Monday, December 23, 2024

వార ఫలాలు (19-11-2023 నుంచి 25-11-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: మేషరాశి వారికీ ఈవారం మధ్యస్తంగా వుంది అని చెప్పవచ్చు. ఉద్యోగంలో వున్నవారికీ కొంత ఇబ్బందులకు గురి కావచ్చు. ఏదైనా ఇంక్రిమెంట్ రావాల్సి ఉంటే మరింత ఆలస్యం అయ్యే అవకాశం వుంది. మంచి మాట్లాడితే చెడుగా అర్థం చేసుకుంటారు, జాగర్త వహించండి. జాబ్ కోసం విదేశాలలో ప్రయత్నాలు అలాగే వీసా కోసం ప్రయత్నాలు కాంత ఇబ్బంది పెడతాయి. అప్లై చేసేటప్పుడు ఒక సరి డాకుమెంట్స్ చూసుకుని అప్లై చేయడం చెప్పదాగిన సూచన. రుణాలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపాస్తులకు ఈవారం బాగుంది అని చెప్పవచ్చు. చిన్న చిన్న వాటికీ టెన్సన్స్ పడకుండా నిదానంగా పనులు చేయడం ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు. భూములు కొనుగోళ్లు చేసేటప్పుడు పత్రాలు చూసుకోవాలి లేకపోతె నష్టం వాటిల్లే అవకాశం వుంది. వివాహ సంబంధ విషయాలు అనుకూలంగా వుంది. వివాహ ప్రయత్నాలు మంచి సమయం అని చెప్పవచ్చు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఈ రాసి వారు సుబ్రమణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన.

వృషభం: వృషభ రాశి వారికీ ఈవారం బాగుంది అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు సంతోషకరమైన వార్తలు వింటారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం వుంది, ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగస్తులకు కూడా బాగుంది అని చెప్పవచ్చు. నూతన ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి కొంత అలసయం అవుతుంది. విదేశాలలో వున్నవారికి ఈవారం ఉద్యోగం వచ్చే అవకాశాలున్నాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. పిల్లల చుదువుల కోసం, వివాహం కోసం ఖర్చు చేస్తారు. వ్యాపాస్తులకు ఈవారం బాగుంది అని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, సినీ రంగం, కన్స్ట్రక్షన్ ఫీల్ లలో వున్నవారికి అలాగే బంగారం వ్యాపారస్తులకు బాగుంది అని చెప్పవచ్చు. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. గతంలో రావాల్సిన బాకీలు వసూళ్లు అవుతాయి. అయితే ఖర్చు విషయంలో జాగర్త వహించండి. వివాహం కానివారికి వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. కొన్ని సంబంధాలు వాచినట్టు వచ్చి పోతుంటాయి. సుబ్రమణ్య పాశుపత రూపు ధరించండి. మంచి ఫలితాలుంటాయి..

మిథునం: ఉద్యోగంలో అధిక శ్రమ అబద్ధాలు చెప్పి పని తప్పించుకునే వారి వలన ఇబ్బందులు సంభవిస్తాయి. విశ్రాంతికి సమయం ఉండదు. ఉద్యోగం మార్పు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికీ కొంత ఆలస్యమైనా ఉద్యోగం లంభిస్తుంది. మీ నైపుణ్యాన్ని అందించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి శారీరకంగా మానసికంగా శ్రమిస్తారు. సాంకేతిక కారణాల వల్ల ముఖ్యమైన విషయాలు వాయిదా వేస్తారు ఇది మీ మంచికే జరిగిందని పరోక్షంగా తెలుసుకోగలుగుతారు. బ్యాంకు రుణాలు సాధించుకుంటారు. ప్రవేటు వ్యక్తుల నుండి ఆర్థికపరమైన ఒత్తిడి రావచ్చు మీకు రావలసిన ధనం. బిల్లులు. పెట్టుబడులు సమయానికి అందుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది మీరు అమితంగా ప్రేమించే వ్యక్తులు మీకు దూరం అవుతారు. వ్యాపాస్తులకు ఈవారం అమ్మకాలలో తగిన రేటు రాకపోవచ్చు అయినా లాభాలకు ఇబ్బంది లేదు అనుకొని ఆదాయం వచ్చే మార్గాలు అందుకు సంబంధించిన వ్యక్తులు అనుకూలమవుతారు. వివాహ సంబంధమైన విషయాలు ఓ కొలిక్కి వస్తాయి. ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న సంబంధం కుదిరింది అని సంతోషం కనబరుస్తాంరు. శుభకార్యాలలో పాల్గొంటారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఓం నమశివాయ వత్తులతో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలుంటాయి.

