Monday, December 23, 2024

ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే ( వార ఫలాలు 04-08 నుంచి 10-08 వరకు)

- Advertisement -
- Advertisement -

  మేషం:   మేషరాశి  వారికి ఈ వారం చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా విజయవంతమైన ఫలితాలను పొందగలుగుతారు. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఉద్యోగ జీవితం చాలావరకు ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందివస్తాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టిపెడతారు. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. విదేశాలలో చదువుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. బ్యాంక్‌ ఋణాలు మంజూరవుతాయి. కుటుంబ సభ్యుల సలహా మేరకు ఓ క్రొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఆర్థికపరంగా కొంత ఒడిదుడుకులేర్పడినప్పటికీ అధిగమించగలగుతారు. మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తారు.విద్యార్థినీ విద్యార్థులకు, కాలం చాలా అనుకూలంగా ఉంది.

వృషభం: వృషభరాశి వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో, మితిమీరిన అహంభావంతో మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవిఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తుంది. వివాదాస్పద అంశాలను పరిష్కరించుకోగలుగుతారు.ఆర్థిక ప్రయోజనాలను సాధించు కోవడానికి మీరు చేసే నూతన ప్రయత్నాలు కలసి వస్తాయి. సానుకూల ఫలితాలను సాధిస్తారు. సంపాదనలో కొంతభాగం వృధాగా ఖర్చవుతుంది. నైతిక విలువల కన్నా ఆస్తులు, అంతస్తులకే ప్రాధాన్యతను ఇస్తారు చేపట్టిన కార్యక్రమాలలో ఆరంభశూరత్వం తప్ప మరేమీ లేదు. ఆత్మీయులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కళా,సాహిత్య రంగంలోని వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. సినీ, నిర్మాతలకు, నటీనటులకు ఈ వారం చాలా బాగుంది.

మిథునం:  మిథున రాశి  వారికి  ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా కొన్ని అదనపు బాధ్యతలను నిర్వహించవలసి వస్తుంది. మీకు అనుభవం లేనటువంటి కొన్ని పదవులను చేయవలసి వస్తుంది. రాజకీయ పదవులు సాధించటానికి ధనాన్ని అడ్డగోలుగా ఖర్చు పెడతారు. వ్యవసాయ సంబంధమైన విషయాలలో ధనాన్ని పెట్టుబడిగా పెడతారు. ఆహార సంబంధమైన  వ్యాపారాలు ప్రారంభించాలి అన్న యోచన వస్తుంది. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. రియల్‌ ఎస్టేట్‌ లాభించదు . ఆపదలలో ఇబ్బందులలో ఉన్న స్నేహితులను ఆదుకుంటారు. సహోదర, సహోదరీ వర్గంలో ఏర్పడిన కలహాలు కుటుంబ పరిస్థితులను దెబ్బతీస్తాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. పిల్లల చదువులు, ఫీజులు మీ అంచనాలను దాటిపోతాయి.

కర్కాటకం :  కర్కాటకరాశి వారికి ఈ వారం వాహన సంబంధమైన విషయాలను ఆర్థిక లావాదేవీలకు, మధ్యవర్తిత్వానికి, వివాదాలకు మొదలైన వాటికి దూరంగా ఉండండి. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. వృత్తి ఉద్యోగాలపరంగా మీ సహనానికి అగ్నిపరీక్షలు ఎదరువుతాయి. ప్రయాణాలు, క్రయవిక్రయాలు ముఖ్యమైన పనులలో నిదానంగా వ్యవహరించడం చెప్పదగిన సూచన.సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగర్తలు తీసుకోవాలి.  భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. దీర్ఘకాలిక బుణాలకు పరిష్కారమార్గం లభిస్తుంది. బంధువర్గంలోస్థిరాస్తి తగాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. విదేశీ నివాసం కోసం అధికంగా శ్రమిస్తారు. గ్రీన్‌కార్డు, పౌరసత్వం లభిస్తాయి. అష్టమ శని ప్రభావం చేత పనులు ఆలస్యంగా అవుతాయి.

