Sunday, December 22, 2024

వార ఫలాలు (13-10-2024 నుండి 19-10-2024 వరకు)

- Advertisement -
- Advertisement -

మేషం:   మేషరాశి  వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అవసరానికి మించిన ఖర్చులు ఎక్కువ అవుతాయి. బంధుమిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడటం అనేది చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాఫ్ట్ వేర్, చార్టెడ్ అకౌంట్స్ కి టెక్నికల్, సినిమా రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి ఎప్పటి నుండో ఎదురు చూసిన ఉద్యోగం ఈ వారం వచ్చే అవకాశం ఉంది. పాస్‌పోర్ట్ , గ్రీన్ కార్డు వంటివి కొంత ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తోంది . వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపార పరంగా అంత బాగా లేదని చెప్పవచ్చు. భాగస్వామి వ్యాపారాల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంది . రియల్ ఎస్టేట్ పరంగా వారికి కొంత అనుకూలమైన ఫలితాలు గోచరించడం లేదు. విద్యార్థిని విద్యార్థులకు కాలం బాగుందని చెప్పవచ్చు.  వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోండి  దాని వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

వృషభం: వృషభరాశి వారికి  ఈ వారం  బాగుందని చెప్పొచ్చు. ప్రతి విషయంలోను మీదే పైచేయి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పట్ల  పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. విదేశాల కోసం వెళ్లాలన్న మీ కల నెరవేరుతుంది.  ఎప్పటి నుండో రాదు అనుకున్న ఉద్యోగం లభిస్తుంది . అయితే శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం కూడా లభించే అవకాశం గోచరిస్తుంది. బంధుమిత్రులతో కలిసి విహార యాత్రలు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది.  జీవిత భాగస్వామితో మాట పట్టింపు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి ధనవ్యయం కూడా ఎక్కువ అవుతుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి కాలం బాగుందని చెప్పవచ్చు . వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఈ వారం బాగుంటుందని చెప్పవచ్చు. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నూతన ఒప్పంద వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది . ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏమీ ఉండవు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఈ వారం సానుకూలపడే అవకాశం గోచరిస్తోంది.

 మిథునం:  మిథున రాశి  వారికి  ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కష్టపడిన దానికి  ప్రతిఫలం లభిస్తుంది . నలుగురిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి . ప్రభుత్వ ఉద్యోగ పరంగా చేస్తున్న వారికి కొంత నిరాశ ఎదురవుతుంది. ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది . సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు . రియల్ ఎస్టేట్ లో పని చేస్తున్న వారికి బ్యాంకింగ్ సెక్టార్స్ లో వారికి చార్టెడ్ అకౌంట్స్ హౌసింగ్ లోన్ డిపార్ట్మెంట్ వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు.  మొత్తం మీద చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా సరే  ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారపరంగా బాగుంటుంది. నరదిష్టి అధికంగా ఉంది. విదేశాల్లో వ్యాపారం చేయాలన్న మీ కల  నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

 కర్కాటకం :  కర్కాటకరాశి వారికి మిశ్రమ  ఫలితాలు గోచరిస్తున్నాయి. పనులు సకాలంలో పూర్తి కావు ఏ పని చేసి నా నలుగురిలో మాట పడే అవకాశం కనిపిస్తోంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చినా సమసిపోతాయి. ఉద్యోగస్తులకు టెక్నికల్ టెక్నాలజీలో ఉన్నవారికి గ్రాఫిక్ డిజైన్ లో ఉన్నవారికి,  డాక్యుమెంట్ రైటర్స్ కి అంత గొప్పగా లేదని చెప్పొచ్చు . ఆదాయం మించిన ఖర్చులు కనిపిస్తున్నాయి . వాహనం కొనడానికి కూడా మంచి సమయం అని చెప్పవచ్చు . వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభసాటిగా ఉంటుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం బాగుంది . విదేశాల కోసం వెళ్ళాలనుకునే  ప్రయత్నం ఫలిస్తుంది . స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు. నలుగురిలోనూ మంచి పేరు  ప్రఖ్యాతలు ఉన్నాయి కాబట్టి దాని వల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. ధనం అధికంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు

 సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం బాగుందని  చెప్పొచ్చు . వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఈ వారం ఆహ్లాదజనకంగా  ఉంటుందని చెప్పవచ్చు బంధుమిత్రులతో కానివ్వండి కుటుంబ సభ్యులతో కానివ్వండి సఖ్యత ఏర్పడుతుంది.  అయితే సంతానం విషయంలో మనోవేదన కు గురవుతారు మనం ఎంత కష్టపడ్డా పిల్ల లు లెక్క చేయడం లేదే అన్న ఒక వేదన ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కాలం అనుకూలంగా ఉంది. చిన్న విషయానికి తొందర పడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ వారం  వ్యాపారం బాగుందని చెప్పవచ్చు. కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా ఈ వారం బాగుంది. ప్రయాణాలు అధికంగా చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

కన్య:    కన్య రాశి వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అన్నీ బాగున్నా ఏదో  తెలియని మనోవేదన కనిపిస్తుంది. ధన వ్యయం సూచన కూడా కనిపిస్తోంది. విషయాలను ఆచి తూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి . ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు . విదేశాల కోసం ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న వారికి  వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.  గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు వచ్చే అవకాశం కనిపిస్తోంది . వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుందని చెప్పొచ్చు.  చిట్ ఫండ్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మోసపోయే అవకాశం కూడా  కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి . జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది . సంతాన విషయమై మంచి పురోగతి ఉంటుంది.

