Thursday, December 19, 2024

వార ఫలాలు(28-09-2024 నుండి 05-10-2024 వరకు)

- Advertisement -
- Advertisement -

మేషం:   మేషరాశి  వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆదాయానికి మించి  ఖర్చులు ఎక్కువగా ఉంటాయి . ఆరోగ్య సంబంధమైన విషయాలు జాగ్రత్త వహించాలి . ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధమైన విషయాలు ఈ వారం అనుకూలంగా ఉంది . పాస్పోర్ట్ రెన్యూవల్ విషయంలో జాప్యం జరుగుతుంది . వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంది.  నూతన వ్యాపారాలు అవకాశాలు కలిసి వస్తాయి .  భాగస్వామి వ్యాపారాలు కలిసి  వస్తాయి . విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. సాఫ్ట్ వేర్,  రంగం వారికి గడ్డుకాలం అని చెప్పొచ్చు . అకౌంట్స్, ట్రావెల్ ఏజెన్సీ , కార్పొరేట్ గిఫ్ట్స్ వారికి ఈ వారం మంచి లాభాలని చెప్పవచ్చు . వివాహం కాని వారికి  మంచి సంబంధం కుదురుతుంది . విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు .  విదేశీ విద్యలో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి . కంగారు పడవద్దు పట్టుదలతో ముందుకు సాగండి .  ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు వస్తుంది. ప్రయాణాల  విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

వృషభం: వృషభరాశి వారికి  ఈ వారం బాగుందని  చెప్పవచ్చు .చేసిన ప్రతి పని కష్టంతో పూర్తి చేస్తారు . వృత్తి ఉద్యోగాల పట్ల చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా అధిగమించగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి  ఆనందంగా గడుపుతారు . ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు .ఉద్యోగం మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వీసాకు సంబంధించిన  విషయాలు అనుకూలిస్తాయి.  షేర్ మార్కెట్ కు దూరంగా ఉండండి.  వ్యాపారస్తులకు ఈ వారం కొంత బాగుందని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్ ఎలర్జీ , ఉబ్బసం, మోకాళ్ళ నొప్పులు ఉండే అవకాశం ఉంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం  అనుకూలంగా ఉంటుంది. వీసా హెచ్ వన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన  స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు .

మిథునం:  మిథున రాశి  వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  సహోదర సోదరి మధ్య విభేదాలు  వచ్చే అవకాశం ఉంది . వ్యాపారం బాగుంటుంది. నూతన వ్యవహారాలు అనుకూలిస్తాయి. పిల్లలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి . వీసా ప్రయత్నాలు అనుకూలిస్తాయి . విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి . స్నేహితుల సహాయం వల్ల మేలు జరుగుతుంది.  దైవ దర్శనాలు అనుకూలిస్తాయి.  గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు.  సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన యోగం.  వివాహ ప్రయత్నాలు చేసే వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ రాశిలో జన్మించిన  స్త్రీలకు  బాగుందని  చెప్పొచ్చు . వ్యాపార పరంగా బాగుంది .విదేశీ  వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి .

కర్కాటకం :  కర్కాటకరాశి వారికి ఈ వారం చేపట్టిన ప్రతి పనిలోనూ అద్భుతమైన ఫలితాలు  సాధిస్తారు.  ఆదాయం చక్కగా ఉంటుంది, అలాగే  ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి.  విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.  దైవ దర్శనాలు  కొలిక్కి వస్తుంది. తలపెట్టిన ప్రతి పని అనుకూలంగా ఉంటుంది.  విదేశంలో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.  సాఫ్ట్ వేర్, ఉద్యోగస్తులకు గడ్డు కాలం అని చెప్పవచ్చు.వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది.  ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలి సహోదర సహోదరుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది.  జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.  హెచ్ వన్ బి వీసా  కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థిని  విద్యార్థులకు మంచి కాలం అని చెప్పవచ్చు.ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు బాగుందని చెప్పవచ్చు.

