Wednesday, January 22, 2025

వార ఫలాలు (10-11-2024 నుండి 16-11-2024 వరకు)

- Advertisement -
- Advertisement -

మేషం: ఈ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు . ఆర్థికంగా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం ఏర్పడుతుంది . వ్యాపార పరంగా బాగుంటుంది. ఇంట్లో వాళ్లతో కానీ, బయట వాళ్లతో కాని, విభేదాలు వచ్చే సూచన కనిపిస్తున్నాయి జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి . ఉద్యోగస్తులకు ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉన్న స్థలం మార్పిడి సూచిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా లేదని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు కాలం బాగుందని చెప్పవచ్చు. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. విదేశాల్లో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు . సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కొంత గడ్డు కాలమని చెప్పవచ్చు. ప్రతినిత్యం, ఉదయం సాయంత్రం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

వృషభం రాశి : ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో కూడా చిన్నపాటి నష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. నలుగురిలోను పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగంలో కానివ్వండి , వ్యాపారంలో కానీ ఉన్నత స్థానాన్ని
సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కొంత ఆలస్యం అవుతాయి. కొంత నిరాశ ని స్పృహ అనేది ఏర్పడుతుంది . కష్టానికి తగిన ప్రతిఫలం లభించట్లేదే అనే మనోవేదన ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి . భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది . విద్యలో కూడా మంచి రానింపు సాధిస్తారు . పోటీ పరీక్షల్లో ఆదర్శప్రాయంగా నిలుస్తారు. విద్యార్థిని విద్యార్థులకు చిన్నచిన్న ఇబ్బందులు ఎదురైన మంచి పురోగతి సాధిస్తారు.
దుర్ వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగి సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

మిథునం: ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో బాగుంటుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ చిన్నపాటి మార్పులు వలన మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్పెక్యులేషన్స్ కి దూరంగా ఉండండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి కొంత నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తుంది. పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి పెట్టండి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది . జాతక పరిశీలన చేసుకుని ముందుకి వెళ్లడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా, వ్యాపార పరంగా , అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది జాగ్రత్త వహించండి . విద్యార్థిని విద్యార్థులు కాలం అనుకూలంగా ఉంది . వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా వస్తుంది.

కర్కాటకం రాశి : ఈ రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు, ముఖ్యంగా వీరికి విదేశలకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. పనులు నిదానంగా సాగుతాయి. నిరాశ పడకుండా ప్రతి పనికి అధైర్యపడవద్దు . ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపార పరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. సంతాన పరంగా అభివృద్ధి బాగుంటుంది . స్త్రీ సంతానం వల్ల మంచి అభివృద్ధి చెందుతారు . ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా, కష్టతరమైన వారంగా చెప్పవచ్చు . కష్టానికి తగిన ప్రతిఫలం అంత గొప్పగా లభించదు కానీ ధైర్యం మటుకు ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది . విదేశీ వ్యవహారాలు కానివ్వండి , క్రయవిక్రయాలు కానివ్వండి, పార్టనర్షిప్స్ కానీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు.

సింహరాశి : ఈ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఏ పని చేసిన నలుగురులో మంచి గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు కూడా గోచరిస్తుంది. సంతాన వివాహ సంబంధం కోసం గట్టిగా ప్రయత్నిస్తారు . ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సినిమా పరిశ్రమ వారికి ఈ వారం బాగుంది. కళా సంస్కృతి రంగాల్లో వారికి , పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి,
రియల్ ఎస్టేట్ , పూజ స్టోర్స్, చిరు వ్యాపారస్తులు ఈ వారం అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు . విద్యార్థిని విద్యార్థులకు ఈవారం బాగుంది. మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కొంత ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తుంది.ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార పరంగా వృత్తిపరంగా అనుకూలత ఏర్పడుతుంది. విదేశాల్లో ఉన్నవారికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు ప్రతి రోజు ఆదిత్య హృదయం పఠించడం చెప్పదగిన
సూచన.

కన్య: కన్య రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి . వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి . నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ స్థానం నిలబెట్టుకోవడానికి మీ కృషి మీరు చేయండి. ఫలితాలు ఆ పరమేశ్వరుడుకే వదిలేయండి . విద్యార్థిని విద్యార్థులకు
ఈవారం బాగుందని చెప్పవచ్చు. కెరియర్ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు . మీకున్న తెలివితేటలకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశి వారు ఎక్కువగా దైవదర్శనాలు చేసుకుంటారు దాని వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి మంగళవారం
శనివారం నాడు ఆంజనేయస్వామికి ఆకు పూజ చేయించండి.

