Monday, December 23, 2024

గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

Welfare for tribals in Telangana

 

మహబూబ్ నగర్: 70 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన అడవి బిడ్డలను గుర్తించామని, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.  శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గిరిజన ఉద్యోగుల సంఘ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  మహబూబ్ నగర్ జిల్లాలో గిరిజనుల కోసం13 కోట్ల రూపాయల వ్యయంతో సేవాలాల్ మహారాజ్ భవనంతో పాటు, గిరిజన మహిళా ఉద్యోగినుల వసతి గృహం , గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల, ఉద్యోగుల సంఘ భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. అందరితో సమానంగా గిరిజనులు ఎదగాలని రైతు బంధు, రైతు బీమా,ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, 70 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చి దిద్దిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకే దక్కుతుందన్నారు. తండాలకు కూడా కోట్ల రూపాయలను వెచ్చించి బిటి రహదారులను నిర్మిస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.

మున్సిపల్ చైర్మన్ కె సి నరసింహులు, వైస్ చైర్మన్ గణేష్, డిసిసిబి ఉపాధ్యక్షులు వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, గిరిజన సేవా సంఘం అధ్యక్షులు రాజు నాయక్, ఉద్యోగుల సంఘం కార్యదర్శి చందర్ నాయక్, పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎల్ బి లక్ష్మీకాంత్ రాథోడ్, ఉద్యోగుల సంఘం కార్యదర్శి యాదగిరి, లక్ష్మణ్ నాయక్, ఎస్సి ఎస్టి కమిషన్ మాజీ సభ్యులు రామ్ బల్ నాయక్, తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం గోవింద నాయక్, లక్ష్మణ్ నాయక్, బాలనగర్ జడ్పిటిసి కళ్యాణి లక్ష్మణ్ నాయక్, మోతిలాల్, కౌన్సిలర్లు లక్ష్మణ్, విట్టల్ నాయక్ , రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ అధినేత శేఖర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ జె.ఇశ్రా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News