం అని చెప్పవచ్చు. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు సానుకూలపడతాయి.  ప్రయాణాలు లాభిస్తాయి.
మానసిక సంఘర్షణకు లోనవుతారు. దైవ దర్శనాలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. గతంలో మధ్యవర్తిత్వం వహించిన వ్యవహారాలు వివాదాస్పదంగా మారే అవకాశాలు ఉన్నాయి. విద్యార్ధులకు ఈ వారం విద్య మీద కొంత ఏకాగ్రత లోపిస్తుంది. ఎంత చదివినా పెదాలను దాటి బుర్రలోకి, మనసులోకి సిలబస్ ఎక్కదు.

మకరం: మకరరాశి వారికి ఈ వారం  ఆరోగ్య పరమైన జాగ్రత్తలు అవసరం, ఆర్థిక లావాదేవీలు ఆశించిన రీతిలో చికాకు కలిగిస్తాయి. ఇల్లు కొనాలనుకున్న మీ ప్రయత్నం ఫలిస్తుంది. మిత్రుల సలహాలు సూచనలు మీకు లభిస్తాయి. వృత్తి విషయాలలో జాగర్తలు అవసరం. ఏలినాటి శని నడుస్తుంన్నందు వలన ఉద్యోగంలో కొన్ని మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరంగా  చిన్న చిన్న అభిప్రాయభేదాలు వచ్చినప్పటికీ తరువాత అవి సద్దుకుంటాయి. చంచల మనస్తత్వంతో ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి.  రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి ఆదాయాభివృద్ది ఉంటుంది. వ్యాపారస్తులకు, కళారంగం వారికి, సినిమా రంగం వారికి కూడా అభివృద్ధి కనబడుతుంది. సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితాలుండే అవకాశాలు ఉన్నాయి.

కుంభం:     కుంభ రాశి వారికి ఈ వారం  వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది.  ఉద్యోగంలో మీరు కోరుకున్న మార్పులు సానుకూల పడతాయి. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. సంతాన పురోగతి బాగున్నప్పటికీ వారి ప్రవర్తన వల్ల చికాకు ఏర్పడుతుది. సంతాన విద్యా విషయం పట్ల జాగర్త వహించండి.  దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. వీసా, గ్రీన్ కార్డు వంటివి లాభిస్తాయి. కొత్త అవకాశాలు కలసి వస్తాయి. వ్యాపార విషయాలు, భాగస్వాముల విషయంలో అతి నమ్మకం, నిర్లక్ష్యం పనికిరాదు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఇతరుల జోక్యం పనికిరాదు.
మనం నమ్ముకున్న వాళ్ళను మోసం చేసాం అన్న భాద వెంటాడుతుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు, బంధు మిత్రులతో కలసి విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు. వివాహం కానివారికి వివాహం కొంత ఆలస్యమవుతుంది. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించండి మంచి సంబంధం కుదురుతుంది.

 మీనం: మీనరాశి వారికి ఈ వారం ఉద్యోగస్తులకు ఆర్థిక పరమైన అంశాలు కొంత మేర ఆశాజనకంగా ఉంటాయి. కళా, సినీ రంగం వారికి పోటీ ఎదురవుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను అధిగమిస్తారు. సంఘములో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి.ఋణాలు తీసుకోక పోవడం మంచిది.  H1B  కోసం చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. వ్యాపారస్తులకు వ్యాపారమైనా వ్యవహారాలు అనుకూలిస్తాయి. మనం ఎంత కష్టపడితే అంత ఫలితం అనే ధోరణికి వస్తారు. భవిష్యత్తు బాగుంటుంది. వ్యాపారంలో పలు మార్పులు చేయడం ద్వారా లబ్ది పొందుతారు. విదేశీ సంభందిత విషయాలు అనుకూలిస్తాయి. విదేశీ యానం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు సానుకూల పడతాయి. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో పాల్గొంటారు.ప్రస్తుతం ఏలిన నాటి శని నడుస్తుంది కావున శని జపం చేయించుకోవడం చెప్పదగిన సూచన.  రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. శత్రువులు ఎక్కువగా ఉంటారు వారి పట్ల జాగర్త వహించండి.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News