Thursday, December 19, 2024

వార ఫలాలు 28-04-2024 నుండి 04-05-2024 వరకు

- Advertisement -
- Advertisement -

మేషం:    మేషరాశి   వారికి  ఈ వారం అనుకూలంగా ఉంది. సమాజంలో మీ స్థాయి, కుటుంబ స్థాయి పెరుగుతుంది. మిమ్మల్ని వ్యతిరేకించిన వ్యక్తులు కూడా మీ బాటలోనే నడుస్తారు. తల్లిదండ్రుల, పెద్దల ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. మీ వ్యక్తిగత రహస్యాలను బయటకు వెల్లడిస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా వెళ్లగొడతారు. వారసత్వంగా వచ్చిన ఆస్తి విలువ ఊహించనంతగా పెరుగుతుంది. కొన్ని స్థలాలను డెవలప్‌మెంట్‌కి ఇస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.ఆర్థిక పరమైన సర్దుబాట్లను చక్కగా చేయగలుగుతారు. వివాహానంతర జీవితం బాగుంటుంది. సంతాన సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరంగా రహస్య వ్యూహం విజయవంతం అవుతుంది.

వృషభం:  వృషభ రాశి వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.ఇంత కాలం పడ్డ మీ శ్రమకు ఫలితం లభిస్తుంది. చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. నూతన ఉద్యోగ, విద్యావకాశాలు లాభిస్తాయి.వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆదాయ వ్యయాలలో సమతుల్యతను సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి.చెవి, ముక్కు గొంతు సంబంధితమైన చిన్న చిన్న ఇబ్బందులేర్పడతాయి. దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు.

మిథునం:   మిథునరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో మార్పులు ధనప్రాప్తికన్నా కీర్తిని పెంచుతాయి.మానసిక సంతోషం కలుగుతుంది.  ఆర్థిక లాభాలు, ప్రయోజనాలు పదవులు ఈ సారి లాభిస్తాయి. పొటీ పరీక్షలు, టెండర్‌ ఫలితాలు వెల్లడితో ఆనందపడతారు. స్త్రీలతో విభేదాలు సంభవించే అవకాశం ఉంది.ఆవేశపడకుండా యుక్తిగా వ్యవహరించండి. పోటీపరీక్షల ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి.మీకు వ్యక్తిగతంగా లాభించే ముఖ్యమైన ప్రయాణాలు, చర్చలు, సమావేశాలు ఒక నెల వాయిదా పడతాయి. సభలు, సమావేశాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మంచి వ్యక్తిగా, మాటకారిగా, పేరు గడిస్తారు. ఆకస్మికంగా విదేశీయానం చేయవలసి వస్తుంది.

కర్కాటకం :  కర్కాటకరాశి వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.వీలైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండండి. గృహసంబంధమైన కలహాలు తీర్చడంలో చిరాకు పడతారు. ఆత్మీయుల మధ్య ఈ విభేదాలు ఏంటో మీకు అర్థం కావు.
వృత్తి, ఉద్యోగాల పరంగా సరదాగా ప్రారంభించిన పనులు మంచి లాభాలను తెస్తాయి.సంతాన భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని చాలా విషయాలలో సర్దుకుపోతారు. ఏది ఏమైనా ముఖ్యమైన బరువు బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. మీరు నమ్ముకున్న ఇలవేల్పు కరుణిస్తాడు.విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు.  సామాజిక సేవా కార్యక్రమాలకు విరివిగా ధనం ఖర్చు పెడతారు.  స్థిరాస్తి వ్యవహారాలు మాత్రం ఓ కొలిక్కి వస్తాయి.

  సింహం: సింహరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.మీరు అభిమానించే వ్యక్తులు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. పోటీ పరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగము సంపాదిస్తారు.పిల్లల విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు సంభవిస్తాయి. వీలైనంతవరకు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. మీ వివాదాల ప్రభావం పిల్లల మీద పడకుండా జాగ్రత్త పడండి.సినీ, కళారంగాల్లో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది.ప్రేమ వివాహాల విషయాల్లో మీ అభిప్రాయాలు స్పష్టంగా తెలియజేస్తారు. అనుబంధాలు పెంచుకోవడం చాలా కష్టమైన పని, తెంచుకోవడం చాలా తేలికైన పని, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.విదేశాలలో మంచి ఉద్యోగము దొరుకుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త వహించండి.

  కన్య:    కన్య రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంత మేర మంచి ఫలితాన్ని ఇస్తాయి.
బంధువర్గంలో విభేదాలు చికాకు కలిగిస్తాయి. రాజకీయ, సామాజిక, సేవా రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. సంతాన పురోగతి కోసం శక్తికి మించి ఖర్చుపెడతారు. స్త్రీల వల్ల ప్రయోజనాలు పొందుతారు.వ్యాపారానికి జనాకర్షణ ఏర్పడుతుంది. న్యాయము అనిపిస్తే మీరు నేరుగానే సహాయపడండి. కాంట్రాక్టులు లీజులు, టెండర్లు లాభిస్తాయి. బుణాలు తీర్చివేస్తారు.విద్యాసంబంధమైన విషయాలలో సంతానం అభివృద్ధి బాగుంటుంది. సంతానం వలన ప్రతిష్ట పెరుగుతుంది.

