Monday, December 23, 2024

వార ఫలాలు (04-02-2024 నుంచి 10-02-2024)

- Advertisement -
- Advertisement -

మేషం:  మేషరాశి వారికి  అన్ని విధాల మంచి అనుకూలమైన  ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ పరంగా గతంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి, మంచి వాతావరణం నెలకొంటుంది. స్నేహితులతో మంచి అనుబంధం కలుగుతుంది. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా వుంది.  సాఫ్ట్ వేర్ రంగంలో,  ప్రభుత్వ రంగాలలో అవకాశాలు కోసం ఎదురు చూసే వారికి మంచి ఫలితాలు ఉంటాయి.  వైద్య రంగంలో, సినీ రంగంలో వున్న వారికీ మంచి సమయం అని చెప్పవచ్చు.
చిన్న విషయాన్నీ కూడా నిర్లక్ష్యం చేయవద్దు. విద్య కొరకు విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు.  . శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ రాసి వారు రుద్రాభిషేకం చేయించండి మంచి ఫలితాలుంటాయి.

వృషభం: వృషభరాశి వారికి ఈవారం కొంత జాగ్రత్త పడాల్సిన సమయంగా చెప్పవచ్చు. ప్రయాణాల విషయంలో కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది ఈవారం.  విదేశీయాన ప్రయాణాలు ఫలిస్తాయి, మీకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు అలాగే కష్టపడతారు.  వ్యాపార లావాదేవీలు మిశ్రమ ఫలితాలతో నెట్టుకొస్తారు.  రాజకీయ నాయకులకు శ్రమకు తగిన పదవులు అందకపోవచ్చు. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ద వహించండి. విద్యార్థిని విద్యార్థులు కృషితో, పట్టుదలతో ముందుకు సాగడం మంచిది.

 

మిథునం: మిథునరాశి వారికి ఈవారం   మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.  మీ తెలివి తేటలతో, విచక్షణతో సమస్యలను అధిగమిస్తారు. ఏ విషయంలో అయిన ఒకటికి రెండు సారులు చెక్ చేసుకొని పరిస్తితికి తగిన విధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో కానీ, సంతానంతో కానీ చిక్కులు వస్తాయి, కొన్ని తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బంది రావచ్చు. ఉద్యోగస్తులు కాస్త ఓర్పు, సహనం వహించడం మంచిది. వ్యాపారస్తులకు కొంత అప్రమత్తంగా ఉండవలసిన సమయం. బ్రాండ్ ఇమేజ్ అనేది చాల ముఖ్యం. సంతాన పరంగా మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి.  ఆరోగ్య పరంగా జాగ్రత్తలు అవసరం.

కర్కాటకం : కర్కాటకరాశి వారికి ఈ వారం అత్యంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు.అష్టమ శని నడుస్తోంది ఈ రాసి వారికీ, 8 శని వారలు శనికి తైలాభిషేకం చేయించండి, మనో ధైర్యం పెంచుకోవాలి, ఆశించని ఫలితాలు త్వరగా రావు, మీ వ్యవహార శైలిలో మార్పులు చేసుకోవాలి, తద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఆశించిన ఫలితాలు తక్కువగా ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. సంతానం పట్ల జాగర్త వహించాలి. ఈ విపత్కర పరిస్థితిల్లో వివాహం ఎలా చేయాలా అని అనుకుంటారు, అయితే భగవంతుని ఆశీసులతో మంచి సంబంధం కుదురుతుంది. విద్యార్థిని  విద్యార్థులకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు, పరీక్షలలో మంచి మార్కులకు బాగా చదవాలి, మీ యొక్క తెలివి తేటలుకు పదును పెట్టండి. ఆరోగ్య పరంగా  గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటె కొంచెం తగ్గు ముఖం పెట్టె అవకాశాలు ఉన్నాయి.  మానసిక ధైర్యంతో ముందుకు సాగండి.

సింహం: సింహరాశి వారికి ఈవారం అన్ని విధాల మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి ఉంటుంది. అధికారులతో మంచి ప్రశంసలు అందుకునే అవకాశాలు ఉన్నాయి.  నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మంచి సమయం అని చెప్పవచ్చు.  వ్యాపారస్తులకు మంచి ప్రజాదరణ లభిస్తుంది.  వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో పెద్దల పట్ల గౌరవం ఏర్పడుతుంది.  వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి ఫలితాలుంటాయి. విద్యార్థులకు కూడా పోటీ పరీక్షలలో మంచి విజయాలు సాధిస్తారు. మానసిక ధైర్యంతో, పట్టుదలతో ముందుకు సాగండి.  పిల్లలకు తల్లితండ్రుల సహకారం ఎంతో ముఖ్యం.రాజకీయ సంకట స్థితి ఏర్పడుతుంది. నమ్మించి మోసం చేసే వారు చుట్టూ ఉంటారు. జాగ్రత్త వహించండి.

కన్య:  ఈవారం  కన్యారాశి వారికి  సాధారణ  ఫలితాలు గోచరిస్తున్నాయి.  పని చేసే చోట కార్యాలయాలలో అపకీర్తి కానీ, ఉన్నత స్థితి నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.  వ్యాపారస్తులకు అంతంత మాత్రం అని చెప్పవచ్చు. అంతర్గత విషయాలు ఇతరులతో చర్చించడం అంత మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు మీరే స్వయంగా చూసుకోవం మంచిది, గోచార రీత్యా అష్టమ గురువు వలన ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోకపోతే నష్టపోయే అవకాశం వుంది. బాధ్యతలు ఎవరికీ అప్పగించకుండా ఉండడం మంచిది. ఏ సమస్యలు  వచ్చినప్పటికి స్నేహ వర్గం సహాయ సహకారములు అందుతాయి. విద్యార్థులకు పట్టుదలతో , కృషితో ముందుకు సాగవలసిన సమయం గా చెప్పవచ్చు.

