Sunday, December 22, 2024

వార ఫలాలు (20-10-2024 నుండి 26-10-2024 వరకు)

- Advertisement -
- Advertisement -

మేషం:   మేష రాశి వారు డబ్బు విషయంలో ఉద్యోగ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగ గాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.విదేశీ వ్యవహారాలు అంతగా అనుకూలించవు.వ్యాపారంలో చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగం మారాలి అనుకునే వాళ్ళు కొంతకాలం వేచి ఉండడం చెప్పదగిన సూచన. ఆరోగ్య సంబంధమైన విషయాలు జాగ్రత్త వహించాలి .  వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి.విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు బాగుందని చెప్పవచ్చు.జీవిత భాగస్వామితో ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది.

వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి  ఈవారం ఉద్యోగం లభిస్తుంది. డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తోంది . ప్రతి విషయం ఆలోచించి ముందుకు వెళ్ళండి. వృత్తి వ్యాపారపరంగా అంతా అనుకూలంగా లేదు.రియల్ ఎస్టేట్ వారికి అంత అనుకూలంగా లేదు.విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు మంచి ఆలోచనతో ముందుకు సాగండి .దైవ అనుగ్రహం తోడు వల్ల మేలు జరుగుతుంది. వీసా గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్య పరంగా, ఉద్యోగ పరంగా ,వ్యాపార పరంగా ,బాగుందని చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్ కి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన.సినిమా కళా రంగంలో వారికి బాగుంది. హెల్త్ పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి .

మిథునం:  మిథున రాశి  వారికి ఈ వారం  బాగుందని  చెప్పవచ్చు. ఏ పని చేసినా ముందుకు సాగడం జరుగుతుంది .వృత్తి ఉద్యోగాలు పేరు ప్రఖ్యాత లభించే అవకాశం కనిపిస్తోంది. ప్రమోషన్స్ పరంగా కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు, విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్ళకి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. నూతన ఉద్యోగం మారాలనుకునే వారికి అంత అనుకూలంగా లేదు. కొత్త ప్రాజెక్టులు వస్తాయి.ఉన్న ఉద్యోగంలోనే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపార పరంగా అనుకుల ఫలితాలు  గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన .జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్లడం చెప్పదగిన సూచన.విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది .వీసా గ్రీన్ కార్డ్ హెచ్ వన్ బి వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. విద్యార్థిని విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల  శుభసూచకం చెప్పవచ్చు.వివాహం కాని వారికి వివాహ విషయంలో కొంచెం ఆలస్యం అయ్యే సూచన కనిపిస్తోంది.సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంచెం జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యాపరంగా ,వ్యాపార పరంగా ,ఉద్యోగ పరంగా బాగుందని చెప్పవచ్చు.

కర్కాటకం :  కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.  వృత్తి, ఉద్యోగాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి .ఉద్యోగస్తులకు ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కలిసి వస్తుంది. కుటుంబంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్న అవి అధిగమిస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఏకాగ్రత లేకపోవడం వల్ల పని ముందుకు సాగదు. ఏకాగ్రతతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి .వ్యాపారస్తులకు ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు . స్టీల్, సిమెంట్, రియల్ ఎస్టేట్ వారికి కలిసొస్తుంది. రావు అనుకున్న పెండింగ్ బిల్స్ కూడా ఈ వారం మీ చేతికి  వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి . విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తోంది . ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాలు చిన్నచిన్న ఇబ్బందులు ఉన్న అధిగమిస్తారు. ఏ పని చేసినా మీదే పై చేయి అవుతుంది. ఆరోగ్యం పట్ల  జాగ్రత్తలు తీసుకోవాలి.

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో మంచి మార్పు కనిపించిన తగిన ఆదాయం మటుకు ఉండదు. ఖర్చు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి . వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు, చార్టెడ్ అకౌంట్ కి ఈవారం బాగుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రాశిలో  జన్మించిన స్త్రీలకు బాగుందని చెప్పవచ్చు. వ్యాపారంలో ఉన్న వారికి చిన్నపాటి ఇబ్బందులు ఉన్న అవన్నీ మనోధైర్యంతో ముందుకు  సాగుతారు దాని వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వివాహం కాని వారికి వివాహం కొంచెం ఆలస్యం  అవుతుంది.  సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వినే అవకాశం ఉంది.

