దేశంలోని చాలామందికి ఊబకాయం త్రీవమైన సమస్యగా మారిపోతుంది. దీంతో వారు బయటికి రావాలన్నా సిగ్గుపడుతున్నారు. ఇది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రజల్ని ప్రభావితం చేస్తోంది. అసలు ఊబకాయం అంటే ఏమిటి? అధిక బరువు ఉన్న వ్యాధిని భూబకాయం అంటారు. శరీరంలోని అధిక కొవ్వు పేరుకుపోవడం వలన ఊబకాయం వస్తుంది. ఇది ఎక్కువగా 21 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే వస్తుంది. కానీ, ఇటీవల ఈ ఊబకాయం పిల్లల్లో కూడా కనిపిస్తోంది. ఉబకాయం కారణంగానే గుండె జబ్బులు, మధుమేహం, ఐబీపీ వండి ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
మొదటగా చక్కెరతో చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. శరీరంలో అధిక కొవ్వు పేరుకు పోవడానికి ఇదే ప్రధాన కారణమని చెప్పవచ్చు. దీనికి బదులుగా పండ్లు, తేనే వాడవచ్చు. అంతేకాకుండా.. పిండితో చేసిన వంటకాలను తినడం పూర్తిగా ఆపివేయాలి. పిండితో చేసిన జంక్ ఫుడ్స్ తీసుకోవడం వలన కూడా శరీరంలో కొవ్వు పేరుకు పోతుంది.
ఒకవేళ మీరు ఊబకాయాన్ని, బరువు తగ్గాలనుకుంటే మీరు కచ్చితంగా మూడు పూటలా రైస్ తీసుకోకూడదు. దీనిని రోజు తింటే బరువు తగ్గడం కష్టమవుతుంది. దీని అదనంగా మీ డైట్ లో రోటిని చేర్చుకోవచ్చు. అంటజేకాకుండా.. ఆహారంలో ప్రోటీన్ ఉండేటట్లు చూసుకోండి. అది కేలరీలను వీలైనంతగా తగ్గిస్తుంది. ఎందుకంటే అధికంగా కేలరీలు ఉండే ఆహారానికి తీసుకుంటే బరువు వేగంగా పెరుగుతాం. ఇదే సమయంలో అధిక కొవ్వు పరిమాణం కూడా పెరుగుతుంది.
బరువు తగ్గాలంటే అధికంగా నీరు త్రాగాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రతిరోజు రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగితే సరిపోతుంది. కానీ, ఊబకాయంతో బాధపడేవారు రోజుకు మూడు లీటర్ల కంటే ఎక్కువ త్రాగుతే చాలా మంచిదని చెబుతున్నారు