Wednesday, January 22, 2025

బిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సంక్షేమ పాలన

- Advertisement -
- Advertisement -
  • అభివృద్ధిని చూసి బిఆర్‌ఎస్ పార్టీలో చేరికలు
  • వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

కోట్‌పల్లి: రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభత్వంతోనే నాణ్యమైన సంక్షేమ మంచి పాలన జరుగుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం కోట్‌పల్లి మండల పరిధిలోని మోత్కుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సినియర్ నాయకుడు ఫయాజోద్దిన్, శేఖర్‌గౌడ్, మండల్ వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షులు విఠలచారి వారి అనుచరులు వికారాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. కేసిఆర్ నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది చూసి వికారాబాద్ నియోజకవర్గంలోని ప్రజలంతా బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు.

గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కేవలం బిఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. పార్టీకి చేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ తగిన గుర్తింపు కల్పిస్తుందని ఇందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి శ్రీనివాస్‌రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు సుందరి అనిల్, పిఎసిఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, మండల్ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు వెంకటేష్‌యాదవ్, మండల్ వైస్ ఎంపిపి ఉమాదేవి నర్సిములు, సర్పంచ్ పాండురంగారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ దశరథ్‌గౌడ్, యూత్ అధ్యక్షులు కొండల్‌రెడ్డి, వివిధ గ్రామాల బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News