కర్కాటకం : కర్ణాటక రాసి వారికీ ఈవారం అనుకూలంగా వుంది. ఆర్ధిక పరమైన అంశాలు, స్థిరస్తులకు సంబంధమైన విషయం వ్యవహారాలు అనుకూలిస్తాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇంత కాలం మీపై వున్నా నిందా ఆరోపణలను రూపు మాపుకోగలుగుతారు. ఆదాయానికి నూతన మార్గం లభిస్తుంది. వ్యాపారంగా లాభాలు రొటేషన్ పరంగా ఉంటాయి. మీకున్న సామర్థ్యంతో ముందుకు సాగుతారు, పార్టీనేర్షిప్ వ్యాపారాలలో కొంత నష్టం వాటిల్లుతుంది. ఆభరణాలు డాకుమెంట్స్ విషయంలో జాగర్త వహించాల్సి ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభ చేస్తారు. జీవిత భాగస్వామి తో స్వల్పమైన విబేధాలు చోటుచేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్విగ్నముగా చేయగలుగుతారు. సంతానానికి సంబందించిన అవసరాల పైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. శుభకార్యాలలో పాల్గొంటారు. సంతాన పురోగతి బాగుంటుంది. మానసికమైన ధైర్యం, మానసికమైన సంతోషం లభిస్తుంది. ఈ రాశీ వారు హనుమాన్ చాలీసా పఠించడం, అంజనేయ స్వామి వారికీ ఆకు పూజ చేయడం చెప్పదగిన సూచన. అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన..

సింహం; సింహరాసి వారికీ ఈ వారం అనుకూలంగానే వుంది. ఉద్యోగస్తులు వర్క్ డిస్ట్రిబ్యూషన్ సక్రమంగా చేసుకోగలుగుతారు. ఎవరిని ఎక్కడ వుంచాలో అక్కడ ఉంచుతారు. ఎవరయితే సక్రమంగా భాద్యతలు నిర్వర్తిస్తారో వారికే భాద్యతలు అప్పగిస్తారు. వీళ్లు మనవాళ్లే కదా అని మనవాళ్ళు రికమండ్ చేసారని ఎవరుపడితే వారికీ భాద్యతలు అప్పగించారు. ఉద్యోగ పరంగా తార తమ్యాలు లేకుండా నిర్వర్తిస్తారు. మీ వర్క్ ప్రెషర్ కుటుంబం పైన పడకుండా జాగర్తలు తీసుకోవాలి. బయటవాళ్ళకిచ్చే విలువ ఇంట్లోవాళ్లకి కూడా ఇవ్వండి. దానివళ్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు ఈవారం అనుకూలంగా ఉంటుంది. అయితే కష్టపడినా దానికి ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. అది మీ మనోవేదనకు కారణమవుతుంది. భాగస్వామి వ్యాపారస్తుల మధ్య విబేధాలు వచ్చే అవకాశం వుంది. ఈ రాశీవారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అలాగే కాలభైరవ రూపు ధరించడం శ్రేయస్కరం. వివాహ సంబంధమైన ప్రయత్నాలు ఓ కాలికి వస్తాయి. విదేశాలకు వీసా కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య: కన్య రాసి వారికీ ఈ వారం స్థిరాస్తి వృద్ధి చేసుకోవాలి అనుకుంటారు, దాని తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. వివాహాది శుభకార్యాలు మధ్యవర్తి ద్వారా కుదురుతాయి. మానసిక సంతోషం ఉత్సాహం కలుగుతుంది. అన్ని విషయాల్లో జాగర్త వహించండి. గతంలో ఆగిపోయిన పనులను ఈ వారంలో ప్రారంభిస్తారు. వృత్తి వ్యాపారం బాగుంటుంది. బరువు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయ పరమైన విషయాలు సానుకూలంగా వున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి తో విభేదాలకు దూరంగా వుండండి. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవానుగ్రహం వుంది. అయితే ప్రతి చిన్న విషయానికి కోపం ప్రదర్శించడం అంత మంచిది కాదు. మీ స్వశక్తి తో పైకి రావడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశీవారు శివాలయంలో అభిషేకం చేయడం అలాగే ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన అలాగే కాలభైరవ రూపు ధరించడం శ్రేయస్కరం..