తుల: ఈ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి పరంగా, వ్యాపార పరంగా లాభసాటిగా ఉంటుంది. మీరు ఏదైయితే కోరుకుంటారో అది ఈ వారం నెరవేరుతుంది. బందు మిత్రులతో సరదాగా గడుపుతారు. అందరితో కలసి విహరించాలని, నలుగురితో ఉండాలని. ప్రయత్నిస్తారు. ఆరోగ్య విషయంలో ఒక్కటీ జాగ్రత్తలు తీసుకోండి.
మిగతావన్నీ బాగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఎప్పటి నుండో నష్టాల్లో ఉన్న వ్యాపారం లాభాల బాటలోకి వచ్చే సూచన కనపడుతోంది. క్షణం తీరికలేకుండా ఉంటారు. ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల బాగుందని అనుకుంటారు. ఎందుకంటే ఎన్నో నెలల నుండి నష్టాలలో ఉన్న వారికి బాగుంటుందని చెప్పవచ్చు. ఇది అందరికీ కాదు కొందరికి మాత్రమే.
ఈ రాశి వారు సోమవారం నాడు వ్యాపార పరంగా రుద్రాభిషేకం జరిపించండి. ఈ అభిషేకం మీ గృహంలో, కార్యాలయంలో, కార్తీకమాసంలో చేయించడం ఎంతో మంచి ఫలితాలు ఇస్తాయి. విదేశీ వ్యవహారాలు, విదేశాలకు వెళ్లనుకున్నవాళ్ళు ఈ వారం ప్రయత్నాలు చేయవచ్చు. ఉద్యోగం దొరుకుతుంది, కానీ మీరు అనుకున్నది కాకుండా చిన్న స్తాయి ఉద్యోగం
లభిస్తుంది. కాబట్టి వచ్చిన దాన్ని వాదులుకోకుండా చేయండి. తరువాత మంచిది మీరు కోరుకున్నది ల భిస్తుంది. వివాహాది శుభకార్యాలు అనుకూలించే అంశం అని చెప్పవచ్చు . బందు మిత్రులతో విహార యాత్రలు చేస్తారు. ఆ సమయంలోనే సంబంధం కుదురుతుంది. చాలా సంతోష పడతారు. ఏదైనా ఆ పరమేశ్వరుని అనుగ్రహం అనుకుంటారు. ఎప్పటి నుండో
రాదు అనుకున్న సంబంధం రావడం శుభసూచికం అని చెప్పవచ్చు. విదేశాలలో ఉంటున్న వారికి, విధ్యార్ధి విధ్యార్ధులకు కాలం అనుకూలంగా ఉంది. వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి, విదేశాలలో ఉండి ఉద్యోగం లేక బాద పడుతున్న వారికి చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఈవారం వచ్చే అవకాశం కొంత శుభ సూచకం అని చెప్పవచ్చు. మీ మనో ధైర్యమే మిమ్మల్ని నడిపిస్తుంది. ఏదైనా సరే అధైర్య పడకుండా ముందుకు సాగండి విజయం సిద్దిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి పరంగా, వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు. అయితే ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని చెప్పవచ్చు. ఆవితప్పా మిగతావన్నీ బాగుంటాయని చెప్పవచ్చు. సినిమా కళా రంగాల వారికి ఎన్నడూ లేని విధంగా బాగుందని చెప్పవచ్చు. డబ్బు కన్నా పేరు ప్రఖ్యాతలు లభించవచ్చునని చెప్పవచ్చు . అయితే దీనివల్ల మనకేమి ఉపయోగ పడుతుందనుకునే వాళ్ళు కొంతమంది అయితే అదే ఎంతో మేలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. డబ్బు ఇవాళ్ళ సంపాదిస్తారు. రేపు ఖర్చు పెడతారు. కానీ పేరు ప్రఖ్యాతలు అన్నవి ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నవారికి ఎంతో ముఖ్యం. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి . భాగస్వామ్య వ్యాపారాలకంటే స్వంతంగా వ్యాపరం చేసుకునే వారికి ఎక్కువగా లాభాలు సూచిస్తున్నాయి. ఈ రాశి వారు ప్రతి నిత్యం ఓం నమశివహాయ వత్తులతో, నువ్వుల నూనెతో కానీ అష్ఠ మూలిక తైలంతో కానీ దీపారాధన చేయండి. అలాగే శుక్రవారం నాడు ఓం నమో నారాయణ వత్తులతో, శనివారం నాడు నలుపు వత్తులతో దీపారాధన చేయండి దాని వల్లన మంచి
ఫలితాలు సంప్రాప్తిస్తాయి . ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి , ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఏదేమైనా సరే ఆ పరమేశ్వరుని దయవల్ల అంతా మేలే జరుగుతుంది. బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య రెండు, కలిసొచ్చే దిక్కు పడమర , కలిసొచ్చే రంగు నేవీ బ్లూ

