Wednesday, January 22, 2025

వార ఫలాలు 03-03-2024 నుండి 09-03-2024 వరకు

- Advertisement -
- Advertisement -

మేషం:  ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పరోపకార బుద్దిని కలిగి ఉంటారు. అపనిందలు, ఉద్యోగానికి ఇబ్బంది కలిగే సంఘటనలు సన్నిహిత సహచరుల వలనేనని గ్రహించి, జాగ్రత్త వహించండి.  సంతాన పురోగతికి మీరు చేసిన కృషిని గోప్యంగా ఉంచుతారు. దూరప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. జీవితభాగస్వామి నుండి ధన, ఆస్తి లాభం పొందుతారు. రాజకీయ రంగాల వారికి, విద్యా, వైద్య, న్యాయ రంగంలోని వారికి,  వ్యాపారస్తులకు, లోహపు వ్యాపారస్తులకు, ఆహార సంబంధమైన వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభం:    అనుకూల ఫలితాలను ఎక్కువగా సాధించగలుగుతారు. నూతన వస్తు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తారు. ఆర్థికంగా పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతవరకు ఊరటను చెందుతారు. నరఘోష అధికంగా ఉంటుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. జీవితంలో మంచి మలుపుకు ఇది ఒక కారణమవుతుంది. వీసా, పాస్‌పోర్ట్‌ వంటి అంశాలు సానుకూల పడతాయి. శుభకార్యాలకు గాను ఆహ్వానాలను అందుకుంటారు.  ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం.  మీ సంతానం విషయంలో జాగ్రత్త అవసరం. విద్యా రంగాల్లో మీ అంచనాలు నిజమవుతాయి.

మిథునం:  ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగానే ఉంటాయి. ఏ పని ఎందుకు చేస్తున్నారో! మీకు తప్పా ఇతరులకు తెలియనివ్వరు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త రంగాలలో అనుభవం సాధించడానికి గాను శ్రీకారం చుడతారు. సంతాన సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. పేరుప్రతిష్టలు పెరుగుతాయి. ఆస్థులు కొనుగోలు చేస్తారు. విద్యా, వ్యాపార రంగాల్లో రాణిస్తారు. ఉద్యోగ పరంగా, వృత్తి-వ్యాపారాలో  పురోగతి సాధిస్తారు. మాట నిలకడలేని వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.  రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో నిదానం అవసరం.

కర్కాటకం :  ఈ వారం  సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి.  మానసిక  ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది.
కోర్టుపరమైన వ్యవహారాల గురించి వినూత్నమైన చర్చలు కొనసాగిస్తారు.  బద్ధకం, అతినిద్ర, నీరసం, అలసట, మతిమరుపు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల పరంగా స్థానచలనం వంటివి ఆందోళన కలిగించినా అవి ఆదరణకు నోచుకోవు. సహోదర, సహోదరీ వర్గంతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. నూతన వ్యాపారం ప్రారంభం లాభాలు సూచిస్తున్నాయి.

సింహం:  సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు. దూరప్రాంత వ్యవహారాలు ఫలిస్తాయి. రావలసిన ధనం చేతికంది వస్తుంది. శత్రువులు మీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని త్రిప్పి కొడతారు. నిరుద్యోగులైన విద్యావంతులకు అర్హతలకు తగిన ప్రభుత్వ లేదా దానికి సమానమైన ఉద్యోగం లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితం మూడొంతులు మీ చేతికి వస్తుంది. ప్రభుత్వ పరంగా కొన్ని ఆర్డర్స్‌ పొందగలుగుతారు. జీవితాశయం సాధించాలన్న దిశగా అడుగులు ముందుకు వేస్తారు. విద్యా సంబందమైన లోన్స్‌, నిర్మాణ సంబంధమైన లోన్స్‌ లభిస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు చోటు చేసుకుంటాయి.

కన్య:    వ్యాపారంలో పురోగతిని సాధించడానికి కీలకమైన చర్చలను సాగిస్తారు. విలువైన సమాచారాన్ని తెలుసుకుంటారు. చురుగ్గా వ్యవహరిస్తారు. సంతాన విషయంలో మీరు ఆనందించే విధంగా శుభ వార్తలు వింటారు. గృహంలో ప్రశాంత వాతావరణం కరువై మానసిక అశాంతికి దారితీస్తుంది. బ్యాంకు లావాదేవీలు లాభిస్తాయి. వ్యాపారంలో లాభాలు గతంలో కంటే బావుంటాయి. ఉద్యోగంలో బదిలీలు ఏర్పడవచ్చు. పరపతి పెరుగుతుంది. మీకు రావలసిన ధనం, బిల్లులు, వడ్డీలు మీ చేతికి వస్తాయి. విదేశీ యత్నాలు అనుకోకుండా అనుకూలిస్తాయి. విదేశాలలోని వారు మీకు సహాయం చేస్తారు. వీసా లభిస్తుంది. ఈ వారాంతం అనుకూలంగా ఉంటుంది.