తుల: ఈ వారం తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు వున్నాయి. కష్టపడిన దానికి ఫలితం తక్కువగా ఉంటుంది. అయితే మీ అతి తెలివి తేటల వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు జాగర్త వహించండి. దీక్ష కార్యక్రమాలతో పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపార పరంగా అధిక శ్రమ సూచిస్తోంది. ఎన్ని సమస్యలు ఎదురైనా వాటికి నిలబడి శుభకార్యాలు చేస్తారు. ఆర్ధిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. మీ వ్యక్తిగత హోదా పెరుగుతుంది. అనవసరమైన విషయాలలో తల దూర్చరు. క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చి లాభ పడతారు. కాలంతో పాటు మనం అని కాలం తోపరిగెడతారు. ఆరోగ్య పరంగా జాగర్తలు తీసుకోవాలి, ఆరోగ్యం పట్ల మొండిగా వ్యవహరించవద్దు. విద్య సంబంధమైన విషయాలు, విదేశీ సంబంధమైన విషయాలు, వివాహ సంబంధమైన విషయాలు సానుకూలంగా వున్నాయి. ఈ రాశీవారు శివాలయంలో అభిషేకం చేయడం చెప్పదగిన సూచన.

వృశ్చికం: వృశ్చికరాశి వారికి ఈవారం అన్ని విధాలుగా బాగుంది అని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు అలాగే శుభకార్యాలు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది. PR, h1b వీసా ప్రయత్నాలు అనుకొలుస్తాయి. అయితే ఫలితాలు నిదానంగా వస్తాయి. ఖర్చుల విషయంలో జాగర్త వహించాలి, అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఆచి తూచి మాట్లాడండి. వ్యాపార పరంగా నూతన అవకాశాలు వస్తాయి, కొత్త ఆర్డర్ వస్తాయి, రియల్ ఎస్టేట్ లాభిస్తుంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. గృహోపకర వస్తువులు, కూరగాయలు, మిల్క్ ప్రొడకట్స్ అధిక ధర కలిగి ఉంటుంది. ఈ వ్యాపారంలో వున్న వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి. ఎగుమతి దితుమతి వ్యాపారాలు లాభిస్తాయి, ఆర్ధిక భారం తేలిక పడుతుంది. ఉన్నతి స్థాయి అధికారులవల్ల ఇబ్బందులు ఎదురవుతయి, మీ ముందు మీరు మంచి వారు అంటూ వెనకనుండి వెన్ను పోటు పొడిచేవాళ్లున్నారు, జాగర్త వహించాలి. మీ ఎదుగుదలను మీ ఆత్మీయ వర్గం వాళ్ళు కూడా సహించలేరు. కానీ ఏది ఏమైనా దైవానుగ్రహం మీ యందు వుంది, ఈ రాసి వారు ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో నమో వెంకటేశాయ వత్తులతో దీపారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు.

ధనస్సు: ధనస్సురాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా వుంది, చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తీ చేస్తారు. ఆర్ధిక పరమైన వ్యవహారాలు బాగున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. అమ్మకాలు కొనుగోళ్ల విషయాలు సానుకూలపడతాయి. మంచి లాభాలు వస్తాయి. సన్నిహితులు, బంధువులు ఎక్కువగా మీ సహాయం కోరతారు, వాళ్ళకుకూడా మీ చేతనైన సహాయం చేస్తారు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవారికి అనూకూలంగా వుంది, కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లెమ్ వల్ల లేట్ అవవచ్చు. దాని దాటుకుని గ్రీన్ కార్డు సాధించగలుగుతారు. ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడం మానసిక వత్తిడి, శారీరక వత్తిడి, చేసిన పనికి ప్రతిఫలం లేకపోవడం, మీకు కాకుండా పక్కవాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడం, ఇంక్రిమెంట్ ఇవ్వడం ఇలాంటివి చూసి జాబ్ మారాలని అనుకుంటారు. మీకు మంచి అవకాశం కలసివస్తుంది. ఏది ఏమైనా ఓర్పుతోటి సహనం తోటి ఉండడం వలన మనకు ఏమి లభించింది అని మనోవేదనకు గురి అవుతారు, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అనుకుంటారు. ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా మీకు దైవానుగ్రహం సంపూర్నంగా వుంది. సానుకలమైన ఫలితాలు సాధించగలుగుతారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. ఈ రాసి వారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

