మేషం: మేష రాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో కాలం ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. సంతానం యొక్క అభివృద్ధి కోసం ఎక్కువగా శ్రమిస్తారు. కుటుంబ సభ్యుల మరియు మిత్రుల యొక్క అండదండలు మీకు ఎక్కువగా లభిస్తాయి. ఏ పని మొదలుపెట్టిన మేము మీకు అండగా ఉన్నామని పదిమంది ముందుకు వస్తారు ఇది మీ మనో ధైర్యానికి కారణం అవుతుంది. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పౌల్ట్రీ రంగంలోని వారికి వ్యవసాయ రంగంలోని వారికి బాగుంటుంది పంట దిగుబడి కూడా బాగుంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సంతానం యొక్క వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామి యొక్క అండదండలు మీకు లభిస్తాయి. ఏ పని చేసినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి చేస్తారు. సంపాదన తక్కువైనా కానీ గౌరవ మర్యాదలకు లోటు ఉండకూడదు అని అహర్నిశలు శ్రమిస్తారు. స్థిరచరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీరు ఇక రాదు అనుకున్న ధనం చేతికి అందుతుంది. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. రాజకీయరంగంలో ఉన్నవారికి ఉన్నత పదవి లభించే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని ప్రారంభం కాబోతుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం అఘోర పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగిన సూచన. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఏదైనా నూతన పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు స్కై బ్లూ.
వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అనారోగ్యకరమైన సమస్యలు ఏమైనా ఉంటే ఈ వారం తొలగిపోతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. నలుగురిలో ప్రత్యేకంగా ఉండటానికి కూడా ఇష్టపడతారు. ఉద్యోగ పరంగా మరియు వ్యాపార పరంగా స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాలలో స్థిరత్వం లేని చోట ఎంత కాలం పని చేయగలం అని సందేహం కూడా వస్తుంది. నమ్ముకున్న వారిని మోసం చేయకూడదు అని మీ మంచితనమే ఉద్యోగంలో మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. వ్యాపారం కూడా లాభాల బాటలో ఉంటుంది. వివాహ సంబంధాలు చేతి వరకు వచ్చి జారిపోయాయి అన్న బాధ కలుగుతుంది. ఎట్టకేలకు ఒక మంచి సంబంధం కుదురుతుంది. అయితే వివాహ పొంతనలు చూసుకొని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి.
విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కూరగాయలు అమ్మే వారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర వస్తువులు అమ్మే వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలంగా ఉంది. ఉద్యోగ పరంగా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి కానీ మీరు ఆశించిన ధనం మాత్రం ఉండదు. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. క్రెడిట్ కార్డులకి బెట్టింగ్ యాప్ లకి దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి. రియల్ ఎస్టేట్లో లాభాలు అంతంతమాత్రంగా ఉంటాయి. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. ఎవరైనా ఒక పది మందికి అన్నదానం చేయండి మరియు గో సేవ చేయండి దీని వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మంగళవారం మరియు శనివారం రోజున అమ్మవారికి ఆరావళి కుంకుమతో లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు బ్లూ.
మిథునం: మిథున రాశి వారికి ఈ వారం అత్యంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన గృహం కొనుగోలు చేయాలని మీ ఆలోచన ఈ వారం కార్యరూపం దాలుస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. పౌల్ట్రీ రంగం వారికి ఫ్యాషన్ డిజైనింగ్ వారికి చిరు వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. పెద్ద వాళ్ళ సలహాలు సూచనలు లేకుండా ఏ పని చేయరు. వ్యాపారపరంగా అభివృద్ధి బాగుంటుంది. అధిక ధనాన్ని ఖర్చు చేసే శుభకార్యాలను ఘనంగా నిర్వహిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. శుక్రవారం రోజున లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. కళా సాహిత్య రంగాలలో ఉన్న వారికి మీ అంచనాలు నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా 9 కలిసి వచ్చే రంగు ఎరుపు.
కర్కాటకం : కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విలువైన వస్తువులను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సాఫ్ట్వేర్ రంగంలోని వారికి ఫైనల్ రంగంలో ఉన్న వారికి చార్టెడ్ అకౌంట్, సినిమా రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. హెచ్ వన్ బి వీసా కోసం గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఆలస్యం అయినప్పటికీ ఆశించిన ఫలితాలు లభిస్తాయి. వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఉద్యోగ పరంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ మారాలనుకునే వారు ప్రయత్నాలు చేయవచ్చు. వ్యాపార రంగంలో నూతన పెట్టుబడులు పెట్టడానికి కాలం అనుకూలంగా ఉంది.
పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. వైవాహిక జీవితం అన్యోన్యంగా ఉంటుంది. సంతాన పురోగతి బాగుంటుంది. బంధువులతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్టిక్ సయాటికా సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. స్వగృహ నిర్మాణం అనే కల ఈ వారం నెరవేరుతుంది. మీరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈవారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు ముడి పడతాయి. జీవిత భాగస్వామి సహకారంతో ఏదైనా సాధించవచ్చు అని భావిస్తారు. పాస్పోర్టు వీసా వంటి అంశాలు అనుకూలిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలలో ఉద్యోగం చేయాలన్న మీ కోరిక నెరవేరుతుంది. కొంతమంది విషయంలో ప్రేమ సంబంధమైన విషయాలు వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు.
సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి మార్పులు ఉండే పరిస్థితి గోచరిస్తుంది. అనుకోని స్థాన చలనం కనిపిస్తుంది. వ్యాపార పరంగా అభివృద్ధి బాగుంటుంది. ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే మీ సొంతంగానే చేయండి భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. జీవిత భాగస్వామితో విభేదాలు తారాస్థాయికి చేరుతాయి. అపాత్ర దానం చేయడం మంచిది కాదు. అవసరం ఉన్నా లేకున్నా గొప్పలకు పోయి ధనాన్ని అధికంగా వెచ్చించడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల నుండి చికాకులు ఎక్కువ అవుతాయి. ఒకప్పటి మిత్రువులు శత్రువులుగా మారుతారు. వీరికి అర్ధాష్టమ శని ప్రారంభం అయ్యింది కాబట్టి ధన వ్యయం విషయంలో జాగ్రత్త వహించాలి.
8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం అఘోర పాశుపత హోమం చేయటం చెప్పదగిన సూచన. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మంచి పదవి లభించే పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశి వారికి ప్రతమార్తంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి అలాగే సోమవారం రోజున రుద్రాభిషేకం శివాలయంలో చేయించండి. దీనివలన చిన్న చిన్న సమస్యలు కానీ నరదిష్టి కానీ ఫైనాన్స్ పరంగా ఉన్న నష్టాలు కానీ కొంతవరకు తగ్గుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు.
కన్య: కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలోనే ఉండండి వేరే ఉద్యోగం కోసం ప్రయత్నాలు కలిసి రావు. వ్యాపార పరంగా బాగుంటుంది మీరు ఆశించిన లాభాలు కనిపిస్తాయి. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. నూతన గృహం కొనుగోలు చేయాలనుకునే మీ కల నెరవేరుతుంది. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుంటుంది. విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకుంటారు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయరు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అయితే వీసాపరంగా కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది. డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా చాలా అనుకూలంగా ఉంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఆరావళి కుంకుమతో లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయించండి దీనివల్ల మంచి సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు తెలుపు.
