Monday, December 23, 2024

కాంగ్రెస్‌తోనే రాష్ట్రంలో సంక్షేమ పాలన

- Advertisement -
- Advertisement -

రాజంపేట్ : కాంగ్రెస్ పార్టీతోనే దేశంలో, రాష్ట్రంలో మహిళలకు సంక్షేమ పాలన సాధ్యమౌతుందని మాజీ మంత్రి, మండలి ప్రతిపక్షనేత మహ్మద్‌ షబ్బీర్‌అలీ అన్నారు. శనివారం రాజంపేట్ మండలంల నుండి మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా షబ్బీర్‌అలీ పార్టీలోకి చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ బీడీ కార్మికులకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు తెలంగాణ ప్రభుత్వంలో భద్రత కరువైందని అన్నారు. స్వయం సహాయక సంఘాలను సైతం ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధ్ది జరుగుతుందనే నమ్మకంతో భారీగా మహిళలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు. నేడు రాష్ట్రంలో మహిళలపై అనేక సంఘటనలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందేలా కృషి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు యాదవరెడ్డి, సీనియర్ నాయకులు వీరన్న పటేల్, బాలకిషన్, రాష్ట్ర యూత్ నాయకులు ఇలియాస్, మండల యువజన నాయకులు అంకం కృష్ణరావు, రాజంపేట్ పట్టణ అద్యక్షులు గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News