వృశ్చిక: ఈ  రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు పోచరిస్తున్నాను అయితే ఇంకా బయట చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నా పూజ వారి పరంగా బాగుందని చెప్పవచ్చు వ్యాపార పరంగా కూడా ఈ వారం లాభసాటిగా ఉంటుంది ఎందుకంటే కొద్ది వారాలుగా ఇబ్బందులు చూస్తున్నారు ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇబ్బందులు చూస్తున్నాం ఈవారం వీరికి కొంత మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు . మనోవాంఛాఫల సిద్ధిరస్తు అన్నట్టుగా అనుకున్నది నెరవేరుతుంది. దైవానికి గ్రహం తోడు వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తి చెందుతాయి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి విదేశాలలో స్థిర నివాస కోసం ప్రయత్నించే వారికి స్థిరనివాసం ఏర్పడుతుంది. గ్రీన్ కార్డ్ డిఆర్ లభించే అవకాశాలు గోచారిస్తున్నారు లేదా అప్లై చేయాలనుకున్నవారు ఈ వారం అప్లై చేయవచ్చు వ్యాపారిపరంగా కొటేషన్లు బాగుంటాయి భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోయి కలిసిమెలిసి వ్యాపారాన్ని ముందుకు తీసుకు వెళతారు అయితే
ఈ రాశి వారికి అర్థాష్టమ శరీర నడుచుకోవడం వల్ల బంధు వర్గంతో కావచ్చు లేదా బయట వారితో కావచ్చు చిన్న పార్టీ అపనిందలు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఈ అర్దాష్టక శనికి ప్రతిరోజు ఉదయం శివరాధన చేయండి అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పట్టించు ఉదయం సాయంత్రం కార్తీకదీపం పెట్టండి మంచి ఫలితాలు ప్రాప్తిస్తాయి దూర ప్రయాణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదృష్టం కలిసి వచ్చే విధంగా ఈ వారం గోచరిస్తుంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు
వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలు సూచించే విధంగా వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు ఈ రంగంలో ఉన్నవారికి చెప్పేది ఒకటే 10% కష్టపడితే 10% కష్టపడితే 10% 100% కష్టపడితే 100% లభిస్తుంది జాతకం బాగోలేదు అందుకే ఏమీ రావడం లేదు మార్కెట్ బాగోలేదని అనుకుంటాం కానీ మీకు ఉన్న ధైర్యాన్ని మీరు ముందుకు వెళ్ళగలిగితే అవి ఏవి నీకు అక్కరకు రావు బిజినెస్ పరంగా మీరు ఎదగడానికి అది ఒక మెట్టు అనుకోండి కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ముఖ్యంగా చెప్పేది మీ ధైర్యాన్ని నమ్ముకొని మీ విశ్వాసాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా బాగుందని చెప్పవచ్చు అయితే
విదేశీ వ్యాపారాలు అంతగా అనుకూలంగా లేదు ప్రాజెక్ట్ విషయంలో కొన్ని చేతిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత గడ్డుకాలం అని చెప్పవచ్చు ప్రాజెక్టులు చేతిదాకా వచ్చి మళ్లీ వెనక్కి వెళ్తాయి అది ఏం జరిగింది ఎలా జరిగిందని మీకు అర్థం కాదు కాబట్టి ప్రతి విషయాన్ని ఆశతోచి వ్యవహరించండి అలాగే భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి లేకపోతే చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఒక శుభ సూచకం ఏంటి
అంటే సంతానం బాగుంది సంతానం యొక్క అభివృద్ధి బాగుంది మంచి విద్య ఉంటుంది మంచి ఉద్యోగం లభిస్తుంది ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వివాహ సంబంధం కుదురుతుంది ఇది ఒక మంచి అంశంగా చెప్పవచ్చు ఈ రాశి వారు సోమవారం నాడు రుద్రాభిషేకం చేయండి ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి అలాగే మంగళవారం శనివారం నాడు హనుమంతుడికి ఆకు పూజ చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి రుద్రాభిషేకం చేయలేని వాళ్ళు ఏకబిల్వం శివార్ధనమని ఒక చెంబు నీళ్ళు స్వామివారి మీద అభిషేకం చేసి దండం పెట్టుకుంటే ఈ కార్తీకమాసంలో కోటిరెట్లు ఫలితం దక్కుతుంది సంవత్సరం మొత్తం ఒక ఎత్తు అయితే కార్తీకమాసం ఒక ఎత్తు. కార్తీకమాసంలో ఉదయం ఆరు గంటల్లోపు సూర్యోదయానికి ముందు సూర్య సమయం తర్వాత దీపాలు వెలిగించినట్లయితే ఎన్నో రెట్ల పుణ్యఫలతం లభిస్తుంది . అలాగే మగవారు కనక పూజ చేసి కార్తీక దీపం వెలిగించినట్లయితే
ఆ ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో ఉంటారు సాయంత్రం పూట స్త్రీలు వెలిగించినట్లయితే పిల్లల అభివృద్ధి ఎంతో బాగుంటుంది కాబట్టి ఈ కార్తీకమాసంలో దీపారాధన చేసి ఆ శివ కేశవుల అనుగ్రహం పొందగలరు అని మనవి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే దిక్కు ఉత్తరం కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ

ధనస్సు: ఈ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు మంచి ఫలితాలు సూచిస్తున్నాయి బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. అలాగే వినోదపరితమైన కార్యక్రమంలో పాల్గొంటారు ఉద్యోగస్తులకు ఈ వారం ఉద్యోగ పరంగా బాగుందని చెప్పవచ్చు అలాగే వ్యాపారస్తులకు వ్యాపార పరంగా రొటేషన్ బాగుంటాయి అయితే కొత్త ప్రాజెక్ట్ ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఈ వారం మొదలు పెట్టకపోవడమే మంచిది . వచ్చేవారం
ప్రారంభించడం చెప్పదగిన చూసిన ఎందుకంటే ఈ వారం మొదలు పెడితే కొన్ని ఆటంకాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఉన్న వాటినే నడిపించుకుంటూ ముందుకు వెళ్లడం చెప్పదగిన సూచన భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి మీరు ఉన్న పోటీ ప్రపంచంలో మీకంటూ స్థానాన్ని సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడతారు దానికి ఫలితంగా అన్ని అనుకూలంగా ఉంటాయి పేరు ప్రతిష్టల కోసం అహర్నిశలు శ్రమిస్తారు అన్నిటికంటే ముందు కుటుంబం ముఖ్యమని
ముందుకు సాగుతారు కొంతమంది మనకెందుకులే అనుకుంటే మీరు అలా కాకుండా కుటుంబం కోసం కష్టపడతారు దాని వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. సహోదరీ సోదరీమధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి వ్యాపారపరంగా ఉద్యోగ పరంగా కంటే కూడా కుటుంబ పరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు విద్యార్థి విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలు సాధించగలుగుతారు మిరిట్ మార్కులు లభిస్తాయి అలాగే కొత్త కోర్సుల కోసం ప్రయత్నిస్తున్న వారికి
ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు విదేశీ వ్యాపారాలు విదేశీలకు వెళ్లాలి అనుకునే వారికి వీసా విషయంలో పాస్పోర్ట్ విషయంలో అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి మొత్తం మీద విద్యార్థి విద్యార్థులకు ఈవారం బాగుందని చెప్పవచ్చు ఈవారం జన్మించిన స్త్రీలకు ఉద్యోగాలపరంగా వ్యాపార ఫలంగా అనాలోచిత ఖర్చులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి మీకు ఉన్న అనుభవాన్ని పక్కనపెట్టి ఎవరో చెప్పిన మాటలు విని ముందుకు వెళ్తారు దాని వల్ల ఇబ్బందుల
పాలు అవుతారు కాబట్టి ఏదైనా సరే మీ నిర్ణయాన్ని మీరు తీసుకుని ముందు కు వెళ్లడం వలన మంచి ఫలితాలు వస్తాయి. దైవానుగ్రహం తోడువలన ఏ పని చేసినా మంచి ఫలితాలు ఉంటాయి అయితే కొన్ని ఆరోగ్యకరమైన ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ఆరోగ్యకరమైన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం స్కిన్ కి సంబంధించినది బ్యాక్ పెయిన్ కి సంబంధించిన, కడుపు నొప్పికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని
ముందుకు వెళ్లండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి అష్టమూలికా తైలం నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి సోమవారం నాడు లేదా గురువారం నాడు రుద్రాభిషేకం చేయించడం లేదా అభిషేకం చేయించడం శివుడికి శుక్రవారం నాడు ఓం నమో నారాయణ ఒత్తులతో శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం దాని వలన ఏదైనా
ఆగిపోయిన పనులు ఉంటే ముందుకు సాగుతాయి ఈ నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం వలన రియల్ ఎస్టేట్లో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వారికి బాగుంటుందని చెప్పవచ్చు ఏదైనా పరమేశ్వర అనుగ్రహంతో ముందుకు సాగండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు ఎల్లో