సింహం: సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో నిజాయితీ అక్కడక్కడ ఉందని తెలుసుకుంటారు. మీ తెలివి తేటల వలన ఒక ముఖ్యమైన విషయంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో శ్రమ ఎక్కువవుంటుంది, సహా ఉద్యోగులుతో ఇబ్బంది వాతావరణం గోచరిస్తోంది. నరదిష్ఠి ఎక్కువగా వుంది. మీ ఆశలను, ఆశయాలను సాధించుకోగలుగుతారు. ప్రభుత్వపరంగా రావలసిన లావాదేవీలు కలిసివస్తాయి. ఖర్చులను అదుపులో పెట్టుకోండి. భూమి అమ్మకం చివరిదాకా వస్తుంది. చివరలో వాయిదా పడుతుంది. రాజకీయ సంబంధమైన స్నేహాలు పరిచయాలు వృద్ధి చెందుతాయి. అందరిని నమ్మి డబ్బును పెట్టుబడిగా పెట్టవద్దు. సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటారు. విద్యాపరంగా వారి పురోగతి బాగుంటుంది. ఈవారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంది.

కన్య:    కన్య రాశి వారికి  ఈ వారం ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి.  వ్యాపార సంబంధమైన విషయాలను నిశితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగ సమస్యలకు సంబంధించిన విషయాలలో ఇంతవరకు మీ అవసరం లేదన్నట్టుగా వ్యవహరించిన వారు  ఇప్పుడు మీమీద ఆధారపడతారు. విద్యార్థిని విద్యార్థులకు  కాలం అనుకూలంగా వుంది. గృహం కొనాలన్నా మీ ప్రయత్నం సిద్ధిస్తుంది .  ప్రతి పని స్వయంగా చేసుకోవటానికి ఇష్టపడతారు. ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు సాధించడానికి ఆహారశైలిలో చాలా మార్పులు చేయవలసి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది.చిన్న చిన్న మనస్పర్థలు వచ్చే అవకాశం వుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి కానీ కాస్త ఆలస్యంగా వస్తాయి.

తుల: తులా రాశి వారికి ఈ వారం  అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.విద్యాసంబంధమైన విషయాలలో గట్టి పట్టుదలతో మంచి అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు.వ్యాపారపరంగా కొద్దిపాటి లాభాలను చవిచూస్తారు. ఉద్యోగం సాధించాలన్న పట్టుదల సఫలం అవుతుంది. ఉద్యోగంలో మార్పు సంభవిస్తుంది. సహోదర, సహోదరీ వర్గానికి కూడా మీ వంతు సహకారాన్ని ఇస్తారు. స్నేహితులలోనూ, బంధువులలోనూ మీ స్థాయిని నిలబెట్టుకుంటారు. మీ చెడు కోరుకునే వారు ఎవ్వరో మీకు బాగా తెలుసు వాళ్ళకు తగిన విధంగా గుణపాఠం చెబుతారు. పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన కాలం. అన్ని చూసుకుని వెళ్లడం మంచిది..

వృశ్చికం:  వృశ్చికరాశి వారికి ఈవారం  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి . దైవానుగ్రహంతో చాలా విషయాలలో విజయాన్ని సాధించగలుగుతారు. వివాహం పరంగా పెద్దలను సంప్రదించి ముందుకు వెళ్ళండి.  ప్రేమ వివాహం కన్నా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటే జీవితం బాగుంటుంది. కళా,సాంస్కృతిక రంగాలలో మీరు చేసిన నామమాత్రపు కృషికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మంచి ఉద్యోగం సంపాదిస్తారు. పెద్దగా శ్రమించకుండానే అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార పరమైన వ్యవహారాలలో గోప్యంగా వ్యవహరిస్తారు. నూతనమైన అగ్రిమెంట్స్‌ చేసుకోగలుగుతారు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌, వెహికల్‌ ఇన్సూరెన్స్‌, ట్రేడ్‌ మార్కు మొదలైన వాటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తారు. ఆకస్మికంగా వచ్చిన ధనాన్ని మెరుగైన వాటిలో పెట్టుబడిగా పెడతారు. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం లాభిస్తుంది.రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. పదవి లభిస్తుంది.

