Thursday, December 19, 2024

వార ఫలాలు 28-01-2024 నుండి 03-02-2024 వరకు

- Advertisement -
- Advertisement -

మేషం:  మేషరాశి వారికి ఈవారం కొంత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి.ఉద్యోగస్తులకు యధాతధంగా ఫలితములుంటాయి. వ్యాపారస్తులకు కొద్దిపాటి ఒడిదుడుకులు ఉన్నా అనుకూలమైన ఫలితాలుంటాయి.వ్యాపారంలో జాగ్రత్త.  నూతన ప్రణాళికలు రూపు దిద్దుకుంటాయి. కుటుంబంలో కానీ, కార్యాలయాలలో పెద్ద వారితో ప్రశంసలు అందుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థిని విద్యార్థులకు నూతన విద్యా విషయాలు మొదలు పెట్టుటకు, అలాగే  ఉద్యోగ ప్రయత్నాలకు మంచి సమయం.ఆరోగ్యం బాగుంటుంది.

వృషభం: వృషభరాశి  వారికి ఈవారం ఏదైనా వ్యవహారాలు, చేయవలసిన పనులు వంటివి ఉంటె త్వరగతిన పూర్తి చేయడం మంచిది.   కొంత సహనం, నిర్లక్ష్య ధోరణిని అదుపులో ఉంచుకోవడం మంచిదని చెప్పదగ్గ సూచన. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ప్రణాళికతో పనిచేస్తే మేలు జరుగుతుంది. కొంత కోపాన్ని నియంత్రించుకుని, మాట  మాటని పొదుపుగా వాడాలి. కుటుంబంలో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి నిరాశ ఎదురవ్వవచ్చు. మానసిక ధైర్యంతో ముందుకు సాగండి. దుర్గామాతని జవాదు కుంకుమతో అర్చన చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి.వ్యాపారస్థులకు కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

మిథునం: మిథునరాశి  వారికి ఈవారం అన్ని విధాల జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు పైఅధికారులతో మాట పట్టింపులు, పని ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి.  కార్యాలయాలలో కానీ, మీరు పని చేసే చోట కానీ మీ మీద నిఘా ఉండే అవకాశాలు ఉంటాయి.  కుటుంబంలోని కొందరి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కొంత కుటుంబ పరంగా కూడా చికాకులు ఉండవచ్చు. తద్వారా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వారం ద్వితీయార్ధంలో కొంత సానుకూలత ఏర్పడుతుంది.  నిదానమే ప్రధానము అన్నట్టు ఉండండి. ఎవరినీ నమ్మవద్దు. సొంత విషయాలు ఇతరులతో చర్చించవద్దు.

కర్కాటకం : కర్కాటకరాశి వారు పూర్తిగా మిశ్రమ ఫలితాలను అందుకుంటారనడంలో సందేహం లేదు. లోన్లు, ఋణాలు చేసే విషయంలో కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొంత జాగ్రత్త వహించండి.ప్రారంభించిన పనులు మధ్యలో ఆపవద్దు.ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకోని ఆర్థిక పరమైన నష్టాలు కూడా ఉండచ్చు.జాగ్రత్త వహించండి.  జీవిత భాగస్వామితో కొంత అభిప్రాయభేదాలు ఉండవచ్చు.కుటుంబంలో అధికంగా ఖర్చులు కానవస్తాయి. వృధా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. విద్యార్థిని విద్యార్థులు కొంత శ్రద్ద వహించి, మీ మేధస్సుకి పదును పెట్టి ముందుకు సాగండి.

సింహం: ఈవారం సింహ రాశి వారికి ఉద్యోగ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితములు గోచరిస్తున్నాయి. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. వారం ప్రధమార్ధం మందకొండిగా సాగినా ద్వితీయార్ధంలో ఊపందుకుంటాయి. రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది.గతంలో కంటే కొంత ఖర్చులు తగ్గుతాయి.నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి మంచి సమయం అని చెప్పవచ్చు.వివాహ ప్రయత్నములు చేసే వారికి కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి.  ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు.విద్యార్థిని విద్యార్థులకు మంచి సమయం అని చెప్పవచ్చు.

కన్య:  ఈ వారం కన్యారాశి వారికి కుటుంబ పరంగా, బంధువుల నుండి మిశ్రమ ఫలితాలు ఎదురవ్వ వచ్చు. విందువినోద కార్యక్రమాలలో, శుభకార్యాలలో కాని మీ సన్నిహితులు, బంధు మిత్రుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.మీ ముందు ఒకలాగా, వెనకాల ఒక లాగ చెప్పేవారుంటారు.కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. ఉద్యోగ పరంగా  కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుండె అవకాశాలు ఉన్నాయి. ఈ కన్యారాశి స్త్రీలకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది.