తుల: తులా రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన ఉద్యోగ అవకాశాలు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి. వ్యాపార ప్రయత్నాలు ఫలితాలు ఈ వారం నుంచి లాభాలను చూస్తారు. అలాగే కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఏది ఏమైనా సరే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆడదండలు కూడా లభిస్తాయి స్నేహితుల నుంచి బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఈ రాశి వారు సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. వివాహది శుభ కార్యాలలో ఒక కొలిక్కి వస్తారు మంచి సంబంధం కుదురుతుంది. ఎవరి సహాయ సహకారాలు లేకుండానే ఘనంగా చేయాలని ఆలోచన వస్తుంది ఆత్మవిశ్వాసంతో చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి అక్కడ ఉద్యోగం చేస్తున్న వారికి గాని వ్యాపారం చేస్తున్న వారికి గాని సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. గ్రీన్ కార్డు విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎవర్ని పడితే వారిని నమ్మి మోసపోవద్దు గ్రీన్ కార్డు కి వీసా కి అడ్డంకులు ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి. విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా చాలా బాగుంది మీ తల్లిదండ్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. కొంతమంది పిల్లలు డ్రగ్స్ కు అలవాటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇది అందరి పిల్లలకు కాదు కొందరు పిల్లలకు మాత్రమే జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అలాగే రాశిలో జన్మించిన స్త్రీలకు బాగుందని చెప్పవచ్చు. మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి బాగుంది. అనుకోని పదవులు రావటం అనేది ఎంతో సంతోషకరంగా ఉంటుంది. విహారయాత్రలు దైవదర్శనాలు ఎక్కువగా చేస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వలన చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ ఎక్కువగా శ్రమించడం సమయానికి ఆహారం తీసుకోకపోవడం వలన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తి అవకాశాలు ఉన్నాయి. కావున ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ వహించాలి. వ్యవసాయరంగానికి బాగుందని చెప్పవచ్చు. ముఖ్యంగా పౌల్ట్రీ రైతులకు పత్తి రైతులకు బాగుంది. కూరగాయలు అధిక ధరలు కలిగి ఉంటాయి కందిపప్పు మినప్పప్పు ఎక్కువ ధరలు కలిగి ఉంటాయి.వ్యాపారస్తులకు లాభంగా ఉంటుంది. సామాన్య ప్రజలకు కొంత భారంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది 8 కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. పనిమీద వెళ్లేటప్పుడు సోమవారం గాని శనివారం కానీ వెళ్లండి మంచి ఫలితాలు కలిసి వస్తాయి.ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు ఓం నమో నారాయణాయ వత్తులతో దీపారాధన చేయటం మంచిది. జన్మించిన వారు సోమవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమ్మవారికి కుబేర కుంకుమతో కానీఆరావళి కుంకుమతో కానీ అష్టోత్తరంతో పూజలు చేయటం మంచిది. ప్రతిరోజు కాలభైరవాష్టకం పఠించండి ఎందుకంటే మీకు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. మీరు ఎన్ని రకాల సహాయ సహకారాలు చేసిన మీ పైన ఏడుపు ఎక్కువగా ఉంటుంది.
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో బాగుంటుంది. అలాగే విద్యారంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉన్నాయి ఎప్పటినుంచో ఉన్న ఒక స్థిరాస్తి కొనుగోలు విషయం నెరవేరే అవకాశాలు ఉన్నాయి. క్రెడిట్ కార్డులకు లోన్లకు దూరంగా ఉండటం మంచిది. అందరిని నమ్మి గుడ్డిగా మోసపోవద్దు ఆత్మీయులను పక్కనపెట్టి కొత్తవారిని పరిచయం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్తవారు ఎంతవరకు ఉపయోగపడతారు తెలియదు కానీ వారి చేతిలో మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున వారి విషయంలో జాగ్రత్త వహించాలి. మీ సమయస్ఫూర్తిని మీ తెలివితేటలను అందరు మెచ్చుకుంటారు. మిమ్మల్ని అందరూ వాడుకుంటున్నారు అనే విషయం మీకు తెలియదు కాబట్టి పొగడ్తలకు పోకుండా వాస్తవాన్ని గ్రహించి ముందుకు వెళ్లడం మంచిది. వ్యాపార విషయంలో వ్యాపారంపరంగా బాగుంటుంది. ఏదైనా కొత్త వ్యాపారం చేసేటప్పుడు నలుగురు సహాయ సహకారాలు నలుగురి ఆలోచనలతో ముందుకు వెళ్ళటం మంచిది ఎవరు ఎన్ని చెప్పినా మీ ధైర్యాన్ని నమ్ముకుని ముందుకు వెళ్లడం మంచిది అలాగే విద్యా రంగానికి సంబంధించిన విషయాలు బాగున్నాయి.