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి . అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు . ఉద్యోగస్తులకు కాలం బాగుందని చెప్పవచ్చు . అవసరానికి మించి ఖర్చు పెట్టకపోవడం చెప్పదగిన సూచన. సహోదర  సహోదరుల మధ్య విభేదాలు  వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి . అధిక ధన సూచన కనిపిస్తోంది . ప్రతి విషయానికి తొందరపాటు పనికిరాదు. వ్యాపారస్తులకు వ్యాపారం నిదానంగాకొనసాగుతుంది.  భాగస్వామి వ్యాపారంలో విభేదాలు వచ్చే సూచన కనిపిస్తున్నాయి. విద్యార్థిని విద్యార్థులకు మంచి కాలం అని చెప్పవచ్చు. విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం  బాగుంది . లాయర్ వృత్తిలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి.  విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకునే వారికి కొంత  వీసా విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు  వృత్తి ఉద్యోగాల్లో చెప్పదగిన మార్పులు.

కన్య:    కన్య రాశి వారికి  ఈ వారం బాగుందని చెప్పొచ్చు.  విదేశీ వ్యవహారాలు  అనుకూలిస్తాయి. సాఫ్ట్ వేర్ , చార్టెడ్ అకౌంట్స్  కన్సల్టెన్సీ , మెడికల్ ఫీల్డ్ లో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. పిల్లల విద్యా విషయం పట్ల ఎక్కువగా ఆందోళన చెందుతారు వారి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు .విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదవాల్సిన సమయం అని చెప్పవచ్చు.  విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి.  విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా లభిస్తుంది.  హెచ్ వన్ బి కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తోంది . ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల బాగుందని చెప్పవచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి . ఉన్న ఉద్యోగంలోనే కష్టపడితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.  ప్రతిరోజు హనుమాన్ చాలీసా పటించడం చెప్పదగిన సూచన .

తుల: తులా రాశి వారికి ఈ వారం  బాగుందని చెప్పవచ్చు . విదేశీ వ్యవహారాలు  అనుకూలిస్తాయి . జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  గ్యాస్ట్రిక్,  మోకాళ్ళ నొప్పులు , స్కిన్ ఎలర్జీ వంటివి ఇబ్బంది పెడతాయి.  ఉద్యోగస్తులకు కాలం బాగుందని చెప్పవచ్చు. నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు.  ప్రమోషన్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ వారం వచ్చే అవకాశం ఉంది.  విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది.  చేసే పనిలో కష్టంతో పాటు లాభాలు కూడా గడిస్తారు.  రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగుందని చెప్పొచ్చు. సాఫ్ట్ వేర్, కన్సల్టెన్సీ వ్యాపారస్తులకు గడ్డు కాలం అని చెప్పొచ్చు . ఫైనాన్స్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  విద్యార్థిని విద్యార్థులకు విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి . ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృశ్చికం:  వృశ్చికరాశి వారికి ఈవారం అనుకూలంగా లేదని చెప్పొచ్చు .వృత్తి  ఉద్యోగాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి.  జీవిత భాగ్యస్వామితో  చిన్నపాటి విభేదాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కాలం బాగుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు కాలం బాగుందని చెప్పవచ్చు . సాఫ్ట్ వేర్, ఉద్యోగస్తులకు కాలం బాగుందని చెప్పొచ్చు . రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంటుంది. వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు చేయవచ్చు . సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి శుభవార్తలు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సంపాదిస్తారు . విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. హెచ్ వన్ బి కోసం  ప్రయత్నిస్తున్న వారికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి.  గ్రీన్ కార్డు కోసం చూస్తున్న వారు కూడా ఈ వారం బాగాలేదని చెప్పవచ్చు . ఈ రాశిలో జన్మించిన  స్త్రీలకు కాలం బాగుందని చెప్పొచ్చు .