మకరం: మకరరాశి వారికి ఈవారం ఆర్థికంగా అనుకూలంగా వుంది, అన్ని విధాలుగా మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఏమి ఆందోళన పడవలసిన ఆవాసం లేదు. మీ చేతికి రావలసిన దానం చేతికి వస్తుంది. అప్పులు తీర్చగలుగుతారు. అనుకున్న వ్యక్తులు, నమ్మకున్న వ్యక్తులు నమ్మకంగా పని చేస్తారు. ఉద్యగోరంలో సానుకూలంగా వ్యవహరిస్తారు. మొదలు పెట్టిన పని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మధ్యలో ఆటంకాలు వున్నాయి అయినా పనిని పూర్తి చేసి మీ యొక్క సామర్థ్యం నిరూపించుకుంటారు. వ్యాపారస్తులకు జాగర్త వహించాలిసిన సమయం. అకౌంట్స్ అన్ని క్షున్నంగా పరిశీలించి ముందుకు వెళ్లడం వలన మేలు జుగుతుంది. ఎందుకంటే కొన్ని అవకతవకలు సూచిస్తున్నాయి. భాగస్వామి వ్యాపారంలో కొంత నష్టం వాటిల్లే అవకాశం వుంది. అయితే మీ తెలివి తేటల వల్ల వాటిని అధిగమించగలుగుతారు. వివాహ శుభకార్యాలకు సంబందించిన విషయాలు ఓ కొలిక్కి వస్తాయి. ఏమి ఆందోళన పడవలసిన అవసరం లేదు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఏలినాటి శని నడుస్తున్నది వలన , 8 శని వారలు శని కి తైలాభిషేకం చేయడం అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.

కుంభం: కుంభ రాసి వారికీ ఆర్థికంగా అనుకూలంగా వుంది, మెల్లిమెల్లిగా వ్యాపారంలో పుంజుకుంటారు, పాత అప్పులు తీర్చేస్తారు, ఎక్కువగా కష్టపడతారు కానీ దానికి తగిన ఫలితం మీరు అనుకున్న స్థాయిలో ఉండదు. విదేశాలలో చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి మీరు తీసుకునే నిర్ణయం అనుకూలిస్తుంది. వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి, అలాగే ద్వితీయ వివాహం వాళ్ళకి కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసికమైన ఉత్సాహం కలిగివుంటారు. ప్రతి విషయంలో మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు అంతగా లాభించదు, అవతలి వారి మాట వినకుండా ప్రవర్తిస్తారు, డబ్బు వృధాగా ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. పిల్లలు మన మాట వినడం లేదు అనే బాధ మీ అనారోగ్యానికి కారణం అవుతుంది. ఆరోగ్యం పట్ల జాగర్త వహించండి. కొన్ని ఇబ్బందుల వల్ల నిర్మాణంలో వున్నటువంటివి బిల్డింగులు తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, బ్యాంకింగ్ రంగం వాళ్ళకి, కూరగాయల వాయపారస్తులకు అలాగే చిరు ధాన్య వ్యాపారస్తులకు మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. ఏలినాటి శని నడుస్తున్నది వలన , 8 శని వారలు శని కి తైలాభిషేకం చేయడం అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. కుదరని పక్షంలో కాలభైరవ అష్టకం పఠించండి మంచి ఫలితాలుంటాయి.

మీనం: మీనరాశి వారికీ ఆర్థికంగా అన్నివిధాలుగా బాగుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు, దైవానుగ్రహం వల్ల అన్ని విషయాలు బాగున్నాయి అని భావిస్తారు. ప్రతి విషయాన్నీ మీకు మీరుగా చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో వున్నవారికి కొంత ఇబ్బంది వాతావరణం అని చెప్పవచ్చు, జీవిత భాగస్వామి విబేధాలు వచ్చే అవకాశం లేకపోలేదు జాగరత్త వహించాలి, మనస్సు స్థిమితంగా ఉండదు, ఏ పని చేసిన నిదానంగా ఆలోచించి చేయాలి. జన్మ రాసిలో రాహు సంచారం వలన మీ ఆలోచన విధానంలో మార్పు ఉంటుంది. అభివృద్ధి బాగుంటుంది. సాఫ్ట్ వేర్ రంగంలో వున్నవారికి నిదానంగా ఉంటుంది. ప్రతి పని మీ సహనం ఓర్పుతో వ్యవహరిచండి, మంచి ఫలితాలుంటాయి. చేసిన పనికి ప్రతిఫలం తక్కువ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యంగా వస్తాయి. వ్యాపారస్తులకు ఈ వరం బాగుందని చెప్పవచ్చు , ఐరన్ వ్యాపారస్తులకు, పూజ సామాగ్రి విక్రేతలకు, వస్త్ర వ్యాపారస్తులకు, మట్టి వ్యాపారస్తులకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగివుంటారు. సంతాన విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో ఈ విషయాన్నీ వివాదస్పదం చేయకుండా వాళ్ళని ఒక దారిలో పెట్టాలని నిర్ణయించుకుంటారు. ఈ రాశీ వారు హనుమాన్ చాలీసా పఠించడం, అంజనేయ స్వామి వారికీ ఆకు పూజ చేయడం చెప్పదగిన సూచన.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News