Sunday, December 22, 2024

సంక్రాంతి వేళ.. మీ వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

- Advertisement -
- Advertisement -

మేషం:   మేషరాశి వారికి ఈవారం కొంత మానసికంగా, శారీరకంగా శ్రమ ఉన్నప్పటికీ వారం చివరిలో అభివృద్ధి అనుకూలమైన ఫలితాలుంటాయి. ఉద్యోగ పరంగా గతంలో మిమ్మల్ని  ఇబ్బంది పెట్టిన సమస్యలు కొంత సానుకూలపడతాయి.  కుటుంబ పరంగా సంతోషం లభిస్తుంది.  సమయం సరదాగా గడుపుతారు. వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా ఉంటుంది. కొంత శారీరక అలసట ఉంటుంది.  ఈ రాసి వారు శివాలయంలో రుద్రాభిషేకం చేయంచండి, ప్రతి రోజు నాగ సిందూరం ధరించడం మంచిది.

వృషభం:  వృషభ రాశి  వారికి ఈవారం  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అధికారులతో కానీ, సహా ఉద్యోగస్థులతో కానీ చిన్న పాటి తగాదాలు వచ్చే అవకాశములు ఉంటాయి, వాటిని మీ తెలివితేటలతో అధిగమించాల్సి వస్తుంది. వ్యాపారస్తులకు అధిక పెట్టుబడులు, ఖర్చులు ఎదురవుతాయి, ధైర్యాన్ని కోల్పోకండి. కుటుంబ పరంగా కూడా పెద్దవారితో కానీ, స్త్రీలతో కానీ స్వల్ప చికాకులు ఏర్పడవచ్చు. ఈ రాసి వారు దుర్గ దేవి ఆలయం సందర్శించడం మంచిది, అన్నదానం చేయడం అలాగే నాగ సిందూరం ధరించడం చెప్పదగిన సూచన.

మిథునం:    మిథునరాశి వారికీ ఈవారం అంత అనుకూలమైన ఫలితములు ఉండకపోవచ్చు, కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు అధికారుల వలన భయం.  తగాదాలకు, కోపములకు మంచి సమయం కాదు. కుటుంబ పరంగా  జీవిత భాగస్వామితో  ఆర్ధిక పరమైన మాట పట్టింపులు ఉండే అవకాశములు ఉన్నాయి.  మానసిక ప్రశాంతతను కోల్పోతారు.ఈ రాసి వారు సుబ్రమణ్య స్వామిని దర్శించుకోవడం మంచిది. నిత్యం నాగ సిందూరం ధరించడం చెప్పదగిన సూచన.

కర్కాటకం :  కర్కాటకరాశి వారికి ఈవారం చాలా వరకు అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. మీరు అనుకున్న విజయములు పొందగలుగుతారు.  ఉద్యోగ విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశాలున్నాయి.  కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ఆలోచించి ముందుకు సాగండి.వ్యాపారస్తులకు మంచి ఆర్థికాభివృద్ధి ఉంటుంది.  శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. వివాహ ప్రయత్నములు చేసే వారు, చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడినప్పటికీ ప్రయత్నములు ఆపడం మంచిది కాదు. ఈ రాసి వారు సుబ్రమణ్య స్వామిని దర్శించుకోవడం మంచిది. నిత్యం నాగసిందూరం ధరించడం చెప్పదగిన సూచన.

సింహం:  సింహరాశి వారికి ఈవారం  ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు వంటివాటికి మంచి అనుకూలమైన సమయం.  ఆర్ధికంగా అభివృద్ధి కనబడుతుంది. కొత్త ప్రాజెక్టులు వస్తాయి. వ్యాపారస్తులకు కొంత వ్యాపార  నష్టం ఏర్పడే అవకాశములు ఉన్నాయి.  కుటుంబంతో చిన్న పాటి విభేధములు వచ్చే వకాశములు ఉన్నాయి. వివాహ పరంగా ప్రయత్నములు చేసే వారికి కొంత మంచి ఫలితాలు అని చెప్పవచ్చు, ప్రాథమిక విద్యా  విద్యార్థులకు మంచి ఫలితాలు, విజయములుంటాయి.   ఈ రాసి వారు గణపతి  ఆలయం సందర్శించడం మంచిది, గరికతో పూజ చేయడం మంచిది,  నాగ సిందూరం ధరించడం చెప్పదగిన సూచన.

కన్య:  కన్యారాశి వారికి ఈవారం మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నాయి.   కుటుంబ పరముగా ఆనందకరమైన వాతావరణం ఉంటుంది.  వ్యాపారస్తులకు కూడా బయట నలుగురిలో మాట చెలామణీ అవ్వడం వంటివి ఉంటాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికాభివృద్ది బాగుంటుంది.  తగాదాలకు, వివాదాలకు దూరంగా ఉండడం చెప్పదగ్గ సూచన.  ఉద్యోగస్తులకు సామాన్యంగా ఫలితములుంటాయి.  విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితములుంటాయి. వివాహ ప్రయత్నములు చేసే వారికి మంచి ఫలితాలుండే అవకాశములు ఉన్నాయి.ఈ రాసి వారు శివాలయంలో రుద్రాభిషేకం చేయంచండి, ప్రతి రోజు నాగ సిందూరం ధరించడం మంచిది.

