Monday, December 23, 2024

హైదరాబాద్‌కు విచ్చేస్తున్న.. వాట్సాప్ యూనివర్సిటీకి స్వాగతం: కెటిఆర్ సెటైర్స్

- Advertisement -
- Advertisement -

Welcome to WhatsApp University over BJP Meeting in Hyd: KTR Tweet

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీపై, బిజెపిపై మంత్రి కెటిఆర్ సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను ఎద్దేవా చేస్తూ చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందమైన హైదరాబాద్ నగరంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశానికి వాట్సప్ యూనివర్సిటీకి స్వాగతం అంటూ మంత్రి కెటిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఝమ్లా జీవులందరూ (అబద్దాల హామీకోరులు) మా దమ్ బిర్యాని చాయ్‌ను ఆస్వాదించడం మర్చిపోవద్దని మంత్రి కెటిఆర్ సూచించారు. తెలంగాణలోని యాదాద్రి ఆలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, కాళేశ్వరం ప్రాజెక్టు, ఐటి హబ్‌ను సందర్శించాలని కోరారు. మీ మీ రాష్ట్రాల్లో వీటిని అమలు చేసేందుకు కనీసం ప్రయత్నించండి అంటూ వాటి ఫోటోలను మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు.

Welcome to WhatsApp University over BJP Meeting in Hyd: KTR Tweet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News