Wednesday, November 13, 2024

సమైక్యంలో సంక్షోభం.. స్వరాష్ట్రంలో సంక్షేమం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో అడుగడుగునా సంక్షోభం ఎదుర్కొన్నామని, అదే స్వరాష్ట్రంలో గడప గడప కు సంక్షేమం అందుతోందని ప్రతి కుటుంబంలో వెలకట్టలేని సంతోషం వెల్లివిరస్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. శుక్రవారం తెలంగాణలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని, లబ్ధిదారుడు లేని కుటుంబం లేదని చెప్పారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తెలం గాణ నలుమూలలా సంక్షేమ సంబురాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఒక్క సంక్షేమ రంగానికే ఏటా 50 వేల కోట్లకు పైగా నిధులు చరిత్రలో ఏ పాలకుడు చేయని సాహసమిది అని అన్నారు. ఆలోచనకు కూడా అందని భారీ మొత్తమిది అని అన్నారు. దేశ సంక్షేమ రంగం చరిత్రలోనే సరికొత్త అధ్యాయమిది అని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో అందుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలను ట్విట్టర్‌లో పెట్టారు. ఆసరా: కనీస జీవన భద్రత కల్పిస్తూ రాష్ట్రంలోని 44,12,882 మందికి ఆసరా పెన్షన్లు ప్రభుత్వం అందిస్తోందన్నారు.

రైతు బంధు: రైతుకున్న పెట్టుబడి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకున్న వినూత్నమైన నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి సైతం కొనియా డిందని గుర్తు చేశారు. ఎకరానికి సాలుకు పదివేల రూపాయల సాయం అందిస్తోందన్నారు. రైతు బీమా: రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే 10 రోజుల్లోగా 5 లక్షల రూపాయల బీమా అందించి, ఆ కుటుంబానికి అండగా ప్రభుత్వం నిలుస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన పేదింటి మహిళలకు ఆర్థిక సాయంతో పాటు కనీస అవసరాలు తీర్చే మానవతా దృక్పథమైన ఆలోచన కేసీఆర్ కిట్ అని వెల్లడించారు. పేదింటి యువతుల వివాహం ఆ కుటుంబానికి భారం కాకూడదనే ఉద్దేశ్యంతో లక్షకు పైగా ఆర్థిక సాయం కళ్యాణలక్ష్మీ/షాదీ ముబారక్ ద్వారా ప్రభుత్వం అందజేస్తోందన్నారు.

దళితులను స్వయం సమృద్ధులుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు పది లక్షల రూపాయల వరకూ ఆర్థిక సాయాన్ని దళిత బంధు పథకం కింద ఉచితంగా ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. కంటిచూపు సమస్యతో బాధపడే వారికి ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించి అవసరం మేర కళ్లద్దాలు అందించి కంటి వెలుగు పథకం ద్వారా సాయం అందజేస్తున్నామ న్నారు. తెలంగాణలోని విద్యాలయాల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతుండటం దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా గురుకులాలు ఏర్పాటుచేసి భోజనం సదుపాయంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థులను తీర్చిదిద్దుతోంది సిఎం కెసిఆర్ ప్రభుత్వమేనన్నారు.

ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ద్వారా దళిత, గిరిజన, బిసి, ఈబిసి విద్యార్థులు విదేశీ ఉన్నత విద్యను అభ్యసించేందుకు రూ.5 లక్షల వరకూ ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవానంతరం కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లు అందుకుని రక్తహీనత లాంటి ప్రధాన సమస్యను తెలంగాణ తల్లులు అధిగమిస్తున్నారన్నారు. ఇదీ కాకుండా కుల వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న బీసీ కుటుంబాలకు ముడిసరుకు కొనుగోలు, పనిముట్ల కొనుగోలు కోసం ప్రభుత్వం లక్ష ఆర్థిక సాయం అందజేస్తోందని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News