జీలకర్ర కేవలం మసాలా కోసం మాత్రమే కాకుండా అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. దీనిని వాడేదానిని బట్టి ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. జీలకర్ర నీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. జీలకర్రలో అనేక గుణాలు ఉంటాయి. ఇవి శరీర జీవక్రియను పెంచుతాయి. అంతేకాకుండా.. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి.
ఇప్ప్పుడు బరువు తగ్గించే జీలకర్ర నీటిని తయారుచేసే వివిధ మార్గాలను తెలుసుకుందాం.
జీలకర్ర నీటిని తయారు చేసే విధానం
జీలకర్ర నీటిని తయారు చేయడానికి జీలకర్ర – 1 టీస్పూన్, నీరు – 1 కప్పు కావాలి. ముందుగా ఒక పాన్‌లో 1 కప్పు నీరు పోసి మరిగించాలి. నీరు మరిగిన తర్వాత అందులో 1 టీస్పూన్ జీలకర్ర వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 5-10 నిమిషాలు మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడపోసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇది జీర్ణక్రియ, జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
జీలకర్ర-నిమ్మకాయ నీటిని ఎలా తయారు చేయాలి?
అన్నింటిలో మొదటిది పాన్లో నీరు మరిగించాలి. ఆ తర్వాత పాన్లో 1 టీస్పూన్ జీలకర్ర వేసి, 5-10 నిమిషాలు మరిగించాలి. మరిగిన తర్వాత నీటిని వడపోసి అందులో నిమ్మరసం కలపాలి. బాగా మిక్స్ చేసి గోరువెచ్చగా తాగాలి. నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని నిర్విషీకరణ చేసి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది.