Monday, January 20, 2025

కామన్వెల్త్ క్రీడల్లో రెండో రోజున భారత్ బోణీ

- Advertisement -
- Advertisement -

Sanket Sargar

బర్మింగ్ హామ్: బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేట ప్రారంభమయింది. వెయిట్ లిఫ్టింగ్ లో సంకేత్ సర్గర్ రజతం సాధించాడు. సంకేత్ ఇవాళ జరిగిన 55 కేజీల కేటగిరీలో రెండో స్థానంలో నిలిచాడు. సంకేత్ స్నాచ్ అండ్ జెర్క్ లో మొత్తం 248 కిలోల (113, 135) బరువెత్తి రజతం అందుకున్నాడు. దురదృష్టకరమైన అంశం ఏమిటంటే స్నాచ్ అండ్ జెర్క్ రెండో పర్యాయంలో సంకేత్ గాయపడ్డాడు. దాంతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. ఈ పోటీలో మలేసియాకు చెందిన బిబ్ అనిక్ మొత్తం 249 కేజీలతో స్వర్ణం సాధించాడు. తన ప్రదర్శనతో బిబ్ అనిక్ కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పాడు. ఇందులో శ్రీలంకకు చెందిన దిలంక యోదగె 225 కేజీలతో కాంస్యం దక్కించుకున్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News