తుల: తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు.ఆర్థిక పరమైన విషయాలు బాగున్నాయి. విద్యా విషయంలో సంతాన పురోగతి మీకు సంతోషం కలిగిస్తుంది. పరీక్షలలో విజయం సాధిస్తారు.  విదేశీయానం కలిసివస్తుంది.  విదేశాలలో చదువుకునే అవకాశం, ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది. నరదృష్టి అధికంగా ఉంది.మీ ద్వారా లబ్ది పొందిన ఓ రాజకీయ నాయకుని వల్ల తిరిగి ప్రయోజనం పొందుతారు.జీవిత భాగస్వామి అన్ని విషయాలలో మీకు అండగా ఉన్నా విభేదాలు తప్పకపోవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది.రాజకీయ రంగంలో వారికి ఈ వారం బాగుంది. రియల్ ఎస్టేట్ వారికి మంచి కాలం అని చెప్పవచ్చు,

 వృశ్చికం:    వృశ్చికరాశి వారికి  ఈవారం మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి కార్యసానుకూలత,మానసిక సంతృప్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో మీరు ఆశించిన మార్పులను చూస్తారు. వివాహం కానివారికి ఈ వారం వివాహం కుదురుతుంది. కుటుంబ సభ్యులతో కలసి శుభకార్యాలలో పాల్గొంటారు. విదేశాలలో చేస్తున్న ఉద్యోగంలో స్థాన చలనం కలుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి.విద్యార్థిని విద్యార్థులకు  మంచి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. కష్టే ఫలి అనేవిధంగా మెరిట్ మార్కులు సాధిస్తారు.

 ధనస్సు:   ధనస్సు రాశి  వారికి  ఈ వారం ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి.భాగస్వాములు, సన్నిహితులు సహకారం మనశ్శాంతిని కలిగిస్తాయి.
విద్యా సంబంధమైన విషయాలు అనూకూలిస్తాయి. ఐఐటి వంటి సాంకేతిక విద్యలలో సంతానం రాణిస్తారు. ఆర్థిక సహాయం కోసం స్నేహితుల, బంధువులను అడగకుండా లోన్ పెట్టుకుంటారు లోన్ వస్తుంది.సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. పెండింగ్ లో వున్న ప్రమోషన్ ఇంక్రెమెంట్స్ వచ్చే అవకాశం వుంది,  వ్యవసాయ రంగం వారికి, వినోద రంగం వారికి  కొత్త పనులు ప్రారంభించడానికి  ఇది అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి, కంప్యూటర్ రంగం వారికి మంచి విజయములు సంప్రాప్తిస్తాయి.

 మకరం: మకరరాశి వారికి ఈ వారం  అనుకూలంగా ఉంటుంది.వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మీరు అనుకున్న పురోగతి సాధించి, నలుగురి మెప్పు పొందుతారు.పెరిగిన కుటుంబ ఖర్చులకు  వ్యాపారస్తులకు ఆర్ధిక లాభముల బాగున్నాయి. ఉద్యోగస్తులకు సామాన్యంగా  ఫలితములు ఉంటాయి ఈవారం. డబ్బు విలాసాలకు ఎక్కువ ఖర్చు చేస్తారు, వృధా ఖర్చులు తగ్గించాలి, అవసారినికి మించి ఖర్చు చేయకపోవడం చెప్పదగిన సూచన.స్త్రీలతో విభేదాలు, విలువైన వస్తువుల విషయంలో, ఆస్తుల విషయంలో చిన్నచిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. విద్యా సంబంధమైన విషయాలలో సంతృప్తి కలుగుతుంది. ఐఐటి, గ్రూప్‌ సర్వీసులకు సివిల్‌ సర్వీసులకు ఎంపికవుతారు.సహోదర, సహోదరీ వర్గానికి,  బంధువులకు మీ చేతిలో ఉన్న సహాయ సహకారం అందిస్తారు.

కుంభం:       కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.సొంత సంపాదనతో గృహయోగం ఏర్పరచుకుంటారు. తల్లిదండ్రుల అభిప్రాయాలకి మీ అభిప్రాయాలకి పొంతన కుదరదు.ఉద్యోగపరంగా కష్టపడినందుకు ఫలితం దక్కుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు సూచిస్తున్నాయి.  సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండాలి. శుభకార్యములు, వ్యవహారములు అనుకూలిస్తాయి.స్త్రీల వల్ల కొన్ని ప్రయోజనాలను పొందుతారు. అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని మంచి ఫలితాలు పొందగలరు.విద్యార్థిని విద్యార్థులకు పెద్దల మాట విని, అవగాహనతో  ప్రవర్తిస్తే మంచి విజయాలు వరిస్తాయి. ఆరోగ్యం  కూడా  గతంలో కంటే బాగుంటుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది.

మీనం: మీనరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి.  కుటుంబంలో ఎదురైన వివాదాలు పరిష్కరించుకొంటారు.తాత్మాలిక, ఆర్థిక ప్రయోజనాలను తగ్గించుకుని కొన్ని పనులు పూర్తి చేస్తారు. మీ అంచనాలకు తగినట్లే వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు సాధించిన విజయాల వెనుక మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి.సంతాన యోగక్షేమాలపై అధిక శ్రద్ధ కనబరుస్తారు.  వీసా, పాస్‌పోర్టు వంటి అంశాలు అనుకూలిస్తాయి. గ్రీన్‌కార్డు కోసం ఆందోళన చెందుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో మీది ప్రధానపాత్ర అవుతుంది.  రాజకీయ నాయకులు మీరు చేసిన మేలు గుర్తుపెట్టుకుంటారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News