కన్య:    కన్యా రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు.  కష్టపడిన దానికి ప్రతిఫలం తక్కువ కనిపిస్తుంది ఉద్యోగం మారాలన్న మీ ప్రయత్నం ఈ వారం నెరవేరదు .  బిజినెస్ లో  రొటేషన్ బాగుంటాయి. బిజినెస్ ఒప్పందాలు చేసుకోవడానికి అనుకూలం  వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి.  నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా లేవు.  వ్యాపారస్తులకు బాగుందని చెప్పవచ్చు.  రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగుందని చెప్పవచ్చు.  నూతన గృహం లేదా వాహనం కొనాలి అనుకునే వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపార అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమిస్తారు దానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.  జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది .

తుల: తులా రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది.  ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.  ఉద్యోగ ప్రయత్నం చేసుకున్న వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు. సినిమా కళా రంగంలో వారికి బాగుందని చెప్పవచ్చు. మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది.  ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు.  విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం నిదానంగా ఉంటుంది.

వృశ్చికం:  వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగ పరంగా ట్రాన్స్ఫర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. సంతానం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ రాశిలో  జన్మించిన స్త్రీలకు బాగుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు.

ధనస్సు:    ధనస్సు రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రతి పని పూర్తి చేయగలుగుతారు .ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి కష్టపడతారు.జీవిత  భాగస్వామితో ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉన్న అవి తొలగిపోయి వ్యాపారంలో లాభాలు  కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి.  విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.  ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.  వృత్తి ఉద్యోగాల పట్ల పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి.  ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.  వ్యాపారస్తులకు బాగుందని చెప్పవచ్చు.

మకరం:   మకర రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం కొంచెం ఆలస్యంగా వస్తుంది. మనోవేదనకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోని  ముందుకు వెళ్ళండి.  ఏ పని చేసినా నిదానంగా సాగుతుంది అని ఆలోచించుకుని ముందుకు సాగడం చెప్పదగిన సూచన. వ్యాపార పరంగా బాగుంటుంది.  ఈ రాశిలో జన్మించిన  స్త్రీలకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.  ప్రతి పనులకు మీకంటూ ఒక   గుర్తింపు లభిస్తుంది.  విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం బాగున్న ఏదో తెలియని ఆందోళన ఉంటుంది. మానసిక వేదన అనేది ఎక్కువ ఏర్పడుతుంది.  గ్రీన్ కార్డ్ కోసం, హెచ్ వన్ బి కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి.  విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.వ్యాపారస్తులకు వ్యాపార పరంగా నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తుంది.  ఫైనాన్స్ పరంగా జాగ్రత్తలు వహించండి.  ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి.  విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగాలు కలిసి వస్తాయి .   విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది.  వైద్య వృత్తి లో ఉన్న వారికి విదేశాలకు వెళ్లి చదవాలి అనుకునే వారికి బాగుంది.  స్కాలర్షిప్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది .  వ్యాపార భాగస్వాములతో చిన్నపాటి విభేదాలు  గోచరిస్తోంది. గ్రీన్  కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు వచ్చే అవకాశాలు  గోచరిస్తుంది.

­మీనం: మీనరాశి  వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు.   అనుకోని ధనం చేతికందుతుంది.  దైవదర్శనాలు ఎక్కువ చేసుకుంటారు. నలుగురితో కలిసి ఆనందంగా గడుపుతారు.  వచ్చిన ధనాన్ని జాగ్రత్తపరచడం చెప్పదగిన సూచన.  ఉద్యోగస్తులకు ఈవారం బాగుందని  చెప్పవచ్చు. వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో కావచ్చు , వ్యాపార  భాగస్వామితో కావచ్చు విభేదాలు వచ్చే  అవకాశం కనిపిస్తోంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి కాలం అని చెప్పవచ్చు.  గ్రీన్ కార్డ్, H1B కోసం   ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది.  మిత్రుల పట్ల జాగ్రత్త వహించండి.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News