ధనస్సు:    ధనస్సు రాశి వారికి ఈ వారం  బాగుందని చెప్పొచ్చు . ఉద్యోగస్తులకు కాలం బాగుందని చెప్పొచ్చు.   ప్రభుత్వ పరంగా ఉన్నవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. సాఫ్ట్ వేర్, ఉద్యోగస్తులకు కాలం బాగుందని చెప్పవచ్చు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగం లభిస్తుంది .చార్టెడ్ అకౌంట్స్ కు లాయర్లకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు.  హౌసింగ్ లోన్  కోసం ప్రయత్నిస్తున్న వారికి హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది.రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదని చెప్పొచ్చు . విద్యార్థిని విద్యార్థులకు కాలం బాగుందని  చెప్పవచ్చు.  వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.ఈ రాశిలో జన్మించిన  స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు.  ఫైనాన్షియల్ విషయానికి వస్తే ఖర్చులని అదుపులో ఉంచుకోవాలి.

మకరం:   మకర రాశి వారికి  ఈ వారం  అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఏ విషయమైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి . ఉద్యోగస్తులకు కాలం  వ్యతిరేకంగా ఉంది .ఏ పని చేసినా వెనక్కి వెళ్లడం జరుగుతుంది . సహోద్యోగులతో  చిన్నపాటి విభేదాలు చోటు చేసుకుంటాయి.  నలుగురు లోనూ అపఖ్యాతి లభిస్తుంది.  గృహ నిర్మాణ పనులు చేపట్టడానికి ఇది సరైన సమయం కాదు.  వాహన యోగం కూడా ఉంది . వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.  ఆరోగ్యపరమైన  జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు .విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది . వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం అయ్యే  అవకాశం గోచరిస్తుంది . ఈ రాశిలో జన్మించే స్త్రీలకు కాలం బాగుందని  చెప్పవచ్చు.

కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం  బాగుందని చెప్పొచ్చు.  ఆరోగ్యపరంగా బాగుంటుంది.  ఉద్యోగస్తులకు ఈ వారం  బాగుందని చెప్పొచ్చు.  ప్రమోషన్ లభిస్తుంది. ప్రభుత్వ పరంగా  ఉన్నటువంటి ఏమైనా చిక్కులు ఉంటే ఈ వారం తొలగిపోయే  అవకాశం గోచరిస్తుంది.  సాఫ్ట్ వేర్,  ఉద్యోగస్తులకు కాస్త ఇబ్బందికరం అని చెప్పొచ్చు.  ఆరోగ్యం పట్ల అజాగ్రత్త  వహిస్తారు. వైద్య  వృత్తిలో ఉన్న వారికి కాలం బాగుందని చెప్పవచ్చు . వ్యాపార పరంగా  లాభసాటిగా ఉంటుంది . ఫైనాన్స్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి . ఈ  వారం సంతాన విషయంలో శుభవార్తను వింటారు . ఈ రాశిలో జన్మించిన  స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు.కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది . విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది . గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది .

­ మీనం: మీనరాశి వారికి ఈ వారం  చాలా బాగుందని చెప్పొచ్చు . ప్రతి  పనిలోనూ మంచి ఫలితం సాధించగలుగుతారు . ఆదాయం మీద ఖర్చులు తక్కువగానే ఉంటాయి. ఎన్నో కష్టాల నుండి ఈ వారం బయట పడ్డామన్న భావన కలుగుతుంది . ఉద్యోగస్తులకైతే ఈ వారం  బాగుందని చెప్పవచ్చు . విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి . కొత్త ప్రాజెక్టులు మీకు  వస్తాయి.  వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు . ఈ రాశి వారికి నరదిష్టి అధికంగా ఉంటుంది.  మన దగ్గర ఏమీ లేకపోయినా సరే ఏదో ఉందని భావిస్తారు.  విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది . వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా లభిస్తుంది.   వైద్య వృత్తిలో  ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. సంతాన పరంగా ఈ వారం  బాగుందని చెప్పొచ్చు .

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News