మకర : రాశి వారికి ఈవారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాలపరంగా అన్ని బాగున్న జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే సూచనలు కనిపిస్తుంది అలాగే చిన్నపాటి ఇబ్బందులు కూడా కనిపిస్తోంది మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా మాట మాట వస్తే ఎవరో ఒకరు సర్దుకొని ముందుకు వెళ్లడం చెప్పదగినది అన్ని విషయాలను అందరితో పంచుకోకుండా భాగస్వాములు ఇద్దరు సామరస్యంతో ముందుకు వెళ్లడం వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడగలరు సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి . వారు సరిగా
చదువుతున్నారా లేదా అన్న విషయం కూడా శ్రద్ధ పెట్టాలి ఏదైతే వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఎంత శ్రద్ధపెడతారో అలాగే ఇంట్లో వారితో శ్రద్ధ చూపించడం చెప్పదగింది ఉన్న కోపాన్ని తగ్గించుకోవాలి అన్ని మనకే తెలుసు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని కాకుండా నలుగురితో పాటు మనం అని ధోరణిలో ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి జీవిత భాగస్వామి తరుపు నుండి లేదా బంధువుల నుండి ఈవారం లాభదాయకంగా ఉందని చెప్పవచ్చు వారి అండదండలు మీకు శ్రీరామరక్ష కాబట్టి ఇటువంటి విషయంలో లేనిపోని అపార్థాలకు దారి తీయకుండా ముందుకు వెళ్లడం చెప్పదగినది వ్యాపారస్తులకు వ్యాపార పరంగా రొటేషన్స్ బాగుంటాయి అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ వారం
బాగుందని చెప్పవచ్చు అయితే భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా సొంతంగా ప్రారంభించాలి అనుకునే వారికి ఈ వారం బాగుంటుంది నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ లో ప్రారంభించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు అయితే కొన్ని ఆరోగ్యకరమైన జాగ్రత్తలు తీసుకోవాలి . ముఖ్యంగా సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహానికి సంబంధించిన విషయంలో చేతి దాకా వచ్చి సంబంధంచే దాటిపోతుంది ఇటువంటి విషయంలో మనోవేదన ఎక్కువవుతుంది అయితే దైవానుగ్రహం వలన కొంచెం మంచి సంబంధమే జరుగుతుంది
సమయం కోసం వేచి చూడడం చెప్పదగింది విద్యార్థి విద్యార్థులకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి చదువు మీద శ్రద్ధ ఎక్కువ పెట్టడం చెప్పదగింది విదేశాల్లో ఉంటున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు అయితే వివాహ విషయంలో కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లాలి ప్రేమ వివాహాలు ప్రేమకు సంబంధించినవి ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది ముఖ్యంగా వీటన్నింటినీ పక్కనపెట్టినది కెరియర్ మీద ఫోకస్ చేయడం చెప్పదగినది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి లేదా విదేశాల్లో ఉంటూ వేరే దేశాలకు వెళ్లాలి అనుకునే ఉద్యోగస్తులకు లేదా వ్యాపారం
చేయాలి అనుకునే వారికి కొంత బాగుంది అని చెప్పవచ్చు మొత్తం మీద మకర రాశి వారికి 55 శాతం బాగుంటే 45% చిన్నా చితక మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి కాబట్టి ఈ రాశి వారికి ఏలినాటిశని నడుస్తుంది కొంతమందికి ఏలినాటిశని బాగుంటుంది కొంతమందికి బాగుండదు అయితే ఏలినాటిశని కాబట్టి శనివారం నాడు నవగ్రహ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ఈ కార్తీకమాసం నెలరోజులు ఉదయం సాయంత్రం ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం మంచిది . అలాగే సోమవారం నాడు 365 వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసి వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్.

