Friday, November 22, 2024

ఒడిదుడుకుల్లో మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

Weekly Stock Market Update

గతవారం 381 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను చూస్తున్నాయి. గత వారం మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఆగస్టు 22(సోమవారం) నుంచి 26(శుక్రవారం) వరకు సెన్సెక్స్ 381 పాయింట్లు మాత్రమే పెరిగింది. గతంలో ఐదు వారాలు వరుసగా పెరిగిన సూచీలు 60 వేలు, 18 వేలు కీలక మార్క్‌లను చూశాయి. కానీ మళ్లీ పతనం అయిన తర్వాత స్వల్పంగా పుంజుకుంటున్నాయి. వారాంతం శుక్రవారం దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ గురువారం తీవ్ర అమ్మకాలను చూడగా, శుక్రవారం కాస్త పుంజుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 59.15 పాయింట్లు పెరిగి 58,833 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 36.45 పాయింట్లు పడిపోయి 17,558 పాయింట్ల వద్ద స్థిరపడింది. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, టైటాన్, ఇన్ఫోసిస్‌లు మార్కెట్ పెరుగుదలకు దోహదం చేశాయి. మరోవైపు ఏసియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, డా.రెడ్డీస్ ల్యాబ్‌లు నష్టాలను నమోదు చేశాయి.

అయితే శుక్రవారం అమెరికా రిజర్వు చైర్ జెరోమ్ పావెల్ ఇచ్చిన సందేశం ఇన్వెస్టర్లను ఆందోళన కల్గించేలా ఉంది. వచ్చే నెలల్లో ఫెడ్ పెద్ద మొత్తంలో వడ్డీ రేటు పెంపు ఉండనుందని, రాబోయే నాలుగు దశాబ్దాల్లో అత్యధిక స్థాయి ద్రవ్యోల్బణం కట్టడీపైనే తమ దృష్టి ఉంటుందని అన్నారు. ఫెడ్ కఠిన నిర్ణయాల వల్ల రుణాలకు సంబంధించి అనేక కుటుంబాలు, వ్యాపారాలు బాధపడవచ్చని పావెల్ అంగీకరించారు. అధిక రేట్లతో ఆర్థిక వ్యవస్థ మందగించవచ్చని, ఉపాధి తగ్గవచ్చని అన్నారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందు ప్రయత్నాలు పెంచామని అన్నారు. ధర స్థిరత్వం పునరుద్ధరణలో వైఫల్యం అత్యధిక బాధకు దారీ తీస్తుందని అన్నారు. గతంలో రేటు పెంపు నెమ్మదిగా ఉంటుందని చెప్పిన పావెల్ ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తామని చెప్పడం ఇన్వెస్టర్లను నిరాశపర్చింది.ఇది అమెరికా మార్కెట్లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వర్థమాన దేశాల మార్కెట్లను ప్రభావితం చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News