Monday, January 20, 2025

సకలజనుల సంక్షేమమే ధ్యేయంగా కెసిఆర్ పాలన : మంత్రి కొప్పుల

- Advertisement -
- Advertisement -

Welfare of all people is goal of KCR rule: Minister Koppula

హైదరాబాద్ : సకలజనుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన సాగిస్తున్నారని సాంఘీక, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా తెలంగాణ వాసులు, విదేశాలలో ఉన్న తెలంగాణ బిడ్డలకు మంత్రి కొప్పుల శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలన్నింటిని తొలగించి అన్ని శాస్త్రాలకు ఆది గురువైన గణేషుడిని మనమందరం భక్తిశ్రద్దలతో కొలుస్తామని, ఆరాధిస్తామని పేర్కొన్నారు. వినాయకుడి నవరాత్రోత్సవాలను ప్రజలందరూ శాంతి, సహనం, సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా సంతోషంగా జరుపుకోవాలని మంత్రి ఆకాక్షించారు. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా వాటిని గణేషుని దీవెనలతో అధిగమిస్తూ సకల జనుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News