తుల: తులారాశి వారికి ఈవారం ఆర్థికపరమైన అభివృద్ధి సంతోషాన్ని కలుగ చేస్తుంది. కుటుంబ పరంగా సుఖ, సౌఖ్యములు కలుగుతాయి. సంతాన పరంగా  అనుకూలమైన వార్తలు వింటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి.  ఉద్యోగస్తులకు అధికారులతో  , శత్రువర్గంతో కొంత భయపడే  సమయం అని చెప్పవచ్చు. సంతానం కోసం ఎదురు చూసే వారికి శుభవార్తలు వార్తలు వినే అవకాశములు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలు ఉంటాయి.  ఈ రాసి వారు శివాలయం  దర్శించడం మంచిది,  నిత్యం కాలభైరవ అష్టకం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

వృశ్చికం: వృశ్చికరాశి వారికి ఈవారం అన్ని విధముల లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఉద్యోగ పరంగా గతంలో ఇబ్బందులు పడిన వారికి  ఈవారం బాగుంటుంది . నూతన వస్తువులు కొనుగోళ్లు చేస్తారు. వ్యాపారస్తులకు  ఆర్ధిక స్థిరత్వం బాగుంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహిస్తారు.  కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
విద్యార్థులకు కూడా మంచి ఫలితములుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది.
ఈ రాసి వారు 8 శని వారలు శనికి తైలాభిషేకం చేయించండి, కాలభైరవ రూపు మేడలో ధరించండి మంచి ఫలితాలుంటాయి.

ధనస్సు: ధనుస్సురాశి వారికి ఈవారం కొంత జాగ్రత్త వహించ వలసిన సమయం గా చెప్పవచ్చు. ఆర్ధిక సమస్యలు,  ఖర్చులు మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితములు ఉంటాయి.  కొంత మౌనంగా  ఉండడం,  ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచుకోవడం మంచిది.  నూతన ప్రణాళికలకు ఇది అంత అనుకూలమైన సమయం కాదు.  మంచికైనా, చెడుకైనా బలమైన నిర్ణయములు తొందరపడి తీసుకోవద్డు. ఈ రాసి వారు శివాలయంలో రుద్రాభిషేకం చేయంచండి, ప్రతి రోజు నాగ సిందూరం ధరించడం అలాగే ఇంట్లో, కార్యాలయంలో ధూపం వేయండి నరదిష్ఠి ఎక్కువగా వుంది.

మకరం: మకరరాశి వారికి ఈవారం ప్రతికూలమైన ఫలితాలుండే అవకాశములు ఉన్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు సానుకూల ఫలితములు యధాతధంగా  గోచరిస్తున్నాయి.  కష్టానికి తగ్గ ఫలితం తక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు సానుకూల పరుస్తాయి.  బంధువులతో కలయిక ఉంటుంది.   ఆరోగ్య పరంగా స్వల్ప ఇబ్బందులు, ఒళ్లునొప్పులు, మోకాళ్ళ నొప్పులు, జ్వరం వంటివి ఉండవచ్చు. జాగ్రత్త వహించండి.ఈ రాసి వారు నవగ్రహాలకు  ఆభిచేకం  చేయంచండి, ప్రతి రోజు నాగ సిందూరం ధరించడం అలాగే ఇంట్లో, కార్యాలయంలో ధూపం వేయడం చెప్పదగిన సూచన.

కుంభం: కుంభరాశి వారికి ఈవారం కొంత అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి.   ఉద్యోగస్తులకు ఆర్థికాభివృద్ధి బాగుంటుంది.  కుటుంబంతో  సంతోషముగా గడుపుతారు. సంతాన పరంగా అభివృద్ధి గౌరవం లభిస్తాయి.
వ్యాపారస్తులకు  కొంత లాభసాటిగా ఉంటుంది. గతంలో ఆర్ధిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి.  ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులేర్పడవచు.  నిదానంగా వచ్చినా స్థిరమైన అభివృద్ధి ఆలోచనలు చేయండి. అదృష్టం కంటే కష్టానికి  ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. భవిషత్తు బాగుంటుంది.ఈ రాసి వారు 8  శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన, ప్రతి రోజు నాగ సిందూరం ధరించడం మంచిది.

మీనం: మీనరాశి వారికి ఈవారం అన్ని విధముల అనుకూలమైన ఫలితములుంటాయి. ఉద్యోగస్తులకు మంచి  ఆర్ధికంగా అభివృద్ధి కనబడుతుంది. ఆత్మ స్థైర్యం పెరుగుతుంది. కష్టంతో చేసిన పనులు లాభిస్తాయి. శుభకార్యములలో పాల్గొంటారు. వివాహ ప్రయత్నములు చేసే వారికి అనుకూలమైన ఫలితములుంటాయి.  ప్రస్తుతము ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ గురు గ్రహ అనుకూలత వలన కొన్ని సానుకూల ఫలితములు గోచరిస్తున్నాయి. ఈ రాసి వారు 8  శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మంచిది,  ప్రతి రోజు నాగ సిందూరం ధరించండి మంచి ఫలితాలుంటాయి.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News