Wednesday, January 22, 2025

వార ఫలాలు(26-08-2024 నుండి 31-08-2024 వరకు)

- Advertisement -
- Advertisement -

మేషం:   మేషరాశి  వారికి ఈ వారం మీరు చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. వ్యాపార పరంగా, సంస్థ పరంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశీయాన ప్రయత్నాలు, కంప్యూటర్‌ ఉపాధి అవకాశాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. శుభకార్యములను నెరవేర్చుట అదృష్టమని భావించండి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడానికి విశేషంగా శ్రమిస్తారు. సహోదర, సహోదరీ వర్గం  ఎన్ని తప్పులు చేసిన వెనకేసుకొస్తారు. జీవితంలో నమ్మకద్రోహం అనేది మొదటిసారి ఎదురవుతుంది, అప్రమత్తంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన.

వృషభం: వృషభరాశి వారికి  ఈ వారం గ్రహగతుల రీత్యా అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. పొదుపు చేసిన ధనాన్ని మంచి కార్యాల కొరకు ఖర్చు చేస్తారు. ఆరోగ్య సంబంధితమైన విషయములలో తగు జాగ్రత్తను వహించండి.భాగస్వామ్య వ్యాపారాలలో లావాదేవిలలో తప్పులు జరిగే ఆస్కారం గోచరిస్తుంది.విదేశీ సంబంధిత ఉద్యోగాలు లభిస్తాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది.. ధన ప్రాప్తి కన్నా ప్రఖ్యాతి పెరుగుతుంది. రాజకీయ పలుకుబడి ప్రజా సంబంధాలు లాభిస్తాయి. వ్యాపారంలో చేసే మార్పుల వల్ల మంచి ఫలితాలు వస్తాయి. వ్యవసాయ సంబంధ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వంశవృద్ధి కలుగుతుంది. కోర్టు సంబంధమైన పిటిషన్లు కేసులు ప్రధాన ప్రస్థావన అంశాలు అవుతాయి.

మిథునం:  మిథున రాశి  వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.ప్రజా సంబంధమైన వృత్తులలోని వారికి విశేష ఆదరణ, గుర్తింపు కలుగుతుంది. ఆర్థిక పరిస్థితిలో పురోగతి, విదేశీ ద్రవ్య ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు.నిరుద్యోగులు అందివచ్చిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నిలకడ కలిగిన ఉద్యోగం లభిస్తుంది. ప్రముఖ సంస్థలలో పని చేయడానికి అవకాశాలు లభిస్తాయి. సంతాన విషయమై చింతించవలసిన అవసరం లేదని గ్రహించి మనోధైర్యం కలిగి ఉంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.బంగారం, వెండి, వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం :  కర్కాటకరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.వృత్తి, ఉద్యోగాలలో మార్పులు చేస్తారు. అనుకున్నది సాధించగలుగుతారు. కెరియర్‌పరంగా బాగుంది. నిరుద్యోగులకు ఉద్యోగ పరంగా ఉన్నతావకాశాలు లభించే అవకాశం ఉంది. సంతానం చదువు, క్రమశిక్షణతో అవకాశాలను చక్కగా సద్వినియోగ పరచుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.  వ్యాపారంలో భాగస్వాముల పనితీరుని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. కాంట్రాక్టు, సబ్‌ కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. వ్యాపారంలో నూతన శాఖలు నెలకొల్పుతారు. సినిమా, టివి రంగంలోని వారికి, ట్రావెల్స్‌, ఆటోమోబైల్స్‌ రంగంలోని వారికి కాలం అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాలను ఘనంగా నిర్వహిస్తారు. శత్రువులకు బలం చేకూరుస్తుంది.అపార్ట్‌మెంట్‌ కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి.

