Wednesday, January 22, 2025

చివరికి న్యాయమే గెలిచింది: మనీష్ సిసోడియా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడారు. చివరికి న్యాయమే గెలిచిందని, కేజ్రీవాల్ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సేవలో ఉన్న ముఖ్యమంత్రిని జైలులో పెట్టారని, ఇంతకు మించిన పాపం ప్రజాస్వామ్యంలో జరగలేదని, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంతో న్యాయం జరిగిందని, ఆ మహనీయుడికి ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. అవినీతి చేశారనో? తప్పు చేశారనో? కేజ్రీవాల్‌ను అరెస్టు చేయలేదని, కేజ్రీవాల్‌ను జైలులో పెడితే ఆప్ పార్టీ ముక్కలవుతుందనుకున్నారని, ఆప్ ప్రభుత్వం కూలేందుకు బిజెపి కుట్రలు చేసిందని మనీష్ సిసోడియా ఆరోపణలు చేశారు.

ఎంత ఇబ్బంది పెట్టినా ఆప్ నేతలు ధైర్యంగా ఉన్నారని, సంక్షోభ పరిస్థితుల్లో అండగా నిలిచిన ఆప్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కుతంత్రాలతో ఆప్‌ను దెబ్బతీసేందుకు బిజెపి ప్రయత్నాలు చేసిందని, సిఎం కేజ్రీవాల్ ఏ మాత్రం బెదరలేదని, న్యాయం వైపే ఉన్నారని, న్యాయం గెలిచినందుకు సంతోషంగా ఉందని, న్యాయం కోసం పోరాడేవారికి ఉత్సాహం ఇచ్చినట్లయిందని సిసోడియా తెలిపారు. ఢిల్లీ మద్యం సిబిఐ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించింది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా, ఎంఎల్ సి కవితకు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 21 రాత్రి ఆమ్ ఆద్మీపార్టీ నేత, సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఇడి అధికారులు అరెస్టు చేసిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News