Monday, December 23, 2024

జల్..జంగిల్.. జమీన్ సాకారం

- Advertisement -
- Advertisement -

ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కెసిఆర్ శుభాకాంక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : అడవిని నమ్ముకొని జీవించే నిష్కల్మశ హృదయులైన, ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని సిఎం కెసిఆర్ తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని (ఆగస్టు 9వ తేదీని) పురస్కరించుకుని ఆదివాసీలకు ముఖ్యమంత్రి కెసిఆర్ శుభాకాంక్షలు పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా ఆదివాసీ అభివృద్ధి కార్యాచరణను అమలు చేస్తున్నామన్నారు.

ఈ దిశగా స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్ల కాలంగా అమలు చేస్తున్న పలు పథకాలు విజయవంతంగా అమలవుతూ వారి జీవితాల్లో గుణాత్మక మార్పుకు దోహదం చేస్తున్నాయని సిఎం తెలిపారు. ‘జల్ జంగల్‌జమీన్’ అనే నినాదంతో పోరా డిన నాటి ఆదివాసీ ఆత్మగౌరవ పోరాట యోధుడు కుమురంభీం ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం అమ లు చేసి చూపిందన్నారు. అడవిలో మారుమూలన వున్న గోండు గూడాలకు గిరిజన తండాలకు కూడా మిషన్ భగీరథతో తాగునీరును, కాళేశ్వరం తదితర ప్రాజెక్టులు, మిషన్ కాకతీయతో, ఉచిత విద్యుత్ వ్యవసాయానికి సాగునీరును అందిస్తూ ‘జల్’ నినాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిజం చేసిందని సిఎం అన్నారు.

లక్షా యాభై వేల మంది ఆదివాసీలకు పట్టాలు అడవులను పునరుజ్జీవింప చేసే కార్యక్రమాలను చేపడుతూ, అటవీ భూములను రక్షణకు పకడ్భందీ చర్యలు చేపడుతూ దేశానికే ఆదర్శంగా ‘జంగల్’ను కాపాడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగా ణ అని ఆయన అన్నారు. అదే సందర్భంలో ఆదివాసీ గిరిజనుల జమీన్ హక్కును కాపాడుతూ అడవిని నమ్ముకొని పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీ గిరిజన రైతులకు పోడు పట్టాలందించామని సిఎం తెలిపారు. 4 లక్షలకు పైగా ఎకరాల పోడు భూమిని లక్షా యాభై వేలమంది ఆదివాసీలకు పట్టాలు అందించిన దేశంలోనే అతిపెద్ద మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. పట్టాలను అందుకున్న వారికి రైతుబంధు, రైతుబీమా పథకాలను వర్తింపచేస్తూ ఆదివాసీ గిరిజన రైతు కుటుంబాల వ్యవసాయానికి అండగా నిలిచామన్నారు.

‘మావ నాటే మావ రాజ్’ అనే ఆదివాసీల ప్రజాస్వామిక ఆకాంక్షను సాకారం చేస్తూ 2,471 గూ డాలను, తండాలను గ్రామ పంచాయతీలుగా చే యడమే కాకుండా అంతే సంఖ్యలో గిరిజన, ఆదివాసీ బిడ్డలను ప్రజాస్వామిక అధికార వ్యవస్థలో భాగస్వాములను చేశామని సిఎం తెలిపారు.  అదే సందర్భంలో విద్య, ఉద్యోగ రంగాల్లో ఆదివాసీ గిరిజనుల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు వారికి 10 శాతం రిజర్వేషన్‌లను అమలు చేస్తూ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. హైదరాబాద్ మధ్య బంజారా హిల్స్‌లో కోట్లాది రూపాయల విలువైన కుమురం భీం, సంత్ సేవాలాల్ పేర్లతో ఆత్మగౌరవ భవనాలను నిర్మించి ఇచ్చామని సిఎం పేర్కొన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ వారికి ఉన్నత ప్రమాణాలతో గురుకుల విద్యను, విదేశీ విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలను గౌరవించుకుంటూ వారి పండుగలైన సంత్ సేవాలాల్ జయంతి, కుమురంభీం జయంతి, వర్ధంతులు, భౌరాపూర్ జాతర, కేస్లాపూర్, నాగోబా, జంగుబాయి జాతర, నాచారం జాతరలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఆదివాసీల అభివృద్ధి, సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ సత్పలితాలనిస్తుందని, ఇదే స్పూర్తిని కొనసాగిస్తామని సిఎం స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News