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం ఆర్థిక  పరిస్థితి బాగుంది. కొన్ని స్థిరాస్తులు కొంటారు. కొన్ని స్థిరాస్తులు అమ్మి వేరే విధంగా అభివృద్ధి చేస్తారు. వృత్తి, వ్యాపారాలకు ఆర్టిక పరిస్థితి అనుకూలిస్తుంది. కాంట్రాక్ట్‌ వ్యాపారాలు, నూనె, ధాన్య వ్యాపారాలు బాగుంటాయి.  విదేశీ వ్యవహారాలు, స్పెక్యులేషన్స్‌, విద్యా సంబంధితమైన వ్యాపారాలు అనుకూలంగా ఉండి, లాభాల దిశలో నడుస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్‌, అనుకూల బదిలీలు, ప్రాదాన్యతలు పెరుగుట వంటివి జరుగుతాయి. ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆరోగ్య పరంగా బద్ధకం, అతినిద్ర, అలసట, నీరసం, మతిమరుపు కొద్దికాలం ఇబ్బంది పెడతాయి. విద్యా సంబంధ విషయాలలో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలలో కుటుంబానికి అండదండగా నిలుస్తారు.

కన్య:    కన్య రాశి వారికి  ఈ వారం వారికి  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకోని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపార విషయాలకు కొంత వరకు అనుకూల కాలమని చెప్పవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా పురోభివృద్ధిని సాధిస్తారు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అదృష్టం కలిసి వచ్చే విషయాల కన్నా కృషికి మాత్రమే తగినట్టి ఫలితం వస్తుంది. పని వత్తిడి, అధిక ప్రయాణాల వలన నిద్రాహారాలు సమయానుకూలంగా ఉండవు. స్వేచ్చ, అధికారం ఉండి కూడా చిన్నా చితకా పనులు చేయలేని అభద్రతా భావం కలుగుతుంది. మానసికంగా బలహీనపడతారు.  సహోదర, సహోదరీ వర్గంతో స్వల్పమైన భేదాభిప్రాయాలను గ్రహస్థితి సూచిస్తోంది. సన్నిహితుల ఆంతర్యం తెలుసుకుని జాగ్రత్తపడడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులేమీ ఉండవు. గోప్యంగా కొనుగోలు చేసిన స్థిరాస్తులు కొండంత అండగా ఉంటాయి.

తుల: తులా రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్య పరంగా సాధారణ అనారోగ్యం తప్పా దీర్ఘ  రోగములు దరికి చేరవు. స్త్రీ ల ఆరోగ్య విషయమై శ్రద్ధ వహించవలసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా ఇతరుల విషయాలలో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుని పోవడం చెప్పదగిన సూచన. వ్యాపారపరంగా ఒడిదుడుకులు ఏర్పడినా వాటిని ఏదో విధంగా అధిగమిస్తారు. లాభాలు ఓ మోస్తరుగా ఉంటాయి. ఆర్థికమైనటువంటి లోటుపాట్లను తీర్చుకోవడానికి అధికంగా శ్రమించవలసి వచ్చినప్పటికీ  మంచి ఫలితాలను సాధించగలుగుతారు. కుటుంబ పరువు ప్రతిష్టలు, పెంచగలుగుతారు. దీర్ఘకాలికంగా మీపై ఉన్న బాధ్యతలు తీర్చుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ దైవానుగ్రహం రక్షిస్తుంది. సాధ్యమైనంత వరకు ముఖ్యమైన వ్యవహారాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. విదేశీ అవకాశాలు అనుకూలించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.

వృశ్చికం:  వృశ్చికరాశి వారికి ఈవారం  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతాన విషయాలు సంతృప్తిని ఇస్తాయి. కుటుంబ సుఖ సంతోషాలకు అధిక ప్రాధాన్యతనిస్తారు.నెగిటివ్‌ ఆలోచనలు, ప్రతిచిన్నదానికి ఆందోళన పడటం అలవాటుగా మారుతుంది, డాక్టర్‌ సలహాలు అవసరమవుతాయి. వివాహాది శుభకార్యములలో రాజీలేని ధోరణి అవలంభిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి ప్రయాస మీద మంచి ఉద్యోగ అవకాశం అందుకోగలుగుతారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు నత్త నడక నడుస్తాయి.నిజమైన మిత్రులెవరో, కానివారు ఎవరో, స్పష్టంగా తెలుస్తుంది. ఈ పోరాటంలో చివరికి మీదే పై చేయి అవుతుంది. ప్రయాణాలు, దూరప్రాంత అవకాశాలు కలిసి వస్తాయి.