తుల: తులారాశి వారికి ఈ వారం వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ రంగం వారికీ, టెక్నీకల్ రంగం వారికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారంలో శుభఫలితాలు గోచరిస్తున్నాయి. లక్ష్య సాధనలో సమష్టికృషి అవసరం అని గ్రహించండి.ఉద్యోగ పరంగా కొంత లోన్లు, ఋణాల విషయంలో ఆందోళనలు, ఒత్తిడులు ఉండే అవకాశాలు ఉన్నాయి.  బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. స్థిరాస్తి వృద్ధి చేయాలనుకునే వారికి, చాలా కాలం నుండి సొంత గృహం ఏర్పరుచుకోవాలని కలలు కనే వారికి సరి కొత్త నిర్ణయాలు తీసుకునే సమయం అని చెప్పవచ్చు.ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి అనుకున్నంత ఫలితాలు రాకున్నా, ఎదో ఒక అవకాశం వచ్చింది అన్న తృప్తి లభిస్తుంది.విద్యార్థిని విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైన ఫలితాలుంటాయి.

వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈవారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. గతంలో కంటే కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, అయితే కొంత నిదానం, మాటలో సున్నితత్వం ఉంచి మాట్లాడితే అన్నివిధాలా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి ఉంటుంది. రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది.శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ఆర్థికపరమైన లాభాలు ఉంటాయి. విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితాలు పొందే సమయం అని చెప్పవచ్చు.

ధనస్సు: ధనుస్సు రాశి వారికి ఈ వారం కుటుంబ పరంగా సౌఖ్యం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల కోసం ఖర్చులు అధికంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి.  సహోద్యోగులతో, మీ కుటుంబ సభ్యుల దగ్గర మీ యొక్క ఫ్రస్ట్రేషన్ ను బయట పెట్టడం అంత మంచిది కాదు. ఉద్యోగస్తులకు అధికారుల నిరాదరణ ఎదురవ్వవచ్చు. వంచనకు, నమ్మక ద్రోహమునకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మీ యొక్క వ్యక్తిత్వం మిమ్మల్ని మంచి అభివృద్ధి లోకి రావడానికి సహాయ పడుతుంది. విద్యార్థిని విద్యార్థులకు పరీక్షల యందు ఒత్తిడి, మానసిక ఆందోళనలు లేకుండా ఉంటె మంచి ఫలితాలు ఏర్పడతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

మకరం: మకరరాశి వారికి ఈవారం ఉద్యోగ పరంగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కొంత సానుకూలత ఉంటుంది. మంచి ఫలితములను పొందగలుగుతారు. కుటుంబ పరమైన శుభకార్యములలో తాత్కాలికమైన సంతోషం లభిస్తుంది . కుటుంబం యొక్క అండదండలు ఎప్పుడు ఉంటాయి. అయితే మీమీద లేనిపోని ఆరోపణలు వస్తాయి.  విద్యార్థిని విద్యార్థులకు పట్టుదలతో,బాధ్యతతో మెలగాల్సిన సమయంగా చెప్పవచ్చు.  నిత్యం శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, మేధా దక్షిణామూర్తి డాలర్ మెడలో ధరించడం మేలు చేకూరే అంశాలు.

కుంభం: కుంభరాశి వారికి ఈవారం అనుకూలమైన ఫలితాలు పొందే సమయంగా చెప్పవచ్చు. స్థిరాస్తి వృద్ధి చేసుకోవాలనుకునే వారి ప్రయత్నాలు సానుకూల పడతాయి.సంతాన పరంగా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు.  మీకు నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది.మీరు అనుకున్న పనులు, కార్యక్రమాల విషయంలో తృప్తి అనేది లభిస్తుంది. సంఘంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నామనే భావన ఉంటుంది. ఉద్యోగస్తులకు కొంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆదాయాభివృద్ది ఉంటుందికుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది.

మీనం: మీనరాశి వారికి ఈ వారం అన్ని విధాల బాగుంటుంది. ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి ఉంటుంది. పైఅధికారులనుండి ప్రశంసలు లభిస్తాయి.గతంలో ఏర్పడిన చిన్నపాటి చిక్కులు తొలగిపోతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు  చేసే వారు సఫలీకృతులు అవుతారు. వ్యాపారస్తులకు మంచి లాభములు ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలలో కొంతవరకు చిక్కులు, చికాకులు తొలగుతాయి.విద్యార్థిని విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత సాధించే సమయం అని చెప్పవచ్చు.శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబ పరంగా సానుకూలత ఉంటుంది. రాజకీయ, కళాసంస్కృతిక రంగాల వారికీ ఆశించినంత ఫలితాలు అంతగా

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News