కుంభ రాశి: వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి। ఉద్యోగం ఉన్నవారికి ఉద్యోగం పోయే అవకాశం కనిపిస్తుంది అలాగే ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా గోచరిస్తుంది. పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది. మీరు ఏదైతే అనుకుంటారో దానికి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరమైన విషయంలో, వృత్తి-ఉద్యోగాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది ఎందుకంటే కొన్ని విషయాలలో మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి గోచరిస్తుంది
కాబట్టి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని ఆలోచించి సంప్రదింపులు జరిపి ముందుకు వెళ్లడం చెప్పదగినది బంధుమిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది ఏది ఏమైనా బంధుమిత్రులతో కానివ్వండి బయటి వాళ్లతో కానివ్వండి అందరితో కలిసి మెలసి ఉండడం అనేది చెప్పదగినది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయండి మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సంబంధం ఈ వారం కుదురుతుంది రాదు కాదు లేదు అనుకునే వారికి ఈ వారం సంబంధం కుదిరే సూచన కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి రుద్రాభిషేకం చేసుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారంలో మాట పట్టింపులు ఉంటాయి అలాగే జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మసులుకోవడం అనేది చెప్పదగినది ఏమాత్రం పొరపాటు జరిగిన ఈవారం ఇబ్బందులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి స్పైన్ కి సంబంధించినది డస్ట్ ఎలర్జీ గ్యాస్ కి సంబంధించినది ఎక్కువగా ఇబ్బంది పెడతాయి అలాగే మోకాళ్ళ నొప్పులు కూడా ఉంటాయి చాలామంది మోకాళ్ళ నొప్పులు అంటే నరాలకు సంబంధించినది అనుకుంటారు కానీ నరాల బలహీనత ఇమ్యూనిటీ పవర్ తగ్గటం వలన కూడా నొప్పులు రావడం జరుగుతుంది ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి సినీ కళా రంగాల వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు.
గుర్తింపు అనేది లభిస్తుంది . అయితే గుర్తింపుతో పాటు నరదిష్టి అధికంగా ఉంటుంది. వీళ్ళకి ఎదుగుతున్నారు అనే భావన తోటి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి మీ సహనాన్ని ఓర్పుతో ముందుకు వెళ్ళండి దైవానుగ్రహం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి . విదేశాలలో చదువుకుంటున్న వారికి విద్యాపరంగా బాగుంటుంది ఉద్యోగస్తులకు మటుకు ఉద్యోగ పరంగా బాగోలేదని చెప్పవచ్చు. సీనియారిటీ లో ఉన్నవారికి ఉద్యోగం పోయే పరిస్థితి ఉంది , ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఉద్యోగం వచ్చే సూచన ఉంది ఇంక రాదు అని వదిలేసుకున్న వారికి ఈవారం నూతన ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి ముఖ్యంగా స్టూడెంట్స్ కి ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే సూచన కనిపిస్తుంది జాగ్రత్త వహించండి. ఏది ఏమైనా సరే మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా మీకు మీరుగా నిర్ణయాలు తీసుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్లడం చెప్పదగినది ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం , అలాగే ఈ కార్తీకమాసం నెల రోజులు ప్రతిరోజు ఉదయం ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో గాని అష్ట మూలిక తైలంతో గాని దీపారాధన చేయడం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి శనివారం నాడు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి అలాగే కాలభైరవ రూపు మెడలో
ధరించండి కెరియర్ పరంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఏదైనా ఇబ్బందులు ఉంటే చిన్నచిన్నవి తొలగి పరమేశ్వర అనుగ్రహం పొందవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2 కలిసి వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే రంగు తెలుపు