ఈ రాశి వారు ఆరోకో విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతా బానే ఉంది కానీ ఎందుకు ఇలా జరుగుతుందో తెలియని విషయం గోచరిస్తుంది. అయితే ఏది ఏమైనా సరే ఆ భగవంతుడు తోడు ఉన్నాడు అని ముందుకు వెళ్ళటం మంచిది. విదేశంలో ఉన్నవారికి కొంత జాప్యం కలుగుతుంది. గ్రీన్ కార్డు విషయంలో గాని హెచ్ వన్ బి వీసా విషయంలో గాని కొంత ఆలస్యం అవుతుంది. పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి స్థిరాస్తి కొనాలని ఆలోచన నెరవేరుతుంది. డాక్యుమెంట్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లోన్ విషయంలో కొంత ఆలస్యం అయినా చివరకు నెరవేరుతుంది. సొంతింటి కల నెరవేరుతుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. మీరు ఎంత చేసినా మీ పట్ల కృతజ్ఞత భావం అనేది ఏర్పడదు. దీనివలన మీరు మనోవేదనకు గురి అవుతారు అయితే ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలుస్తాయి. ఉద్యోగస్తులకు స్థానచలనం కనిపిస్తుంది. అయితే కొందరికి ఉన్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం బాగోలేక పోవటం మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురిచేస్తుంది. మీ ప్రమేయం లేకుండా మీకు నిందలు వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు దైవారాధన చేసుకోవడం అనేది మంచిది. ఎవరు ఎన్ని చెప్పినా జీవిత భాగస్వామితో కలిసి చర్చించి ముందుకు వెళ్ళటం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తన పని మీద వెళ్లేటప్పుడు బుధవారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం పఠిoచడం మంచిది. అలాగే కనకదు ధారా స్తోత్రం కూడా పటించండి ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపా.రాధన చేయడం మంచిది
ధనస్సు: ధనస్సు రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇంటా బయట మంచి అభివృద్ధి కనిపిస్తుంది. బంధువర్గంలో స్నేహ వర్గంలో మంచి అనుకూలత ఉంటుంది అయితే పెద్దవారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంత సానుకూలత ఉన్న నిదానంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమయ్యింది. అయితే ఏ పని మొదలుపెట్టిన నిదానంగా సాగటం జరుగుతుంది మానసిక ఆందోళన ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల కూడా తగు జాగ్రత్తలు వహించాలి 8 శనివారాలు శనికి తైలాభిషేకాలు చేయించడం మంచిది. అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం మంచిది. బంధువర్గంలో మీ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు ఈ రాశి వారికి అయిన వాళ్లు వెన్నుపోటు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బంధవర్గంలో కానీ స్నేహితులలో కానీ మీ స్థాయికి మించి సాయం చేయడం మంచిది కాదు. కావున సాయం చేయకుండా ఉండటమే మంచిది. కుటుంబంలో ఒకరికి విద్యాపరంగా సహాయం చేస్తారు వారి చదువు కోసం అయ్యే ఖర్చులను మీరే స్వయంగా భరిస్తారు. వివాహ సంబంధాలు ఒక కొలిక్కి వస్తాయి చేజారిపోయిన సంబంధం వల్ల తిరిగి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇది మీకు చాలా సంతోషకరమైన విషయం ఉద్యోగంలో స్థిరత్వం లోపిస్తుంది. సహ ఉద్యోగుల పనితీరు మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురిచేస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకొని నిలబడటం అనేది మంచిది విదేశాలకు వెళ్లాలనుకునే వారు ప్రయత్నాలు కొనసాగించవచ్చు.
విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు మొదలవుతాయి. వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ చార్టెడ్ అకౌంటెంట్ వాళ్లకు కలిసి వస్తుంది. ఉద్యోగం కోసం కొత్త కోర్సులు నేర్చుకునే వారికి ఇది సరైన సమయం ఉన్న ఉద్యోగం కంటే మెరుగైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. భాగస్వామి యొక్క అండదండలు మీకు లభిస్తాయి. అయితే మీకు నరదృష్టి అధికంగా ఉంటుంది. బంధు వర్గంలో కానీ స్నేహ వర్గంలో కానీ మీరు ఎన్ని సహాయ సహకారాలు చేసిన మీ పట్ల ఏడుపు ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు ప్రతి రోజు శని స్తోత్రం పాటించండి ఎంత పఠిస్తే అంత మంచి ఫలితాలు కలుగుతాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. భజరంగంలో ఉన్నవారికి కొంత గడ్డుకాలం ఉందని చెప్పవచ్చు. చేతి దాకా వచ్చినా ఉద్యోగాలు చేజారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉన్న ఉద్యోగాలలో కూడా టెర్మినేషన్స్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. వ్యవసాయ రంగానికి చెందిన వారికి ఆకుకూరలలో కూరగాయలలో కలిసి వస్తుంది. హోటల్ బిజినెస్ వారికి స్ట్రీట్ ఫుడ్, వెoడర్స్ కి అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు వస్తాయి రాశి వారు ముఖ్యంగా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయడం మంచిది. అలాగే ప్రతిరోజు కాలభైరవాష్టకం చదువుకోవటం మంచిది. అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి ఆరావళి కుంకుమతో అష్టోత్తరం చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి.
