Tuesday, November 5, 2024

ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయి: వెంకట్రామిరెడ్డి

- Advertisement -
- Advertisement -

Welfare benefits to every one

హైదరాబాద్: తెలంగాణను అణువణువు అర్థం చేసుకున్న వ్యక్తి సిఎం కెసిఆర్ అని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డి తెలిపారు. సిద్దిపేట క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి సోమవారం త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వెంకట్రామి రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిద్దిపేటలో జరిగిన ప్రతీ కార్యక్రమాన్నీ ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అనేది సిఎం కెసిఆర్ విజన్‌తో తాము నడుచుకున్నామని తెలియజేశారు. సిఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావు ఆలోచనలకు అనుగుణంగా సిద్దిపేటను అభివృద్ధిలో దేశంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దామని, ఎన్నో కొత్త ప్రాజెక్టలకు సిద్దిపేట జిల్లా వేధికగా మారిందని ప్రశంసించారు.

సిఎం కెసిఆర్ ఆలోచనా విధానంతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయని, దేశంలోని ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూశానని, తెలంగాణలో అంతకంటే ఎక్కువ అభివృద్ధి జరుగుతోందని వెంక‌ట్రామిరెడ్డి పొగిడారు. అందులో తాను భాగస్వాముడిని కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ముంపు గ్రామాల ప్రజలు ఖాళీ చేసే సమయంలో ఇబ్బందులు లేకుండా చూశామని, తొమ్మిది వేల కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భూసేకరణ చేశామని, తన 26 ఏళ్ల సర్వీస్‌లో ఈ ఏడేల్లు తనకు సంతృప్తినిచ్చిందని, ఏడేళ్లలో సిఎం కెసిఆర్ అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేశానని, సిఎం కెసిఆర్ చేస్తున్న అనేక కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని వెంక‌ట్రామిరెడ్డి ప్రశంసించారు. సిఎం కెసిఆర్ ఆదేశాలు రాగానే టిఆర్‌ఎస్‌లో చేరుతానని ప్రకటించారు. సిఎం కెసిఆర్ ఏ పదవి ఇచ్చినా తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. వెంకట్రామి రెడ్డికి ఎంఎల్ సి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News