 తుల: తులా రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు . ప్రతి విషయంలోను మీదే పైచేయి ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు . కష్టపడిన దానికి ప్రతిఫలం కూడా ఈ వారం బాగుందని చెప్పొచ్చు . ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం కనిపిస్తుంది .వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు . విదేశీ వ్యవహారాలు బాగుంటాయి . భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి . దైవ దర్శనలు ఎక్కువగా చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు.  విద్యార్థి నీ విద్యార్థులకు కాలం అనుకూలంగా  ఉంది చేసే పనిలో మంచి గుర్తింపు లభిస్తుంది .విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి . గ్రీన్ కార్డు వచ్చే అవకాశం కనిపిస్తోంది పిఆర్ కోసం అప్లై చేసే వారికి అయితే ఈ వారం కొంచెం నిదానం అని చెప్పవచ్చు. ఈ రాశిలో   నిర్మించిన స్త్రీలకు కాలం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు.  ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా బాగుందని చెప్పొచ్చు. సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

 వృశ్చికం:  వృశ్చికరాశి వారికి ఈవారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి .ఏ పని చేసినా నిరాశ నిస్పృహ ఎదురవుతుంది .చేసే పనిలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది .వచ్చిన కష్టం కంటే నలుగురు అన్న మాటలే ఎక్కువగా ఉంటాయి .ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏమి ఉండవు. ఆరోగ్యపరంగా కానివ్వండి డబ్బు పరంగా కానివ్వండి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. సంతానా అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుందని చెప్పొచ్చు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో కొంత జాప్యం జరిగిన మంచి సంబంధం కుదురుతుంది . ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తునందు వలన ఏ పని చేసినా ముందుకు  వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం అలాగే నాలుగు సోమవారాలు శివాలయంలో అభిషేకం చేయడం చెప్పదగిన సూచన.

 ధనస్సు:    ధనస్సు రాశి వారికి ఈ వారం  బాగుందని చెప్పొచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ ఉత్సాహంగా ఉంటుంది. మీరు చేపట్టాలన్న నూతన ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఈ వారం ప్రారంభించవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది మంచి ఉద్యోగం లభిస్తుంది విదేశాలకు వెళ్లాలనుకునే వారికి పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ వారం బాగుందనే చెప్పవచ్చు ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగానే ఉంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఏ విషయానైనా సరే అతిగా ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది కాదు సూక్ష్మంగా ఆలోచిస్తే తద్వారా మంచి ఫలితాలు కాకుండా చెడు ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు వృత్తి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి.

 మకరం:   మకర రాశి వారికి  ఈ వారం  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంట బయట మంచి ఫలితాలే కాకుండా చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలతో ముఖ్యంగా విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. జీవిత భాగస్వామితో స్వల్పవిభేదాలు కనిపిస్తున్నాయి. మిత్రులతో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఆరోగ్య విషయమై చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా అవేమి ఇబ్బంది పెట్టవు. ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడతాయి .ఉద్యోగం పోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది . ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ వారం అంతగా బాగోలేదని చెప్పొచ్చు . నరదృష్టి వీరికి ఎక్కువగా ఉంది కాబట్టి వ్యాపార విషయంలో కొన్ని జాగ్రత్త  లు తీసుకోవడం చెప్పదగిన సూచన . వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు.  విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు .ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు వీరికి కలిసి వస్తాయి.

కుంభం:  కుంభ రాశి వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ధన వ్యయం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. బంధుమిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ప్రమోషన్ పరంగా బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ లో ఉన్నవారికి ఈ వారం బాగుందని  చెప్పవచ్చు. ప్రతి విషయానికి స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామి తో విభేదాలు లేకుండా చూసుకోవాలి. సంతానం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుందని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంట బయట పేరు ప్రఖ్యాతలు చెడగొట్టే వారు ఉన్నారు కాబట్టి జాగ్రత్త వహించండి.

­మీనం: మీనరాశి వారికి ఈ వారం  బాగుందని చెప్పొచ్చు ప్రతి విషయంలోనూ మీదే పై  చెయ్యి ఉంటుంది ఎప్పటి నుండి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయగలుగుతారు. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి . ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా బాగుంది . విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ వారం మంచిదని చెప్పవచ్చు విదేశీ ప్రయత్నాలు సానుకూల పడతాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంది పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తవుతాయి విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి స్వదేశం కంటే విదేశాల్లోనే ఎక్కువగా అర్జించగలుగుతారు మంచి ఫలితాలు మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు ఈ రాశిలో జన్మించే స్త్రీలకు అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ వారం ధన నష్టం అనేది ఎక్కువగా సూచిస్తుంది. జాగ్రత్త వహించండి మిత్రులతో గాని బంధుమిత్రులతో గాని మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి విభేదాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News