 

తుల: ఈవారం తులారాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు సానుకూలత ఉంటుంది. ఆర్ధికాభివృద్ది ఉంటుంది. కొంత ప్రశాంత వాతరరణం ఏర్పడుతుంది. ఎంత వరకు చెయ్యాలో అంతే చెయ్యాలి అని నిర్ణయించుకుంటారు.  ఉద్యోగం లభిస్తుంది, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త వింటారు. వ్యాపారస్తులకు ఖర్చులు అధికం అవుతాయి.  లోన్లు, ఋణాల విషయంలో కొంత జాగ్రత్త వహించండి. కుటుంబ పరంగా కూడా మంచి సానుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి.

వృశ్చికం: వృశ్చికరాశి వారికీ ఉద్యోగస్తులకు అభివృద్ధి బాగుంటుంది. అనుకోని విధంగా ప్రశంసలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఆర్ధికంగా అభివృద్ధి కంటే ఉద్యోగంలో కొంత  హోదా పెరిగే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి . సంతాన పరంగా కూడా మంచి వార్తలు వినడం జరుగుతుంది.  అయితే బంధువర్గంలో చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా శుభకార్యాలు జరుపుకుంటారు. వ్యాపారస్తులకు కూడా ఆర్ధిక లాభాలు ఉంటాయి. సంపాదనంతా కుటుంబం కొరకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.  శ్రమకు తగిన విశ్రాంతి  తీసుకోవడం మంచిది. విద్యార్థులకు  కూడా కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.రాజకీయ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

 ధనస్సు: ఈవారం ధనుస్సురాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ పరంగా సుఖ సంతోషాలు లభిస్తాయి. కుటుంబంలో నూతన శుభవార్తలు వినే  అవకాశాలు ఉన్నాయి.కొంత ప్రశాంతత ఏర్పడుతుంది. వృధా ప్రయాసలు, ప్రయాణాలు వలన ఖర్చు అధికమవుతుంది.ఉద్యోగస్తులకు అధికారులతో కొంత అసంతృప్తిగా ఉంటుంది.  నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలకాలం . వ్యాపారస్తులకు వ్యాపార వ్యవహారాల పట్ల సానుకూలత లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శత్రు వర్గంపై విజయాన్ని సాధిస్తారు. వివాహం కానీ వారికి వివాహ ప్రయత్నాలకు మంచి సమయం. ఆరోగ్యం బాగుంటుంది. గ్యాస్ట్రిక్, స్కిన్ ఎలెర్జి వంటి సమస్యలు ఉంటాయి.విద్యార్ధులకు మిశ్రంగా ఫలితాలు గోచరిస్తున్నాయి

మకరం: మకరరాశి వారికి ఈవారం కొంత ప్రతికూలమైన  పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు  పని భారం  పెరిగే అవకాశాలు ఉన్నాయి. వర్క్ ప్రెషర్ ఉంటుంది. వ్యాపారస్తులకు కొంత ఆర్ధిక పరమైన నష్టం కాకపోయినా వస్తు నష్టం  జరిగే అవకాశాలు ఉన్నాయి.  కుటుంబ పరంగా అన్నిటా అనుకూలత ఏర్పడుతుంది. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సొంత వారే విరోధులుగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. విద్యార్థిని విద్యార్థులకు  కష్టపడి చదుకోవడం చెప్పదగ్గ సూచన.

కుంభం:  కుంభరాశి వారికి ఈవారం అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పవచ్చు.ఉద్యోగస్తులకు లేనిపోని ఆతురత వలన కొంత కష్టాలు-నష్టాలు, అలాగే పని చేసే చోట కానీ, కార్యాలయాలలో కానీ, కుటుంబంలో కానీ, స్త్రీలతో తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  ఏలినాటి శని ప్రభావం తో పాటు, గురు గ్రహ బలం కూడా తక్కువగా ఉండడం వలన  అనుకున్న పనులు, స్థిరమైన నిర్ణయాల విషయంలో కొంత ఒడిదుడుకులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత నిదానంగా, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నూతన విద్యా అవకాశాలు ఉన్నవారు సబ్జెక్టు ఎంచుకునేటప్పుడు జాగ్రత్త వహించండి.ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించండి.

మీనం: మీనరాశి వారికి ఈ వారం మంచి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం ఉన్నా మిగిలిన గ్రహాలు అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలుంటాయి. ఈవారం శుభకార్యాలకి , అలాగే నూతన కార్యక్రమాలు ఆరంభించడానికి మంచి సమయం అని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, సాఫ్ట్ వేర్, టెక్నీకల్ రంగాల వారికి అన్ని విధాలా బాగుంటుంది. గ్రహగతులు బాగున్నప్పుడే నిర్ణయాలు తీసుకోవడం మంచిది.  మీరు అందరికి మంచి చేయాలనీ అనుకుంటారు కానీ కొందరు మీ మీద దుష్ప్రచారాలు చేస్తారు, కొన్ని సార్లు ఈ ప్రొఫెషన్లో ఎందుకున్నామని ఆలోచన చేస్తారు, ఎంత కష్టపడ్డా ఫలితం ఇంకొక్కరు లాక్కోవాలని చూస్తారు. ఒక రకమైన వైరాగ్యం ఏర్పడుతుంది. విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలుంటాయి. రాజకీయ పరంగా అభివృద్ధి ఉంటుంది.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
84669 32223, 90141 26121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News