ధనస్సు:    ధనస్సు రాశి వారికి ఎక్కువగా అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. పాత రుణాలు తీర్చివేస్తారు. అభివృద్ధి కోసం కొత్త ఋణాలు చేస్తారు. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభం అవుతుంది. ఇది మీకు సంతోషకరమైన వార్త. వ్యాపార పరంగా తీసుకునే నిర్ణయాలను వ్యూహాత్మకంగా అమలు చేస్తారు. వ్యాపారంలో లాభాలు మీరు ఊహించిన విధంగానే ఉంటాయి. మీకు ఇష్టమైన గృహం కొనుగోలు చేస్తారు. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. న్యాయవాదులకు, చార్జెడ్‌ అకౌంటెంట్స్‌కు, ఎగుమతి, దిగుమతి వ్యాపారులకు, వస్త్ర వ్యాపారులకు, హోటల్‌ వ్యాపారులకు బ్యూటీపార్లర్‌లు నడిపేవారికి అనుకూలమైన ఫలితాలు, ధన ఆదాయం గోచరిస్తుంది. మీడియా రంగం వారికి అనుకూలంగా వుంది. మంచి పదవులు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు, వివాదాలలో ఉన్న భూమి సంబంధమైన వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి. నిరుద్యోగులకు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. సంతానానికి సంబంధించి అన్ని విషయాలు బాగానే ఉంటాయి. పిల్లల ఆరోగ్యం గురించి కొద్దికాలం మానసిక అప్రశాంతత ఏర్పడుతుంది.

మకరం:   మకర రాశి వారికి  ఈ వారం సానుకూల ఫలితాలను సాధిస్తారు.మీకు ఉపయోగపడే విలువైన పత్రాలు అనుకోకుండా మీ చేతికి వస్తాయి.పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. తద్వారా ఉద్యోగం కానీ, ప్రమోషన్‌ కానీ లభిస్తుంది. కార్యాలయంలో మీ వ్యతిరేక వర్గం మిమ్మల్ని అపకీర్తి, అపహాస్యం చేసే ప్రయత్నాలు చేస్తారు. వారి పట్ల జాగర్త వహించండి. సినీరంగంలో, టీ. వి. రంగంలో పనిచేస్తున్న టెక్నీషియన్స్‌కు కాలం చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి లీజులు, కాంట్రాక్టులు మధ్యస్థంగా లాభిస్తాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల, అన్నదానాల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. పండ్ల వ్యాపారులకు, కూరగాయల వ్యాపారులకు, ఎలక్ట్రికల్ సామానులు అమ్మేవారికి, గృహనిర్మాణ సామాగ్రి అమ్మేవారికి ఈ వారం సంతృప్తికరంగానే ఉంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం వలన నష్టపోతారు.

కుంభం:      కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కీలక సమయంలో ఉన్నతాధికారుల ఉత్తర్వులు మీకు వ్యతిరేకంగా వస్తాయి. మహోన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తులకు ఉన్నత మనస్తత్వం ఉండాలన్న నిబంధన లేదని గ్రహించండి. జాగర్త వహించండి. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రెండవ ప్రయత్నంలో విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో చెప్పుకో దగ్గ మార్పులు ఏమీ ఈవారం లేవు. మీరు చెల్లించవలసిన చెల్లింపులు సక్రమంగానే చెల్లిస్తారు. మీకు రావలసిన రాబడులు సక్రమంగానే వస్తాయి. పొదుపు పథకాల వలన కొన్ని సందర్భాలలో నష్టపోయే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించండి. వివాహం కానీ వారికి వివాహం కుదురుతుంది.  పునర్వివాహాలు చేసుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి.స్థిరాస్థి తగాదాలు తీరి ప్రశాంతంగా ఉంటారు. జీవిత భాగస్వామి పేరు మీద చేసే వ్యాపారం లాభిస్తుంది. నూతన కోణాలను జీవితంలో ఆవిష్కరించాలని నిర్ణయించుకుంటారు.

­ మీనం: మీనరాశి వారికి ఈ వారం  మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉపయోగం లేని అంశాలపై దీర్ఘ ఆలోచనలు చేస్తారు. మీ ఆలోచనలు భవిష్యత్‌ కార్యాచరణలు గోప్యంగా ఉంచకుండా ఆత్మీయులతో చర్చించి అమలు చేయండి. మీ కార్యక్రమాలకు దైవానుగ్రహం, అదృష్టం తోడై విజయవంతమైన ఫలితాలు మీరు అనుకున్న స్థాయిలో ప్రయోజనాలు పొందగలరని భావించి, దీనికోసం కృషి చేస్తారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. వ్యాపారంలో రొటేషన్‌ లాభాలు బాగుంటాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అంతంతమాత్రంగా ఉంటుంది. వివాదంలో ఉన్న ఆస్తి తగాదాల పట్ల జోక్యం చేసుకోరు. వృత్తి ఉద్యోగాలపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నవారికి ఈ వారం స్థిరత్వం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగం వస్తుంది. పిల్లల వలన సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
84669 32223, 90141 26121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News