Saturday, November 16, 2024

జర్నలిస్టులతో టిఆర్‌ఎస్‌కు ఉన్నది పేగుబంధం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Welfare Fund for Journalists: KTR

హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణ జర్నలిస్టుల కుటుంబాలకు సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సాయం  మంత్రి కెటిఆర్ చెక్కులు రూపంలో అందజేశారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు సంక్షేమ నిధి నుంచి సాయం చేశారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున సాయం చేస్తున్నామని చెప్పారు. పని చేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు యాబై వేల రూపాయలు చొప్పున సాయం చేస్తున్నామన్నారు. జర్నలిస్టులతో టిఆర్‌ఎస్‌కు పేగుబంధం ఉందన్నారు. జర్నలిస్టులందరికి ఇంటి స్థలాలు తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. వంద కోట్లతో జర్నలిస్టులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం మనదని చెప్పారు. మీడియా అకాడమీ ద్వారా జర్నలిస్టులకు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సాయం చేశామని, 5900 మంది జర్నలిస్టులకు జిల్లాల్లో శిక్షణ ఇచ్చామన్నారు. మీడియా అకాడమీకి అత్యున్నత ప్రమాణాలతో ఐదంతస్థుల భవనం నిర్మిస్తున్నామని కెటిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో 19500 అక్రిడేషన్ కార్డులు ఇస్తే… గుజరాత్‌లో వెయ్యి మందికే ఇచ్చారన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామన్నారు. జర్నలిస్టులకు రూ.25 కోట్ల విలువైన ఆపరేషన్లు చేయించామని, పని చేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుతున్నామని, ఒక పార్టీకి ఒకటి రెండు సీట్లు వస్తే ఎగిరెగిరి పడుతున్నారని, ప్రతి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అజేయంగా పురోగమిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎంఎల్‌ఎ క్రాంతి కిరణ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News