Tuesday, November 5, 2024

లాక్‌డౌన్ల వల్ల పెరిగిన డయాబెటిస్ ముప్పు!

- Advertisement -
- Advertisement -

Increased risk of diabetes due to lockdowns

లండన్: కరోనా కారణంగా లాక్డౌన్లు విధించడంతో చాలా మంది బరువు పెరుగుతున్నారని, ఫలితంగా టైప్2 డయాబెటిస్‌కు గురి కావచ్చని తాజా అధ్యయనం పేర్కొంది. బ్రిటన్‌లో నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ హెచ్ ఎస్) చేపట్టిన మధుమేహ నివారణ కార్యక్రమాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇందులో భాగంగా 40 ఏళ్ల లోపు వారి డేటాపై అధ్యయనం చేశారు. మూడేళ్ల ముందు ఈ కార్యక్రమంలో చేరిన వారితో పోలిస్తే తాజాగా ఇందులో పాలుపంచుకున్న వారి బరువు సరాసరిన 3.6 కిలోల మేర పెరిగినట్టు గుర్తించారు. శరీరం బరువు కిలో మేర పెరిగినా మధుమేహం ముప్పు 8% పెరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

లాక్‌డౌన్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు బరువు పెరిగారు. దీనివల్ల టైప్ -2 మధుమేహమే కాకుండా దానితో ముడిపడిన క్యాన్సర్, అంధత్వం, గుండెపోటు, పక్షవాతం, వంటి వాటి ముప్పు కూడా పెరిగిందని ఎన్హెచ్‌ఎస్ డైరెక్టర్ జోనాథన్ వాలాబీ తెలిపారు. టైప్ 2 మధుమేహం అనేది చాలా సంక్లిష్టమైన పరిస్థితి. దీనికి వయసు, కుటుంబం ఆరోగ్య నేపథ్యం, జాతి వంటి అంశాలు ప్రభావం చూపుతాయి. వీటితో పోలిస్తే ఊబకాయం అతిపెద్ద ముప్పు. ఇది 80-85 శాతం మేరకు మధుమేహానికి చేరువ చేస్తుందని డాన్ హోవర్డ్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. బ్రిటన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ది లాన్సెలో ప్రచురితమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News