Monday, December 23, 2024

వార ఫలాలు 29-10-2023 నుండి 04-11-2023 వరకు

- Advertisement -
- Advertisement -

మేషం: మేషరాశి వారికి ఈ వారం కుటుంబపరంగా, జీవిత భాగస్వామితో జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. చిన్నపాటి మాట పట్టింపులు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు సానుకూలంగా వుంది అని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగంలో మార్పు, ట్రాన్స్‌ఫర్ కోసం చేసే ప్రయ్నత్నాలకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు శత్రువర్గం నుండి అనుకూలమైన స్పందనలు, సంతోషం లభించే అవకాశములు ఉన్నాయి. ఈ వారం స్త్రీలకు అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఈ రాశివారు శివాలయంలో అభిషేకం చేయడం చెప్పదగిన సూచన.

వృషభం: వృషభరాశి వారికి ఈ వారం సర్వత్రా అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి.ఉద్యోగస్తులకు సానుకూలత, అధికార అభివృద్ధి ఉంటుంది. పైఅధికారులతో ప్రశంసలు అందుకునే అవకాశములు ఉన్నాయి. వ్యాపారస్తులకు ప్రజాభిమానం, ఆర్థికాభివృద్ధి ఏర్పడే అవకాశములు గోచరిస్తున్నాయి. చిరు వ్యాపారస్తులకు సైతం ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. సాఫ్ట్‌వేర్ రంగం వారికి, టెక్నికల్ రంగం వారికీ అనుకూలిస్తుంది. ఏ పనైనా జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకోండి. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలుంటాయి.ఈ వారం స్త్రీలకు సంతోషకరమైన వార్తలు వింటా రు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారం బాగుంటుంది. నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

మిథునం: మిథునరాశి వారికి ఈ వారం ప్రతికూలమైన ఫలితాలుండే అవకాశములు గోచరిస్తున్నాయి.ఉద్యోగస్తులకు గౌరవం వృద్ధి చెందుతుంది, అయితే ఆర్థికాభివృద్ధి అంతంత మాత్రం అన్నట్టుగా ఉంటుంది.వ్యాపారస్తులకు పలుకుబడి బాగుంటుంది.లాభాలతో పాటు పెట్టుబడులు కూడా ఎక్కువ పెట్టే అవకాశాలున్నాయి. జాగ్రత్త వహించండి. వ్యవహారములు పట్ల కానీ, కుటుంబంలో కార్యక్రమముల విషయంలో కానీ ఆచితూచి అడుగువేయాలి. కుటుంబంలో జీవిత భాగస్వామితో, అలాగే సంతానంతో చిన్నపాటి విభేదములు ఉండే అవకాశములు ఉన్నాయి.ఈ వారం స్త్రీలకు కార్యాలయంలో ఒత్తిడి ఉండే అవకాశములు ఉన్నాయి.జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు.

కర్కాటకం: కర్కాటక రాశి వారికి ఈ వారం సర్వత్రా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబపరంగా ఎవరైతే మిమ్మల్ని అంత్యంత అభిమానిస్తారో వారి నుండే అవమానములు ఎదుర్కొనవచు. ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్ధిక లావాదేవీలు ఒత్తిడి పెరిగే అవకాశములు ఉన్నాయి. లోన్లు, రుణముల విషయంలో జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులకు ఆర్ధికంగా అభివృద్ధి ఉంటుంది. సన్మానాలలో పాల్గొంటారు, మిత్రుల నుండి సలహాలు, సంప్రదింపులు అనుకూలిస్తాయి. ఈ వారం స్త్రీలకు ఏ విషయమైనా జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఎంత పెద్ద పనైనా మీ ఆలోచన శక్తితో ముందుకు సాగుతారు. ప్రతి నిత్యం ఆదిత్య స్తోత్రం పఠించండి చెప్పదగిన సూచన.

సింహం: సింహరాశి వారికి అన్ని విధముల అనుకూలమైన ఫలితములుండె అవకాశములు ఉన్నాయి. ఏదైనా కొత్త పనులు ప్రారంభించుటకు, వ్యవహారములకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి ఈ వారం అనుకూలం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు అధికారులతో ప్రశంసలు, ఉద్యోగంలో ఆర్థికాభివృద్ధి ఏర్పడుతుంది.ఎప్పటి నుండో ప్రమోషన్లు, బదిలీలు ప్రయత్నించే వారికి అనుకూల ఫలితాలుండే అవకాశములున్నాయి. వ్యాపారస్తులకు లాభములతో పాటు మంచి పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఈ వారం స్త్రీలకు వ్యవహారాల పట్ల నిర్ణయాలు అలోచించి తీసుకోవాలి. కష్టపడినా దానికి ఫలితం తక్కువగా ఉంటుంది. ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

కన్య: కన్యారాశి వారికి ఈ వారం అంతంత మాత్రంగా ఉంటుందని గోచరిస్తున్నది. అన్ని పనులు అయిపోయినట్టు కనబడతాయి, కానీ ఆఖరు సమయానికి వాయిదాలు పడే అవకాశములు ఉన్నాయి. ఉద్యోగస్తులు పైఅధికారులతో మాట్లాడేటప్పుడు, విధులు నిర్వహించడం లో కొంత అప్రమత్తంగా ఉండడం మంచిది. వ్యాపారస్తులకు, సాఫ్ట్‌వేర్ రంగం బిజినెస్ వారికి కొంత ఆర్ధికపరమైన ఇబ్బందులు, ఖర్చులు అధికం అయ్యే అవకాశములు ఉన్నాయి. ఈ వారం స్త్రీలకు ఉద్యోగంలో పురోగతి బాగుంటుంది. ఏ పని చేసినా నిదానంగా ఆలోచించి చేయడం ద్వారా మంచి ఫలితాలుంటాయి.ఇంటాబయటా అన్నివిధాలుగా అనుకూలం. ప్రతి నిత్యం ఓం నమో వెంకటేశాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం.

