Thursday, January 23, 2025

బాల్కొండలో ఘనంగా సంక్షేమ దినోత్సవ సంబురాలు

- Advertisement -
- Advertisement -

బాల్కొండ : బాల్కొండ నియోజక వర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా లబ్ధిదారులతో జరిగిన సంక్షేమ సంబురాల్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంబురాల్లో పాల్గొనడానికి వచ్చిన మంత్రికి డప్పు చప్పుళ్లతో, మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఘన స్వాగతం పలికారు.

బాల్కొండ పాండురంగ ఫంక్షన్ హాల్ సమావేశంలో పలువురు వృద్ధులను, మహిళలను సంక్షేమ పథకాల లబ్ధ్దిదారులను ఆత్మీయంగా పలకరించారు. బాల్కొండ నియోజక వర్గంలో అందుతున్న సంక్షేమ పథకాలు ఆసరా పెన్షను కళ్యాణ లక్ష్మి, గొర్రెల పంపిణీ తదితర పథకాల కర పత్రాలు ఆవిష్కరించారు. ఈసందర్భంగా పలువురు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కుల వృత్తులకు నేటి నుంచి కొత్త పథకం ప్రారంభం :
బిసి కుల వృత్తుల కుటుంబాలకు కెసిఆర్ ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఆర్థిక సహాయం కార్యక్రమం నేటితో ప్రారంభం అయ్యింది. అవుసుల, వడ్రంగి, చాకలి, ఆరే కటిక కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఐదుగురికి చెక్కులు అందజేశారు. కెసిఆర్ ప్రభుత్వం కులవృత్తులకు భరోసా కల్పించేందుకు ఆర్థికంగా తోడ్పాటు అందించే కార్యక్రమం నేడు శ్రీకారం చుట్కున్నామని మంత్రి వెల్లడించారు. బాల్కొండ నియోజక వర్గంలో ఈ ఏడాది 1000 మందికి, రానున్న రోజుల్లో మిగతా కుల వృత్తుల అర్హులైన లబ్దిదారులకు 1లక్షా రూపాయల చొప్పున అందజేస్తామని చెప్పారు. పేదల సంక్షేమం కోసం కెసిఆర్ కంటే గొప్పగా ఎవరూ ఆలోచన చేయలేరని మంత్రి వేముల స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సంక్షేమ పథకాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News