Monday, December 23, 2024

సిఎం కెసిఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమం

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని: సిఎం కెసిఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమం అందుతూ… ప్రతీ ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుందని బిఆర్‌ఎస్ జిల్లా అదధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో తెలంగాణ సంక్షేమ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు.

తెలంగాణలో సంక్షేమ పథకం అందని గడప, అభివృద్ధి జరగని ప్రాంతం లేదని అన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఆసరా పెన్షన్ అందిస్తూ వారు గౌరవ ప్రదంగా జీవించేందుకు తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలతో పేదింటి ఆడ పిల్లల పెండ్లికి 1,00,116 రూపాయలను అందిస్తూ వారి కుటుంబానికి సిఎం కెసిఆర్ పెద్ద దిక్కుగా నిలుస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలో 78లక్షల మందికి పైగా వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని అన్నారు. ప్రభుత్వ అందిస్తున్న ప్రతీ సంక్షేమ పథకాన్ని అర్హులైన వారందరికీ అందిస్తున్నామని చెప్పారు. రామగుండం నియోజక వర్గ ప్రజల సంక్షేమమే లక్షంగా, ఈ ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా తాను ముందుకు సాగుతున్నానని చెప్పారు. ఈ సంక్షేమ పాలన ఇలానే కొనసాగాలంటే కెసిఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మినారాయణ, మున్సిపల్ కమీషనర్ సుమన్ రావు, కార్పొరేటర్లు దొంత శ్రీనివాస్, శంకర్ నాయక్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News