తుల: తులారాశి వారికి ఈవారం కుటుంబపరంగా సుఖశాంతులు లభిస్తాయి. ఆర్ధిక పరంగా కూడా కుటుంబంలో వారి నుండి కానీ, స్నేహితుల నుండి కానీ సహాయ సహకారములు అందుతాయి. అయితే ఉద్యోగపరంగా కార్యాలయాలలో తోటి ఉద్యోగస్తుల నుండి కానీ, పైఅధికారుల నుండి కానీ కొంత ప్రతికూలమైన ఫలితములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు కొంత ఆస్తి నష్టం జరిగే అవకాశములు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. అయితే భాగస్వామ్య వ్యాపారస్తులకు ఆర్ధికంగా మెరుగు ఉంటుంది. ఈ వారం స్త్రీలకు అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు.సంతోషకరమైన వార్తలు వింటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారం బాగుంటుంది. గణపతికి జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం.

వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ వారం అత్యంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు.నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి మీరు అనుకున్నంత జీతం రాకపోవచ్చు, అయినా చేరడం మంచిది. వ్యాపారస్తులకు అనేక విధాలుగా ఖర్చులు కనిపిస్తున్నాయి. లాభాలు సామాన్యంగా ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాల వాళ్ళ కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. శత్రువర్గం నుండి విమర్శలు ఉండే అవకాశములు ఉన్నాయి. విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగండి. ఈ వారం స్త్రీలకు కుటుంబంలో భార్యాభర్తల మధ్య భేదాప్రాయం వచ్చే అవకాశాలు వున్నాయి. జాగ్రత్త వహించిండి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఒత్తిడి ఉండే అవకాశములు ఉన్నాయి. ఈ రాశి వారు శివాలయంలో అభిషేకం చేయడం చెప్పదగిన సూచన.

ధనస్సు: ఈ వారం ధనుస్సు రాశి వారికి సర్వత్రా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు పైఅధికారులతో సానుకూలత ఏర్పడుతుంది. ప్రమోషన్స్, బదిలీలు వంటి వాటికి చేసే ప్రయత్నములు అనుకూలిస్తాయి.ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. సాఫ్ట్‌వేర్ రంగం, టెక్నికల్ రంగం, రియల్ ఎస్టేట్ అలాగే అన్ని రంగముల వారికి అనుకూలమైన ఫలితములుంటాయి. వ్యాపారాభివృద్ధి కనబడుతుంది. వివాహ ప్రయత్నములు చేసే వారికి అనుకూలమైన ఫలితాలుంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి కూడా అనుకూలమైన అవకాశములు ఉంటాయి. ఈ వారం స్త్రీలకు బాగుంది అని చెప్పవచ్చు, ఉద్యోగ వ్యాపార విషయాలలో సానుకూలత ఉంటుంది. ధన లాభం, వస్తు లాభం వుంది. ఈ రాశివారు విష్ణు ఆలయంలో అర్చన చేయడం చెప్పదగిన సూచన.

మకరం: మకర రాశి వారికి ఈ వారం క్రమక్రమాభివృద్ధి జరుగుతున్నట్లుగా గోచరిస్తుంది. గతంలో పడిన కష్టమునకు ఫలితం లభిస్తుంది. మనోవాంఛ సిద్ధిస్తుంది. ఉద్యోగస్తులకు ఆర్థికాభివృద్ధి ఉంటుంది. తోటి ఉద్యోగస్తుల నుండి గౌరవాభిమానములు పొందుతారు. వ్యాపారస్తులకు అనుకున్న ఫలితములు ఉంటాయి. కార్యక్రమములు, వ్యవహారముల విషయాలు ఎట్టకేలకు ఒక కొలిక్కివస్తాయి. అయితే శత్రువర్గం నుండి కూడా మన్ననలు పొందుతారు. కుటుంబపరంగా సుఖసంతోషములు ఉంటాయి. వారం ద్వితీయార్థంలో అనుకున్న పనులు పూర్తవుతాయి. ఈ వారం స్త్రీలకు బాగుంది అని చెప్పవచ్చు, ఏపని చేసినా నిదానంగా ఆలోచించి చేయడం ద్వారా మంచి ఫలితాలుంటాయి.8 శనివారలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన.

కుంభం: కుంభరాశి వారికి ఈ వారం జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. ప్రతికూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో పెద్దవారితో మాట పట్టింపులు, తగాదాలు వంటివి అంత మంచిది కాదు. ఉద్యోగస్తులకు కార్యాలయాలలో చిన్నపాటి అవమానములు ఎదుర్కోవలసి రావచ్చు జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పదగ్గ సూచన. ఆరోగ్య విషయంలో మీ ఆరోగ్యంతో పాటు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. ఎదో తెలియని ఆందోళనలు, మనోవిచారం ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు వ్యాపారంలో ఆటు-పోట్లు తప్పవు, డబ్బు ఎంత సంపాదించినా మనశ్శాంతి ఉండదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వృథా ఖర్చులు కనిపిస్తున్నాయి జాగ్రత్త వహించండి. ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన.

మీనం: మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడిలు ఉండే అవకాశములు ఉన్నాయి. ఆదాయం పెరగడం తో ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒక విధంగా మీ ఆలోచనలకు, బుద్ధిబలానికి మంచి పరీక్షా సమయం అని చెప్పవచ్చు.శ్రమ అధికంగా ఉంటుంది, ఆర్ధికపరంగా అనుకున్న సమయానికి డబ్బు చేతికి రావడం వలన అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ఈవారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారస్తులకు చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. 8 శని వారలు శని కి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News