తుల: ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మార్కెటింగ్‌, పబ్లిసిటీ మొదలగు వాటిపై దృష్టిని సారిస్తారు.  ఈ వారం  అనుకూలంగానే ఉంటుంది. విదేశాలలో ఉన్నత విద్య, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల నుండి శుభవార్తలు వింటారు. ఇంటిలో ఒక శుభకార్యం జరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు లాభిస్తాయి. వివాహ సంబంధిత అంశాలు చికాకు కలిగిస్తాయి. కీలకమైన వ్యవహారాలలో ఏర్పడిన ప్రతిబంధకాలు తొలగిపోతాయి.
ఉద్యోగ పరంగా కొంత అశాంతి ఏర్పడుతుంది. శత్రు వర్గంగా భావించిన వాళ్ళు మిత్ర వర్గంగా మారి మీ ఉన్నత స్థితికి కృషి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఈ వారం మెరుగుపడుతుంది.

వృశ్చికం:  ఈవారం  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా స్వల్పమైన అభివృద్ధిని సాధించగలుగుతారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల పరంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. ప్రతి బంధకాలను అధిగమించి పనులను సానుకూల పరచుకుంటారు. బ్యాంక్‌ బుణాల విషయంలో సాంకేతిక లోపాలు చోటు చేసుకుంటాయి. పాడి పంటలను అభివృద్ధి చేసుకో గలుగుతారు. జీవిత భాగస్వామితో కలిసి వ్యవసాయ భూమిని కొనుగోలు చేయగలుగుతారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తరుచుగా ఎదురవుతుంటాయి. బలవంతులైన వారి మీద విజయం సాధిస్తారు.  శుభకార్యాలకు సంబంధించిన చర్చలు నిర్విఘ్నంగా సాగుతాయి.

ధనస్సు:  శుభకార్యాలు సానుకూల పడతాయి. విదేశాల నుండి విలువైన సమాచారాన్ని అందుకుంటారు. గృహం లేక వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సానుకూల పడతాయి. అధిక ధన వ్యయాన్ని తగ్గించడానికి చేసే ప్రయత్నాలలో వైఫల్యం చెందుతారు. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకునే సూచనలున్నాయి. పార్ట్‌టైం జాబ్‌ వర్క్‌లు కలిసి వస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. వివాహాది శుభకార్యాలకు చేసే ప్రయత్నాలు ఆశాజనకంగా వుంటాయి.  అభివృద్ధి దిశలో పయనిస్తారు. ప్రజాధారణ ఉంటుంది. మీ విలువ మరింతగా పెరుగుతాయి.ఈ వారం కొంత వరకు అనుకూలంగానే ఉంటుంది.

మకరం: ఈ వారం  సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంతగానో శ్రమించి అంతంత మాత్రపు ఫలితాలనే సాధిస్తారు. బ్యాంక్‌ బుణాలు కలిసి వస్తాయి. దైవం మీద భారం వేసి ముఖ్యమైన వ్యవహారాలను చక్కబరచుకోగలుగుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తారు. పోటీ తత్త్వాన్ని పెంచుకుంటారు. సంతాన పట్ల అధిక శ్రద్ధను కనబరచవలసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా స్వల్పమైన ఒడిదుడుకులు తప్పక పోవచ్చు. మిత్రుల సహకారం వలన లాభపడతారు. దూరప్రాంత ప్రయాణాలు అందుకు మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి.

కుంభం:  గతంలో దూరమైన వర్గం తిరిగి చేరువవుతారు.వారాంతంలో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార విషయాలకు అనుకూలమైన సమయమని చెప్పవచ్చు. ఓర్పుతో, నేర్పుతో అందరితో కలిసి పనిచేసే విధానాన్ని అవలంభిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి అనుకోని అవకాశాలు లభిస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకోండి. సంతానం విద్య పట్ల జాగర్త వహించండి. వివాహ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ రంగంలో వున్నవారికి ఈవారం బాగుంది.

మీనం: ఈ వారం  అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. రహస్యంగా ముఖ్యమైన చర్చలను సాగిస్తారు. కర్త, కర్మ క్రియ అన్నీ మీరే అయ్యి సంస్థను ముందుకు నడిపిస్తారు. మంచి నిర్ణయాలను తీసుకుంటారు. పుకార్లను నమ్మకుండా కంటితో చూసిన విషయాలనే నిర్ధాంరించుకోండి. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారం లాభిస్తుంది. ఎక్కువ ఆలోచించడం శ్రేయస్కరం కాదు. ప్రభుత్వపరమైన ఉత్తర్వులు, కాంట్రాక్టులు మీ అంచనాల మేరకు ఫలిస్తాయి. ఇ.ఎన్‌.టి, గ్యాస్ట్రిక్,  సమస్యలు బాధించే అవకాశం ఉంది. స్త్రీల వలన కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి.  చాలా సందర్భాలలో మీ మేధస్సు ప్రశంసించబడుతుంది.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
 84669 32223, 90141 26121

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News