మకరం: మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వివాహ సంబంధానికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎప్పటినుంచో సొంతిల్లు కొనాలనే కళ నెరవేరుతుంది. అయితే అది చేతి దాకా వచ్చి చేజారిపోయి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రావాల్సిన ధనం సమయానికి రాక కొంత ఇబ్బంది కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్నేహితులతో కూడా విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తోటి ఉద్యోగుల పై అధికారులతో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది మీ ప్రమేయం లేకుండానే మీరు ఇతరులకు శత్రువు అవుతారు. మిమ్మల్ని కిందికి దించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కష్టేఫలి అన్న విధంగా మీరు ముందుకు వెళతారు . వైద్యరంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. వైద్యరంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్లే వారికి లోను మంజూరు అవుతుంది. తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకం వృధా కావొద్దు అనే ధోరణితో మీరు ముందుకు వెళ్లి ప్రయోజకులు అవుతారు. ఎలాగైనా తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలని పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు.
ఏది ఏమైనా సరే విద్యారంగంలో ఉన్నవారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంది. పౌల్ట్రీ రంగం వారికి అనుకూలంగా ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. వస్తుంది అనుకున్న పదవి చేజారిపోతుంది. ఒక స్త్రీ వల్ల మీరు ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది. ప్రమేయం లేకుండానే వారు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తారు. విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది విదేశాల్లో ఉన్న వారికి మంచి సంబంధాలు కుదురుతాయి అప్పు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అవసరానికి మించి ఖర్చు చేయకపోవడం మంచిది. రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ మనసు నిలకడగా ఉండదు ఏదో తెలియని ఆందోళన భయం ఏర్పడుతుంది ప్రత్యర్ధులు ఎక్కడో లేరు ఇంట్లోనే ఉన్నారని గ్రహిస్తారు సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. రాశి వారు లాటరీలకి షేర్ మార్కెట్ కు దూరంగా ఉండాలి బంగారం మీద కానీ భూమి మీద కానీ పెట్టుబడి మంచిది .బంధువులతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. స్థిర చరాస్తులు రావలసిన సమయంలో కలిసి వస్తాయి. మీకు పెద్దల నుంచి రావాల్సిన ఆస్తి పంపకం విషయంలో అన్యాయం జరుగుతుంది. బంధువులే మీకు అన్యాయం చేస్తారు ఈ మంచితనమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్ సమస్యలు ,మోకాళ్ల నొప్పులు కొంత ఇబ్బందికి గురిచేస్తాయి. రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఒకటి, కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్. పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం నాడు బయటకు వెళ్ళండి మంచి ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి మంగళవారం నాడు శనివారం నాడు నిమ్మకాయ లో దీపారాధన చేయండి ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదవటంకానీ వినడం కానీ చేయండి.
కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒక విషయంలో తమ జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న తప్పు జరిగిన మీరే బాధ్యులు అని నిందిస్తారు సంతాన విషయంలో వక్రమార్గంలో వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ధన వ్యయం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి రూపాయి ఖర్చు అయ్యే విషయం లో పది రూపాయల ఖర్చు అవుతుంది. కాబట్టి ఖర్చు విషయంలో జాగ్రత్త వహించండి. వృత్తి ఉద్యోగ పరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. పై అధికారులతోటి మనస్పర్ధలు తలెత్తుతాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం వెతుకుందామనే ఆలోచన మంచిది కాదు ఉన్న ఉద్యోగమే చేయటం మంచిది. వ్యాపారం అంతంత మాత్రమే ఉంటుంది వ్యాపారపరంగా భాగస్వాముల తోటి స్నేహితుల తోటి కొంత నష్టం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అందరిని నమ్మి గుడ్డిగా మోసపోకండి. డాక్యుమెంట్ విషయంలో సంతకాల విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి అసలు విషయంలో కొంత జాగ్రత్త వహించండి ఏం లేకుండానే మీ సంతకాలు సేకరించి మిమ్మల్ని మోసం చేసి అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారం ప్రారంభించిన వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని చేసుకోవడం మంచిది విదేశ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. విదేశాల్లో చదువుకునే వారికి ఉద్యోగం చేసే వారికి అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
ఒక ఆడపిల్ల వివాహ విషయంలో ఒకరికి సహాయ సహకారాలు చేస్తారు ఒకరి వివాహ విషయంలో బాధ్యత వ్యవహరిస్తారు. ఈ విషయం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. వాటి కుటుంబ పరంగా చిక్కులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించటం అఘోర పశుపతి హోమం చేయించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి వివాహం కాని వారికి సంబంధం కుదురుతుంది. అయితే వచ్చిన సంబంధాలలో జాగ్రత్తలు తీసుకొని మంచి సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రాశి వారు జాతకాలు చూపించుకొని సంబంధం కలుపుకోవడం మంచిది లేకుంటే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి రాశి వారికి నూతన వాహన యోగం ఉంది. కానీ వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అంతంత మాత్రాన్నే ఉంది పిల్లల భవిష్యత్తు మీద దృష్టి సారించండి. వర్గంలో మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త వహించండి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మార్పులు వస్తాయి స్కాలర్షిపులు కూడా వస్తాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్లి చదువుకునే వారికి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు ఈ కాలమ్ అనుకూలంగా ఉంది. వైద్యరంగంలో ఉన్నవారికి చార్టెడ్ అకౌంటెంట్ వారికి సాఫ్ట్వేర్ రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ వారికి ఫ్యాషన్ డిజైనింగ్ అలాగే వ్యవసాయ రంగాలకు ఈవారం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం శనివారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి. ఓం నమో నారాయణాయ వత్తులతో దీపారాధన చేయండి. అలాగే శుక్రవారం నాడు శనివారం నాడు అరటినార వత్తులతో దీపారాధన చేయడం మంచిది సాయంత్రం పూట నిమ్మకాయ డొప్పలలో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం మంచిది.
