గోదావరిఖని: సిఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం సంక్షేమ పాలన దిశగా ముందుకు సాగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం పాలకుర్తి, జయ్యారం, గుడిపల్లి గ్రామాల్లో రామగుండం దశాబ్ధి ప్రగతి ప్రజా చైతన్య యాత్రను ఎమ్మెల్యే చందర్ చేపట్టారు.
ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ సిఎం కెసిఆర్ సంక్షేమ పథకాలను వివరిస్తూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్న నేపథ్యంలో ప్రతి ఇంటిలో ఆనందం చోటు చేసుకుంటుందని ఆయన అన్నారు. సమైక్య పాలనలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉండేదని, రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఉండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేగాకుం ప్రజల జీవితాల్లో ఎటువంటి మెరుగైన సంక్షస్త్రమం లేకుండా ఉండేదని అన్నారు. నిరుపేద బతుకులు నానాటికి దిగజారే పరిస్థితి ఉండేదని అన్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తెలంగాణ ప్రాంతం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేకపోయిందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ తరువాత సమూలంగా మార్పులు జరిగాయని చెప్పారు.
ఇలాంటి పాలనే తెలంగాణకు అవసరమని, రానున్న రోజుల్లో కెసిఆర్‌ను మూడవ సారిగా ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్‌ఎంపిపి ఎర్రం స్వామి, సర్పంచ్‌లు పున్నం శారద, కొప్పు పుష్పలత రాజేశం, మల్లెత్తు లశ్రీనివాస్, దుర్గం జగన్, గొండ్ర చందర్, ఎంపిటిసి గంగాధరి రమేష్, సింగల్ విండో చైర్మన్ మామిడాల ప్రభాకర్, నాయకులు ఇంజపురి నవీన్, అల్లం రాజయ్య, మదన్ మోహన్ రావు, గొల్లపల్లి విష్ణు గౌడ్, గాజుల ప్రసాద్ తదితరులున్నారు.