ధనస్సు:  ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి.ప్రతిష్టాత్మకమైన కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అసూయాగ్రస్తులైన శత్రువర్గంతో ఇబ్బందులు ఏర్పడినా వాటిని అధిగమించగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి.ప్రభుత్వ పరంగా, ప్రైవేటు సంస్థల పరంగా రావలసిన పెద్ద మొత్తంలో ధనం మీ చేతికి అందుతుంది. వ్యాపారంలో రొటేషన్‌కు ఇబ్బంది ఉండదు. నౌక, విమాన ప్రయాణాలు చేస్తారు. విదేశీయాన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వీసా, పాస్‌పోర్ట్‌ వంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక పరమైన పురోగతి బాగుంటుంది. స్థిరచరాస్తులు వృద్ధి చేస్తారు. రహస్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది.పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. రాజకీయ జీవితం బాగుంటుంది.

మకరం:  మకర రాశి వారికి  ఈ వారం ఆర్థిక పరమైన వ్యవహారాలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలోని కలహాలు అభివృద్ధికి, పురోగతికి అడ్డుగా నిలుస్తాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి. ఉద్యోగంలో మంచి స్థానం లభిస్తుంది. కార్యాలయంలో ప్రతి విషయానికి విమర్శకులు, చాడీలు చేప్పే వారు, పిటిషన్లు పెట్టే వారి వలన ఆటంకాలు, వాగ్వివాదాలు సంభవిస్తాయి. సంతాన పురోభివృద్ధి మానసిక ప్రశాంతతకు కారణం అవుతుంది. ప్రేమ సంబంధిత, వైవాహిక సంబంధిత విషయాల్లో మీ అంచనాలు తలక్రిందులు అవుతాయి.చట్టపరమైన వివాదాలు, కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరమైన మినహాయింపులు కూడా ప్రభుత్వ పరంగా వస్తాయి.స్వల్ప ధనలాభం సూచిస్తుంది.శుభకార్యాలకు గాను ఆహ్వానాలను అందుకుంటారు.  ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. విజయాలు కార్యరూపంలో కనిపించినా ఆసహనంగా ఉంటారు.

కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి.వారసులను పైకి తీసుకు రావాలన్న ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. స్థాయికి తగని వ్యక్తులను ప్రోత్సహించారన్న నిందలు వస్తాయి.నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనలు చోటు చేసుకుంటాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ఆహార ధాన్యాల వ్యాపారం లాభిస్తాయి. వృత్తిపరంగా కనబరిచే ఓర్పు మంచి ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల పరంగా లౌక్యాన్ని ప్రదర్శించి లాభ పడతారు. ఆత్మీయ వర్గంతో బంధుత్వానికి ప్రయత్నాలు చేస్తారు కానీ నిర్ణయాలు అటువైపు నుండి వాయిదా పడతాయి. ఆకస్మికంగా మంచి సంబంధం కుదురుతుంది.ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

­ మీనం: మీనరాశి వారికి ఈ వారం  అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.రాజకీయపరంగా తీసుకునే నిర్ణయాలు లాభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు తప్పక పోవచ్చును. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కొంత సమస్యగా మారతాయి. శుభ కార్యాలు ఘనంగా నిర్వహించడానికి గాను ధనాన్ని సమకూర్చుకుంటారు. దుబారా ఖర్చులు, అదాయాన్ని మించిన ఖర్చులు ఇబ్బంది పెడతాయి. నూతన భాగస్వాములను చేర్చి వ్యాపారం ప్రారంభిస్తారు. ప్రారంభించిన వ్యాపారం చాలా బాగుంటుంది. అధికంగా లాభాలు వస్తాయి. న్యాయబద్ధంగా మీకు రావలసిన ఉద్యోగం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించవలసి వస్తుంది. చట్టపరమైన వివాదాలు, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. గృహప్రవేశాలు, శుభకార్యాలు సంతోష పరుస్తాయి. ఏలిననాటి శని నడుస్తునందు వలన పదకొండు మంగళవారాల పాటు ఆంజనేయస్వామి వారికి ఆకు పూజ చేయించండి.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News