Thursday, January 23, 2025

తెలంగాణలో గడపగడపకు సంక్షేమం

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ హయాంలోనే పేదలకు,రైతులకు మేలు
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
కోస్గి: సిఎం కెసిఆర్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర సంపదను పెంచి రాష్ట్ర వ్యాప్తంగా గడపగడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కొడంగల్ ఎమ్మెల్యే ప ట్నం నరేందర్‌రెడ్డి అన్నారు.శుక్రవారం పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబురాల వేడుకలకు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు వృద్ధాప్య పెన్షన్లు రూ.75, రూ200లుగా ఉందేదని తెలంగాణ వచ్చాక సిఎం కెసిఆర్ వాటిని పదింతలు చేసి వృద్ధులకు, ఒంటరి మహిళలకు, బీడి,గీత కార్మికులకు సైతం రూ.2016,వికలాంగులకు రూ .3016 అందించి వారికి ఆసరా అయ్యారని అన్నారు.వివిధ పెన్షన్ల రూపంలో ప్రతినెలా కోస్గి మండలానికి కోటి రూపాయాలు,మున్సిపల్‌కు రూ.58లక్షల లబ్ధిదారులకు అందస్తున్నారని అన్నారు.అంతేకాకుండా కళ్యాణలక్ష్మీ,షాదీముబారక్ పథకాలతో ప్రతి ఆడబిడ్డ్ద ఆసరా కోసం రూ.1,00,116 అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందని అన్నారు.భారత దేశంలోనే ఏ రాష్ట్రంలోని లేని అనేక విభిన్నమైన సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి యావత్ దేశానికే సరికొత్త సందేశం అందించారని అన్నారు.

కుల వృత్తుల కుటుంబాలలో వెలుగులు నింపాలని ఉద్దేశంతో వారికి ఆర్థికంగా రూ.లక్ష అందించాలని సరికొత్త పథకం ప్రవేశ పెట్టడడం జరిగిందని నియోజకవర్గంలోని కుల వృత్తుల వారు ప్రతి ఒక్కరు దరఖాస్తులు చేసుకోవాలని వారు సూచించారు.ఒకటి,రెండు రోజుల్లో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపడతామని అన్నారు.గృహలక్ష్మీ పథకం ద్వారా స్థలమున్న వారికి త్వరలోనే మూడు ల క్షల రూపాయలు అందజేస్తామని అన్నారు.అనంతరం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ,షాదీముబారక్,సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు.కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ శాసం రామకృష్ణ,మున్సిపల్ చైర్‌పర్సన్ మ్యాకల శిరీష,జెడ్పిటిసి ప్రకాష్‌రెడ్డి,ఎంపిపి మధుకర్‌రావు,సింగల్ విండో చైర్మన్ తూం భీంరెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి,మున్సిపల్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు మ్యాకల రాజేష్,వైస్ ఎంపిపి సాయిలు,తహాశీల్దార్ మమత,ఎంపిడిఓ వెంకటయ్యలతో పాటు కౌన్సిలర్లు, స ర్పంచులు,ఎంపిటిసిలు,రైతులు,మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News