Sunday, January 19, 2025

వార ఫలాలు 12-11-2023 నుండి 18-11-2023 వరకు

- Advertisement -
- Advertisement -

మేషం: ఈ వారం మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నాయి. ఎదో ఒక రకంగా ఉద్యోగం నందు, పని చేసే చోట ఆర్ధిక లాభములు ఉంటాయి. వ్యాపారస్తులకు అనుకున్న ఫలితాలుంటాయి. కొత్త పనులు, ప్రాజెక్టులు వంటి వాటి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి. నిదానంగా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా ఒక విషయం గురించి అతిగా ఆలోచించడం కానీ, పట్టుదలకుపోవడం కానీ మంచిది కాదు. ఈ రాశి వారు శివాలయంలో అభిషేకం చేయడం చెప్పదగిన సూచన.

వృషభం: వృషభ రాశి వారికి ఉద్యోగస్తులకు సానుకూలత ఏర్పడుతుంది. పని చేసే చోట, కార్యాలయాలలో అందరితో కలయిక, స్నేహ వర్గంతో సాన్నిహిత్యం లభిస్తాయి. మీరు తలపెట్టిన నూతన పని ఏదైనా సత్ఫలితాలనిస్తాయి. వ్యాపారస్తులకు వ్యవహారములు మంచి ఫలితాలు ఉండే అవకాశములు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి మంచి ఫలితములుంటాయి. వివాహ ప్రయత్నములు చేసే వారికి మంచి సమయం అని చెప్పవచ్చు. కాలభైరవ రూపు ధరించడం మంచిది.

మిథునం: ఉద్యోగస్తులకు కార్యాలయములలో, పని చేసే చోట శత్రు వర్గం ఏదైనా ఉన్నట్లైతే కొంత జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులకు ప్రజాభిమానము, ప్రజాదరణ లభిస్తుంది. మంచి పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. సంతానం, ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించండి.ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి, సాఫ్ట్‌వేర్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. కాలభైరవ రూపు ధరించడం శ్రేయస్కరం.

కర్కాటకం: ఉద్యోగస్తులకు అధికారుల నుండి పని ఒత్తిడి, చిన్నపాటి ఇబ్బందులు ఉండవచ్చు. నూతన వస్తువులు కొనుగోళ్లు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. వ్యాపారస్తులకు కొంత అనవసరమైన శ్రమఉండే అవకాశములు ఉన్నాయి. పలుకుబడి పెరుగుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నములు చేయడం మంచిది. అనుకూలమైన ఫలితములుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించం డి. ఆహార నియమాల విషయంలో జాగ్రత్త వహించాలి.

సింహం: ఈ వారం అన్ని విధముల అనుకూలమైన ఫలితములుంటాయని చెప్పవచ్చు. విద్యార్థిని, విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. వివాహ ప్రయత్నములకు కూడా మంచి సమయం అని చెప్పవచ్చు.

కన్య: ఈ వారం విద్యార్థిని, విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు కార్యాలయములలో, పని చేసే చోట కొంత వంచనకు గురి అయ్యే అవకాశములు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొంత ఉన్నప్పటికీ మాట విషయంలో నిదానంగా ఉండడం మంచిది. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశములు ఉన్నాయి. సుబ్రమణ్య పాశుపత కంకణం ధరించడం మంచిది.

తుల: ఈ వారం కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. వ్యాపారంలో ప్రతికూలమైన ఫలితాలు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. ఆర్ధికంగా కొంత నష్టములు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు పైఅధికారులతో ఇబ్బందులు, అనుకున్న పనులు నెరవేరకపోవుట జరుగవచ్చు. అతి కష్టం మీద పనులు నెరవేరుతాయి.

వృశ్చికం: ఈ వారం ఎన్ని అడ్డంకులు, చిక్కులు ఎదురైనప్పటికీ కుటుంబం అండదండలు వున్నాయన్న తృప్తి లభిస్తుంది. ఉద్యోగస్తులకు పని చేసే చోట శత్రువర్గం నుండి వ్యతిరేక ఆరోపణలు వంటివి ఎదురయ్యే అవకాశములు ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభములు వున్నప్పటికీ అనేక విధములుగా ఖర్చు అయ్యే అవకాశములు ఉన్నాయి. విద్యార్థిని, విద్యార్థులకు కొంత జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా చదుకోవలసిన సమయం అని చెప్పవచ్చు. మేధాదక్షిణా మూర్తి రూపు ధరించడం శ్రేయస్కరం.

ధనస్సు: ఈ వారం ఉద్యోగస్తులకు అన్ని విధముల సాఫీగా ముందుకు సాగే అవకాశములు వున్నాయి. ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్నట్లైతే అవి కూడా తొలగిపోతాయి. వ్యాపారస్తులకు సానుకూలత ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి, టెక్నికల్ రంగం వారికి అభివృద్ధి బాగుంటుంది. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన.

మకరం: వ్యాపారస్తులకు మంచి ఆర్ధిక లాభములు గోచరిస్తున్నాయి. ఆర్ధిక లాభములతో పాటు, పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. అనుకున్నది సాధించాం అనే ఆనందం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి ఉంటుంది. సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. విలాస వస్తువులు, అలంకరణకు సంబంధించిన జ్యుయలరీ వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు.

కుంభం: కుంభరాశి వారికి ఉద్యోగపరంగా కూడా అభివృద్ధి తక్కువగా వున్నప్పటికీ చిన్న చిన్న సమస్యలున్నట్లైతే పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తులకు అనుకున్న పనులు నెరవేరుతాయి.అయితే ఏదైనా ప్రాజెక్ట్, కాంట్రాక్టు విషయాలలో ప్రయాణములు చేయవలసి వచ్చినట్లైతే కొంత ఆలోచించి ప్రయాణములు చేయడం మంచిది. వ్యవహారములు కొంత మానసిక ఒత్తిడి తరువాత నెరవేరుతాయి. కాలభైరవ రూపు ధరించడం శ్రేయస్కరం.

మీనం: మీనరాశి వారికి అత్యంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు పైఅధికారుల తో పని ఒత్తిడిలు, విరోధములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు అనాలోచిత పెట్టుబడులు పెడితే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశములు ఉన్నాయి. పేరు ప్రతిష్ఠలకు కూడా భంగం వాటిల్లే అవకాశములు ఉన్నాయి. ఎన్ని సమస్యలు వున్నప్పటికీ అనుకున్న సమయానికి ఎదో ఒక విధంగా డబ్బు చేతికి అందడం వలన అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. సుబ్రమణ్య పాశుపత కంకణం ధరించండి..

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News