మీనం: మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. సహ ఉద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. మీరు చేసిన మంచే మిమ్మల్ని కాపాడుతుంది. ఉద్యోగ స్థానచరణ కోసం ప్రయత్నం చేస్తారు ఉన్న ఉద్యోగమే మంచిది కొత్త ప్రయత్నాలు మానుకోండి. కొందరితో విరోధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈ వారం మంచి లాభాలు ఉన్నాయి. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. మంచి సంబంధం కుదురుతుంది. మిత్రుల సహాయ సహకారాలు బంధువుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఎప్పుడో విడిపోయిన బంధుత్వాలు మళ్ళీ కలుస్తాయిm బంధువులలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సంతాన ప్రయత్నాలు ఫలితాలు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్య రంగానికి సాఫ్ట్వేర్ రంగానికి అనుకూలంగా ఉంది. మీరు కన్న కలలు నెరవేరుతాయి. నూతన గృహానికి సంబంధించిన ప్రయత్నాల్లో ఫలిస్తాయి హౌసింగ్ లోన్లు సమయానికి అందుతాయి జీవిత భాగస్వామి సాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఎవరు ఏమనుకున్నా సరే పదిమందికి సహాయ పడాలి అనే తత్వం తోటి మీరు ముందుకు వెళతారు. పదిమంది మీ సొంత ఖర్చులతో చదివించాలని ఆలోచన చేస్తారు విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారికి స్కాలర్షిప్లు లభిస్తాయి అలాగే మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది. ఏమైనాప్పటికీ మీ తెలివితేటలతో మీకున్న సంకల్ప బలంతో ముందుకు వెళతారు మీరు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి.
రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. పిల్లల చదువు పట్ల తగు జాగ్రత్త తీసుకుంటారు. ఆడపిల్లల వివాహ సంబంధ ప్రయత్నాలు కలుస్తాయి. అయితే ఇక్కడ జాతక పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిది. నూతన పెట్టుబడుల జోలికి వెళ్లకుండా ధనాన్ని పొదుపు చేసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు ఉన్న చివరకు ఫలిస్తాయి ఏదైనా సరే మీదే పై చేయి ఉంటుంది. అయితే ఏదైనా సమస్య వచ్చినపుడు సానుకూలంగా ఆలోచించటం ఒకరి సలహాలను ఒకరు పాటిస్తూ ముందుకు వెళ్ళటం మంచిది ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఏవైనా పనులు ఉంటే పరిష్కారం అవుతాయి. రంగంలో ఉన్నవారికి ఒక అనుకొని పదవి లభిస్తుంది. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుంది అయితే కొంచెం నష్టం వాటిల్లు అవకాశం ఉంది. పండ్ల వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు ఆకుకూరల వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వారికి కన్సల్టెన్సీ వారికి ఈ వారం బాగుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసివచ్చే రంగు మెరూన్. పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం గురువారం వాడు వెళ్ళండి మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ రాశి వారు ప్రతినిత్యం ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయటం మంచిది. అలాగే మంగళవారం నాడు శనివారం నాడు ఆంజనేయస్వామికి ఆకు పూజ చేయటం మంచిది. బుధవారం నాడు వినాయకుడికి గరికతో పూజలు చేయించండి. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ చిన్న చిన్న అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి.