Thursday, January 23, 2025

బిఆర్‌ఎస్‌తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం

- Advertisement -
- Advertisement -
  • రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

గోదావరిఖని: బిఆర్‌ఎస్‌తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం రాత్రి గోదావరిఖని పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో పాలకుర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడిద నరేష్, బుడిద మనోహర్, హర్షవర్ధన్, నంది శ్యాం, రమేష్, దుర్గం హరీష్ నారాయణతో పాటు 50 మంది పాలకుర్తి సర్పంచ్ దుర్గం జగన్ ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే చందర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో, రాష్ట్రంలో బిఆర్‌ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బిఆర్‌ఎస్ లో భారీగా చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం కేసీఆర్‌ని హ్యాట్రిక్ సీఎంగా చేయడమే లక్ష్యంగా తమతో కలిసి నడుస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీపై, నాయకత్వంపై నమ్మకాన్ని కోల్పోయిన పార్టీ నాయకులు, కార్యకర్తలు బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. రామగుండంలో బిఆర్‌ఎస్ పార్టీ గెలుపు ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కౌశిక హరి, ఇంజపురి నవీన్, కార్పొరేటర్ దాతు శ్రీనివాస్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News