మీన రాశి: ఈ రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరించే విధంగా ఉందని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు చోటు చేసుకుంటుంది వ్యాపారంలో లాభసాటిగా ఉంటుంది కష్టేఫలి అన్నట్టుగా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అయితే ఎవరు ఎన్ని చేసినా వ్యాపారంలో మీకు మీరు గానే సాధించాలని ఎన్నో ఉంటుంది మీకు మీరుగా చేసే ప్రయత్నాలు కలుస్తాయి టీం వర్క్ ని చేసుకుని ముందుకు వెళ్లడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే మీన రాశిలో ఈ వారం మాకు అన్ని బాగానే ఉన్నాయి . అన్నీ మన వల్లే అవుతుంది అనుకోవడం పొరపాటు ఏమైనా టీం వర్క్ లేకుండా ఏ వ్యాపారం నడవదు విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు అలాగే దైవదర్శనాలు ఎక్కువగా చేస్తారు మనోబలంతో ధైర్యంతో ముందుకు వెళ్లగలుగుతారు ఏది ఏం చేసినా జీవిత భాగస్వామి సహాయ సహకారాల వల్ల ఎంతో మేలు జరుగుతుంది ప్రతి చిన్న విషయానికి మనసుకు తీసుకోకుండా కార్యా దీక్షతతో ముందుకు సాగండి దీనివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఈవారం బాగుందని చెప్పవచ్చు షేర్ మార్కెట్ కి దూరంగా ఉండడం చెప్పదగినది వీరికి షేర్ మార్కెట్ కలిసి వస్తుంది. డబ్బులు బాగా వస్తాయని అనుకుంటారు వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది . ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల
అనుకూలతగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి అయితే ఉద్యోగ పరంగా కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రతి విషయంలో తొందరపాటు నిర్ణయాలతో కాకుండా ఆలోచించి నిర్ణయంతో ముందుకు సాగండి అయితే ఆరోగ్యపరమైన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి స్కిన్ కి సంబంధించినది డస్ట్ ఎలర్జీ కఫం ముక్కుకి సంబంధించిన విషయాలు కూడా ఇబ్బంది పెడతాయి కాబట్టి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది విదేశాలకి వెళ్లాలి అనుకునే వారికి కొంచెం ఆలస్యం జరుగుతుంది అప్లికేషన్ లోపం కావచ్చు అప్లికేషన్ పెట్టడం
జాప్యం కావచ్చు పాస్పోర్ట్ కావచ్చు వీసా కావచ్చు ఏదైనా కానివ్వండి ఈవారం కొంత జాప్యం జరిగే విషయంగా చెప్పవచ్చు వివాహం కాని వారికి వివాహ సంబంధం కుదురుతుంది ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సంబంధం రాదు లేదు అనుకున్న సంబంధం ఈ వారం వస్తుంది అయితే అన్ని జాతక పరిస్థితులు చూసుకొని ముందుకు వెళ్లడం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి విదేశీ విద్యకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి . మీకు ఉన్న తెలివితేటలకి మంచి పేరు తెచ్చుకుంటారు ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి ఎందుకంటే కొన్ని కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి వ్యయంలో వక్రించిన శని వృషభంలో వక్రించిన గురువు పంచమంలో
ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన సుజుడు నీచ పడటం వలన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా ఈ రాశి వారికి ఒక 60% బాగుంటే 40 శాతం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి అలాగే మంగళవారం నాడు శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ కార్తీకమాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వలన అష్టమూలికా తైలంతో కావచ్చు నువ్వుల
నూనెతో కావచ్చు దానివల్ల మంచి ఫలితాలే ఉంటాయి . సైంటిఫిక్ గా చెప్పాలి అంటే చలికాలం పెరిగింది అంటే చలి ఎక్కువగా ఉంటుంది ఆ దీపం వెలిగించడం వలన ఆ వేడిని ప్రజ్వలిస్తుంది దానివల్ల కొన్ని క్రిమి కీటకాలు చనిపోతాయి దీర్ఘకాలికంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే వీటివల్ల తొలగిపోతాయి ఇది నేను చెప్పింది కాదు మహానుభావులు చెప్పింది ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతిరోజు ఆ పరమేశ్వరుడికి సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేయడం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4 కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News